Friday, May 3, 2024
- Advertisement -

పాద‌యాత్ర‌పై పార్టీ నేత‌ల్లో డైలామా…

- Advertisement -

2019 ఎన్నికలలో అధికార‌మే ల‌క్ష్యంగా ప్ర‌ణాలిక‌ల‌ను సిద్దం చేస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వైసీపీ చీఫ్ జగన్ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహ‌న గురించి ఇప్ప‌టికె ప్ర‌క‌టించారు. అయితే జగన్‌పై కోర్టు కేసులున్నాయి. దీంతో పాదయాత్ర నిలిచిపోకుండా పాదయాత్ర కొనసాగించాలంటే ఏం చేయాలనే దానిపై కూడ ఆ పార్టీ నాయకత్వం చర్చిస్తోంది.

జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఆ పార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహర‌చ‌న చేస్తున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగేలా ఆ పార్టీ నేతలు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా రాష్ట్రంలో వైసీపీ పరిస్థితిపై ప్రశాంత్ కిషోర్ ఓ నివేదికను పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ఇచ్చారనే సమాచారం. 2019 ఎన్నికల్లో విజయం కోసం చేపట్టాల్సిన చర్యలపై కసరత్తు చేస్తోంది.

పాద‌యాత్ర‌కోసం త‌న‌కు మిన‌హాయింపు ఇవ్వాల‌ని జ‌గ‌న్ పెట్టుకున్న పిటిష‌న్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో జ‌గ‌న్ ప్ర‌తి శుక్ర‌వారం సీబీఐ కోర్టుకు హాజ‌రు కావాల్సి ఉంటుంది. అయితే పాదయాత్రకు వారంలో ఒకరోజు పాటు కోర్టు వాయిదాలకు విరామం ఇస్తే టీడీపీ నేతల నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉందని వైసీపీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.

సంస్థాగత నిర్మాణం లేకపోవడమే వైసీపీకి నష్టం నంద్యాల, కాకినాడ ఫలితాలను సుదీర్ఘంగా విశ్లేషించి తన బృందాలతో నివేదికలను తెప్పించిన ప్రశాంత్ కిషోర్, ఏపీలో పార్టీ పరిస్థితి ఎలా ఉందో వివరిస్తూ ఓ రిపోర్టును జగన్‌కు అందించారు. పార్టీకి అంతర్గత నిర్మాణం లేకపోవడమే పెద్ద మైనస్‌గా తేల్చారని సమాచారం. పార్టీ బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.

పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతం చేసేందుకు ఒక్కొక్క బూత్ పరిధి నుంచి పది మంది చొప్పున క్రియాశీల కార్యకర్తలను ఎంపిక చేయనున్నారు.. వీరికి హైదరాబాద్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. వీరంతా తమకు కేటాయించిన పోలింగ్ బూత్‌ల పరిధిలోని ఇళ్లకు వెళ్లి చంద్రబాబు పాలనలో లోపాలు చెప్పి జగన్ ప్రకటించిన నవరత్నాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించనున్నారు.. ఈ మొత్తం వ్యవహారంలో పీకేనే కీలక పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. మ‌రి పీకె వ్యూహాలు ఎలాంటి ఫ‌లితాలు ఇస్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -