Sunday, May 5, 2024
- Advertisement -

బాబు టీంనుంచి ఆరుగురికి ఉద్వాస‌న త‌ప్ప‌దా…

- Advertisement -

త్వ‌ర‌లో జ‌రిగె మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో సీనియ‌ర్‌ల‌కు సీఎం చంద్ర‌బాబు షాక్ ఇవ్వ‌నున్నార‌నె వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం మంత్రి వ‌ర్గంలో ప‌లువురు సీనియ‌ర్ల ప‌నితీరుపై బాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంట‌. కొంద‌రు మంత్రులు పార్టీని బ‌హిరంగంగానె విమ‌ర్శించిన సంద‌ర్బాలు ఉన్నాయి. వాట‌న్నింటిని దృష్టిలో పెట్టుకొని వారిని మార్చాల‌నె ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు బాబు.

మంత్రి వ‌ర్గంలోకి కొత్త వారిని ఎంమందిని తీసుకుంటారో తెలియ‌క‌పోయినా కేబినేట్‌నుంచి తొల‌గించే వారి పేర్లు మాత్రం చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. జాబితాలో శిద్దా రాఘవరావు, పి. నారాయణ, అఖిలప్రియ, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడిలో ఒకరిని, నక్కా ఆనందబాబు పేర్లు వినబడుతున్నాయి. తొలగించే వారిలో పనితీరు ఆధారంగానే కాకుండా పార్టీ పటిష్టం చేయటం కోసం వాడుకోవాలని చంద్రబాబు అనుకుంటున్నారట.

వచ్చే మార్చిలో రాజ్య‌స‌భ‌కు వెల్లేందుకు య‌న‌మ‌ల పేరు ఖ‌రార‌య్యింది. గంటా, నారాయణ వియ్యంకులు. ఇద్దిరినీ తప్పిస్తారా అన్నది కూడా చూడాలి. ఇద్ద‌రిని త‌ప్పించే స‌హాసం బాబు చేస్తారా అన్న అనుమానాలు క‌లుగుతున్నాయి. అచ్చెన్నాయుడు, నారాయణ, శిద్ధా రాఘవరావు, గంటా లేక చింతకాయల్లో ఒకరిని పార్టీ పటిష్టానికి ఉపయోగించుకోనున్నట్లు సమాచారం.

మంత్రివర్గంలో చోటు కోసం పలువురు సీనియర్లు ఎదరుచూస్తున్నారు. ప్రతీసారి ఆశించటం భంగపడటమే జరుగుతోంది. అటువంటి వారిలో బుచ్చయ్య చౌదరి, బండారు సత్యనారాయణమూర్తి, గౌతు శ్యామ సుందర్ శివాజి, కాగిత వెంకట్రావు, పతివాడ నారాయణ స్వామి తదితరులున్నారు. వీరిని సంతృప్తిప‌ర‌చ‌క‌పోతె భ‌విష్య‌త్తులో పార్టీకి ఇబ్బందులు బాబుకు త‌ప్ప‌వు. డిసెంబర్లో జరగబోయే మంత్రివర్గ విస్తరణే నిజంగా ఎన్నికల మంత్రివర్గం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే, ఎన్నికలకు ఉన్నది ఏడాదిన్నర మాత్రమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -