- Advertisement -

40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీకి ఎన్ని క‌ష్టాలు….!

- Advertisement -

40 సంత్స‌రాల రాజ‌కీయ ఇండ‌స్ట్రీ అని చెప్పుకొనే చంద్ర‌బాబుకు పీక‌ల్లోతు క‌ష్టాల్లో కూరుకుపోయారు. బాబు రాజ‌కీయ చ‌తుర‌త ప‌నిచేయ‌డంలేదు. నిన్న‌టి వ‌ర‌కు జ‌గ‌నే ప్ర‌త్య‌ర్థిగా ఉన్నారు. కాని ఇప్పుడు ప‌వ‌న్ కూడా బాబుకు కిందా పైనా వాయించేస్తున్నారు. ఇప్ప‌టికే జ‌గ‌న్ నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌ను ఎదొర్కోలేక బాబు త‌ప బొప్పి క‌ట్టింది. ఇప్పుడు ప‌వ‌న్ కూడా దాడి చేయ‌డం మొద‌లు పెట్టారు.

ఒక వైపు న‌రేంద్ర మోదీ, మ‌రో వైపు జ‌గ‌న్‌, ప‌వ‌న్‌లు ముగ్గురూ బాబును రౌండ‌ప్‌చేసి బ్యాండ్ బాజా మోగిస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు టీడీపీకి అనుకూలంగా మాట్లాడిన ప‌వ‌న్ గుంటూరులో జ‌రిగిన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో ప్ర‌భుత్వం, బాబు, లోకేష్‌ల‌ను దుమ్ము దులిపారు. బాబు హయాంలో జ‌రిగిన అవినీతి, అక్ర‌మాలు, ప్ర‌భుత్వ అధికారుల‌పై దాడులు, ఇసుక‌మాఫియా, ల్యాండ్ మాఫియా పెరిగిపోయాయ‌ని తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు.

ఇక జ‌గ‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. గ‌త నాలుగు సంవ‌త్స‌రాలుగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై పోరాడుతున్నారు. బాబుకు నిద్ర‌ప‌ట్ట‌కుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతున్నారు. ప్ర‌త్యేక‌హోదాపై జ‌గ‌న్ తీసుకున్న స్టాండ్‌తో రాష్ట్ర‌రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఇక ప్ర‌త్యేక‌హోదాపై కేంద్రంపై జ‌గ‌న్ అవిశ్వాసం బాబుకు నిద్ర‌లేకుండా చేస్తున్నాయి. బాబుకు ఏదారి లేక‌పోవ‌డంతో చివ‌ర‌కు వైసీపీ పెట్టే అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సి వ‌చ్చింది. మ‌ద్ద‌తు ఇవ్వ‌క‌పోతే ప్ర‌జ‌లు బాబును ఛీత్క‌రించ‌కుంటార‌న‌డంలో సందేహంలేదు.

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకూడా బాబు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నారు. ఏపీ అభివృద్ధికి ఇచ్చిన నిధులు లెక్క‌లు చెప్ప‌క‌పోవ‌డంతో బాబును న‌మ్మ‌ట్లేదు. మ‌రో వైపు ఓటుకు నోటు కేసులో బాబు ఇరుక్కుపోయార‌ని ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు. మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డివేస్తే భ‌గ్గుమంటోంది. రాష్ట్ర అభివృద్ధి విష‌య‌లో బాబును కేంద్రం న‌మ్మ‌డంలేదు. ఇలా ప‌వ‌న్‌, జ‌గ‌న్ మ‌రో ప‌క్క మోదీ ముగ్గురూ బాబును రౌండ‌ప్ చేయ‌డంతో బాబుకు దిక్కుతోచ‌డంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -