Thursday, May 9, 2024
- Advertisement -

బాబు గుండెదడకు కారణమేంటో తెలుసా? మోడీ వ్యూహం ఏంటంటే?

- Advertisement -

చంద్రబాబునాయుడులో భయం పీక్స్‌కి చేరింది. టిడిపి నేతలందరూ కూడా ఏ క్షణం ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతూ ఉన్నారు. ముందు జాగ్రత్తగా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పోరాడుతున్నందుకే ఈ దాడులు………. ఇది తెలుగు వాళ్ళందరికీ అవమానం…… తెలుగు వారి ఆత్మాభిమానంపై దాడి అంటూ వ్యర్థ ప్రేలాపనలతో అరిచిగీపెడుతున్నారు. అయితే ప్రజలు మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. కిరణ్ కుమార్‌రెడ్డికి మద్దతునిస్తూ సోనిియాతో కుమ్మక్కయిన చంద్రబాబు చాలా తెలివిగా శతృవుకి శతృవు మిత్రుడే అన్న ఫార్ములాను ఫాలో అయి చీకటి ఒప్పందాలతో జగన్‌ని దెబ్బకొట్టాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి చివరి రోజుల నుంచీ కూడా దేశంలోనే నంబర్ ఒన్ వ్యాపారసంస్థ, చంద్రబాబులతో సహా చాలా మంది కుట్ర వ్యవహారాలు అందరికీ తెలిసినవే. చంద్రబాబే స్వయంగా చీకట్లో చిదంబరాన్ని కలవడం, రహస్య వ్యవహారాలతోనే జగన్‌కి తీవ్రస్థాయిలో నష్టం కలిగించాడు. విచరాణ అధికారులను కూడా మేనేజ్ చేశాడు. నాడు ఇవే దాడులు జగన్ సంస్థలపై జరుగుతూ ఉంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు సంబరపడుతూ అక్రమాలు, అవినీతి బయటపడిపోతున్నాయని పేజీలకు పేజీల అచ్చేయడంతో పాటు రోజుల పాటు టీవీలలో డిస్కషన్స్ పెట్టాయి.

ఇప్పుడు అదే సినిమా చంద్రబాబుకు చూపిస్తున్నాడు మోడీ. చంద్రబాబు అయినా డైరెక్ట్‌గా సోనియాతో కుమ్మక్కయినట్టుగా బయటపడింది. కానీ వైఎస్ జగన్ మాత్రం అటు కేసీఆర్‌తో కానీ, ఇటు మోడీతో కానీ రాసుకు పూసుకు తిరుగుతున్నది లేదు. తన అవినీతి వ్యవహారాలు ఎక్కడ బయటపడతాయో అని మోడీని తిట్టమని జగన్‌ని కూడా డిమాండ్ చేస్తున్నాడు చంద్రబాబు. కానీ బాబుకు నష్టం జరుగుతుంటే వైఎస్ జగన్ వచ్చి బాబు తరపున పోరాటం చేయమని అడగడం మాత్రం ఢిల్లీ స్థాయి రాజకీయాలను పరిశీలిస్తున్న విశ్లేషకులను కూడా ఆశ్ఛర్యపరుస్తోంది. బాబు డ్రామాలు అలానే ఉంటాయి. వైఎస్ జగన్ కేసులు, దాడులు జరుగుతున్నప్పుడు ఇదే చంద్రబాబు ఏం చేశాడు? జగన్‌కి మద్దతుగా నిలిచాడా?

ఇక నరేంద్రమోడీ కూడా చాలా తెలివిగా చంద్రబాబును కార్నర్ చేశాడు. చంద్రబాబు బలం ఎప్పుడూ కూడా ఆయన మీడియా మద్దతుదారులు, బినామీల ఆర్థిక బలంపైనే ఉంటుంది. ఇప్పుడు మోడీ ఆ బలంపైనే దెబ్బకొడుతున్నారు. లీడర్ సినిమాలో చూపించినట్టుగా చంద్రబాబుని అస్సలు టచ్ చేయకుండా చంద్రబాబుకు ఆర్థికవనరులు సమకూరుస్తారు………2014లో కూడా టిడిపి గెలుపుకు వందల కోట్లు ఖర్చుపెట్టారు అన్న ఆరోపణలున్న వాళ్ళపై ఐటి దాడులు జరుగుతున్నాయి. ఇంకో విషయం ఏంటంటే ఈ జనాలు అందరికీ ఓటుకు కోట్లు వ్యవహారంతో సంబంధం ఉండడం. తెలంగాణాలో కేసీఆర్‌ని ఓడించాలని కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోవడం, కాంగ్రెస్ గెలుపు కోసం వందల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణాకు తరలిస్తుండడం లాంటివి కేసీఆర్‌కి కిర్రెక్కించేలా చేశాయి. అందుకే ఇప్పుడు కేసీఆర్ కూడా ఓటుకు నోటు అస్త్రాన్ని బయటకు తీశాడు.

మొత్తంగా చూస్తే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ టైంలో సంపాదించుకున్న చంద్రబాబు ఆర్థిక వనరులకు, బినామీ ఆస్తులకు ప్రమాదం ముంచుకొచ్చినట్టే కనిపిస్తోంది. మోడీ కూడా చాలా తెలివిగా చంద్రబాబును అస్సలు టచ్ చేయకుండా……బాబు బినామీలు, ఆర్థిక వనరులపై చావుదెబ్బకొట్టబోతున్నాడు. మొత్తంగా చూస్తే 2014లో అధికారంలోకి రావడానికి తన ఇమేజ్‌ని అడ్డుపెట్టుకున్న చంద్రబాబు………….తనతో పొత్తులో ఉండగానే కాంగ్రెస్‌తో చీకటి బంధం నడిపి……..ఇప్పుడు డైరెక్ట్‌గా పొత్తుపెట్టుకుని తనను విలన్‌గా చిత్రీకరిస్తున్న బాబును దెబ్బతీయాలన్నీ ఉద్ధేశ్యం మోడీకి ఉంటే ఉండొచ్చుగాక………బాబు చేస్తోంది కూడా అదే కదా…….ఈ రాజకీయ నాటకంతో ప్రజలకు ఏం సంబంధం? మోడీని ఆపేశక్తి డిల్లీ పెద్దాయనకు, మీడియా రాజగురువుకు కూడా సాధ్యం కావడంలేదన్న విషయం అర్థం చేసుకున్న చంద్రబాబు……. మోడీ వ్యూహాలను రాజకీయంగా ఎదుర్కోలేక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తన ఒక్కడి కోసం, తన అధికారం కోసం పోరాటం చేయండి అని బాబు దేబిరిస్తూ అడగడం మాత్రం ప్రజల్లో ఏ మాత్రం సానుభూతి తెచ్చిపెట్టకపోగా………రాజకీయంగాను, పరిపాలన విషయంలోనూ, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలోనూ చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడన్న అభిప్రాయాన్నే ఎక్కువగా కలిగిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -