Monday, May 6, 2024
- Advertisement -

పాపం అఖిలప్రియ………. ఏదో మాట్లాడాలనుకుని కామెడీ చేసిపడేసిందిగా?

- Advertisement -

చంద్రబాబు, లోకేష్‌ల నుంచి స్ఫూర్తి పొందుతున్నారో ఏమోకానీ టిడిపి నాయకులందరూ కూడా ఊర మాస్ కామెడీ చేసేస్తున్నారు. అందరూ కూడా స్థాయికి మించి మాట్లాడేసేవాళ్ళే. కేరళ మొత్తాన్ని ఆదుకునే స్థాయిలో రైస్ పంపిస్తున్నామని గొప్పగా చెప్పుకున్న చంద్రబాబు……..అంతా కూడా మూడులారీల్లో పంపిస్తున్నాం అనేసరికి అందరూ ఫక్కున నవ్వేశారు. మూడు లారీల్లో బియ్యం బస్తాలు పంపిస్తూ ఈ రేంజ్‌లో బిల్డప్ ఇవ్వాలా అని సెటైర్స్ వేశారు. ఇక మోడీకి ప్రత్యర్థిగా చంద్రబాబును గొప్పగా చూపిద్దామనుకుంటే మోడీ ఢీకొనే సత్తా చంద్రబాబుకు ఉందా అన్న సర్వే చేస్తే బాబును సమర్థించిన వాళ్ళు కేవలం ఒక్క శాతం మాత్రమే. అదీ టిడిపి నాయకుల స్థాయి. అయినప్పటికీ టిడిపి నాయకులు మాత్రం ఎప్పటికప్పుడు మాటలు కోటలు దాటిస్తూ కామెడీ చేస్తున్నారు.

తాజాగా మోడీకి వ్యతిరేకంగా భారీగా విమర్శనా ప్రకటనలు చేయాలనుకున్న అఖిల ప్రియ కోటి సైకిళ్ళతో ఢిల్లీని ముట్టడిస్తామని చెప్పారు. కోటి మంది సైకిళ్ళపై ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తారట. అఖిల ప్రియ మాటలు విన్న నెటిజనులు ఓ స్థాయిలో సెటైర్స్ వేస్తున్నారు. ఢిల్లీ ఎక్కడుందో కూడా తెలియకుండానే ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తాం, ఢిల్లీపై గెలుస్తాం అని టిడిపి నాయకులు కామెడీ చేస్తున్నారా అని సోషల్ మీడియా జనాలు అడుగుతున్నారు. ఢిల్లీకి సైకిల్ పై వెళ్ళడం అనేది మామూలు జనాలకు ఎంతటి అసాధ్యమో చెప్పనవసరం లేదు.

ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వరకూ సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళడమంటే అఖిలప్రియతో సహా టిడిపి నాయకులకు ఏ ఒక్కరికీ సాధ్యం కాని విషయమే అని చెప్పడానికి సందేహం అక్కర్లేదు. అలాంటిది అఖిలప్రియ మాత్రం టిడిపి ఆధ్వర్యంలో కోటిమందిమి సైకిళ్ళపై ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్ కోసం పోరాటం చేస్తాం అని భారీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏం చెప్పినా కవర్ చేయడానికి భజన మీడియా ఉందన్న నమ్మకమో………. లేక ఆంధ్రప్రదేశ్ జనాలకు అస్సలు తెలివితేటలు లేవు అన్న ఫీలింగ్ ఏమైనా చంద్రబాబుతో సహా టిడిపి నాయలకులందరికీ ఉందో ఏమో తెలియదు కానీ మరీ ఈ స్థాయి కామెడీ డైలాగులు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనను పెంచుతున్నాయి. వారం రోజులు డైటింగ్ కోసం దీక్ష చేస్తా అన్న మురళీ మోహన్ కామెడీ నుంచి టిడిపి నాయకులందరికీ కూడా అధికారాన్ని అప్పగించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదన మరీ కామెడీగా కనిపిస్తోంది అన్నది మాత్రం కంటికి కనిపిస్తున్న నిజం అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -