Monday, May 13, 2024
- Advertisement -

నంద్యాల బైపోల్ కు ఆర్కేన‌గ‌ర్‌, పులివెందుల‌, నంద్యాల‌కు లింకేంటో తెలుసా….?

- Advertisement -

ఏపీలో ఎక్క‌డ చూసినా నంద్యాల బైపోల్ గురించే చ‌ర్చ‌. గ‌త కొన్న సంవ‌త్స‌రాలుగాఉపఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గం ఉపఎన్నిక ప్రముఖ స్థానంలో నిలుస్తోంది. ఎందుకు ఇంత ప్రాధాన్య‌త ఏర్ప‌డించ‌ది. ఆర్కేన‌గ‌ర్‌,పులివేందుల‌,నంద్యాల ఉప ఎన్నిక‌కు సంద‌బంధంఏంటి…?

భూమా నాగిరెడ్డి హఠాన్మరణం నేపథ్యంలో జరుగుతున్న ఈ ఉపఎన్నికలో నెగ్గి పరువు నిలుపుకోవాలని అధికార ,వైసీపీ తీవ్రంగా పోటీ ప‌డుతున్నాయి. ప్రజలు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొని ఓట్లు వేస్తే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో నంద్యాల బై పోల్స్‌తో పరిస్థితి అర్థం అవుతుంది.రాయలసీమలో ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ప్రబలుతోంది. దీనికంతటికీ సాక్ష్యం కాబోతోంది నంద్యాల ఉపఎన్నిక.
పులివెందుల విషయంలో గతంలో కాంగ్రెస్‌ పార్టీ అనుసరించిన ప్రణాళిక, ఆర్కేనగర్‌లో శశికళ వర్గం అనుసరించిన వ్యూహాలు గుర్త‌కురాక‌మాన‌వు.పులివెందుల నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భావం తర్వాత వైఎస్‌ విజయమ్మ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ వైఎస్‌ వివేకానంద రెడ్డిని బరిలోకి దించింది.

కిరణ్‌ కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఆ సమయంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు.. ఏపీ కేబినెట్‌ మొత్తం పులివెందుల, కడప పార్లమెంటరీ నియోజకవర్గాల్లో దిగిపోయింది. ఆఖరికి వీహెచ్‌ లాంటి వాళ్లు కూడా వచ్చి ప్రచారం చేశారు.చివ‌రికి ఏమ‌య్యిందో అంద‌రికి తెలిసిందే.ఇప్పుడు అదే ప‌రిస్థితి టీడీపీకి ఎదుర‌వుతుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

దాదాపు ఆరుమంది మంత్రులకు నంద్యాల ఉపఎన్నికల బాధ్యతను అప్పగించారట చంద్రబాబు. కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు ఇద్దరు.. అనంతపురం జిల్లాకు చెందిన ఒకమంత్రి, వీరుగాక మరో ముగ్గురు. వీరిలో మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ కూడా ఉన్నారు. ఇప్పటికే నారాయణ నంద్యాల్లో పలుమార్లు పర్యటించేశారు.నారాయ‌న‌ను డ‌బ్బులు పంచే వ్య‌క్తిగానే చూస్తున్నారు ప్ర‌జ‌లు.

డబ్బులు పంచి గెలుచుకోవడానికి ఇది ఎంపీటీసీ, జడ్పీటీసీల ఓట్లతో జరిగే ఎన్నికలు కావు. ప్రజలు ప్రత్యక్షంగా ఓట్లు వేసే ఎన్నికలు. చూడాలి ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పును ఇస్తారో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -