Tuesday, May 7, 2024
- Advertisement -

పవన్ కళ్యాన్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ : మంత్రి పెద్దిరెడ్డి

- Advertisement -

గత కొంత కాలంగా ఏపిలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. పంచాయితీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించింది. అయితే ఎన్నిక ప్రక్రియలో అధికార పార్టీ అన్యాయాలకు పాల్పపడిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. దీనికి ధీటుగా సీఎం జగన్ తీసుకు వస్తున్న పథకాలకు మెచ్చుకొని ప్రజలు పదే పదే పట్టం కడుతున్నారని అంటున్నారు.

తాజాగా ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జనసేనాని పవన్ కల్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ఒక పొలిటికల్ పెయిడ్ ఆర్టిస్ట్ అని అభివర్ణించారు. చంద్రబాబు దత్తపుత్రడని అన్నారు. మొన్నటి వరకు పాచిపోయిన లడ్డూ ప్రజలకు బీజేపీ ఇచ్చిందని విమర్శించిన ఆయన ఇప్పుడు ఆ లడ్డూనే ఇష్టంగా తింటున్నారని అన్నారు. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చని బీజేపీకి తిరుపతిలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.

తిరుపతిలో వైసీపీ ఓడిపోతే 22 మంది ఎంపీలు రాజీనామా చేస్తారని, టీడీపీ ఓడిపోతే ముగ్గురు ఎంపీలు సహా రఘురామకృష్ణరాజుతో కూడా రాజీనామా చేయిస్తారా? అని ప్రతిసవాల్ విసిరారు. ప్రజల మేలు కోరే మనసున్న మనిషి సీఎం జగన్ అన్నారు. తిరుపతిలో సీఎం జగన్ సభ రద్దుకు కరోనా వ్యాప్తే కారణమని స్పష్టం చేశారు. రోజుకు 3 వేల కేసులు వస్తుంటే బాధ్యతగల సీఎంగా జగన్ సరైన నిర్ణయం తీసుకున్నారని పెద్దిరెడ్డి తెలిపారు. 

బెంగాల్ హా.. మజాకా.. బాంబులు హల్ చల్..!

మళ్ళీ రికార్డ్ స్థాయిలో.. వణుకుతున్న తెలంగాణా..!

పవన్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. అమెజాన్ ప్రైమ్‌లో ‘వకీల్‌ సాబ్‌’

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -