Sunday, May 5, 2024
- Advertisement -

హోదాను తొక్కేసి ప్యాకేజ్‌కి ఒకే అన్నది మేం టిడిపి నేత సోమిరెడ్డి

- Advertisement -

అబద్ధాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించే బలమైన మీడియా ఉంటే మాత్రం నిజాలు బయటకు రాకుండా ఉంటాయా? నిప్పుని నిప్పుని అని అస్తమానం చెప్పుకుంటూ ఉండే చంద్రబాబుకు నిజం నిప్పులాంటిదన్న విషయం తెలియకపోతే ఎలా? ఇప్పుడు ఆ నిజం టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్సీ, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నోటి నుంచి వచ్చింది. ఈ అమాత్యుడు కూడా తన నియోజకవర్గంలో చంద్రన్నగా పిలవబడుతూ ఉంటాడులే. అలాగే చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. గుజరాత్ గెలుపు తర్వాత నుంచీ బిజెపి నేతలు రెచ్చిపోతున్నారు. ఓటుకు నోటు భయమో, కేసుల భయమో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం బిజెపిని ఏమీ అనొద్దని టిడిపి నేతల నోరు నొక్కేస్తున్నాడు. ఇలాంటి సందర్భంలోనే టిడిపి నేతలకు కొన్ని బ్రహ్మాండమైన ఐఢియాలు వస్తూ ఉంటాయి. అంటే పెద్దగా ఏమీ లేదు…….ఏ విషయాన్నైనా జగన్‌కి ముడిపెట్టడం. ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఆ ప్రయత్నంలోనే అడ్డంగా దొరికిపోయాడు.

ఒక టివి ఛానల్ డిబేట్‌లో పాల్గొన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి టిడిపిని విమర్శిస్తున్న బిజెపి నేతలపై ఆవేశంగా విరుచుకుపడ్డాడు. ప్రత్యేక హోదాకు మంగళం పాడేసి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నది మేము……ప్రత్యేక హోదాకు కావాలని చెప్పి పోరాటం చేస్తున్నది జగన్…అలాంటప్పుడు మోడీ ఆదేశాలకనుగుణంగా ప్రత్యేక హోదాను ఫణంగా పెట్టి మోడీకి జైకొట్టిన టిడిపిని ఎలా విమర్శిస్తారు? ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న జగన్‌ని కదా మీరు తిట్టాల్సింది అని బిజెపి నేతలకు క్లాస్ పీకాడు సోమిరెడ్డి.

అదిరిపోయింది కదా…….ఆవేశంలో అసలు నిజాలు చెప్పేశాడు సోమిరెడ్డి. పదిహేనేళ్ళ పాటు ప్రత్యేక హోదా అని చెప్పి అధికారంలోకి వచ్చింది చంద్రబాబు. ఆయన భజన మీడియా, పవన్ కళ్యాణ్‌, వెంకయ్యనాయుడులు ప్రత్యేక హోదా పేరుతో డ్రామా ఆడి ఆంద్రప్రదేశ్ ప్రజలను నమ్మించారు. అధికాంరలోకి వచ్చిన వెంటనే వంచన మొదలెట్టారు. ఆ వంచన కూడా బాబు నుంచే మొదలయ్యింది. ప్రత్యేక హోదాతో ఏం వస్తాయి? అదేమైనా అక్షయపాత్రనా అని డ్రామా మొదలెట్టిన చంద్రబాబు……ఫైనల్‌గా హోదాకు మంగళం పాడేశాడు. ఈ పాపంలో ఆంద్రజ్యోతి, ఈనాడు, పవన్ కళ్యాణ్‌లు ప్రధాన భాగస్వాములు. ఎన్నికల సమయంలో హోదానే సర్వస్వం అని రాసిన టిడిపి భజన మీడియా….ఆ హోదా రావాలంటే బాబును గెలిపించాలంది. బాబు అధికారంలోకి వచ్చాక మాత్రం హోదా వేస్ట్ అని అదే నోటితో వాగేసింది. హోదా కోసం పోరాటం చేస్తున్న జగన్‌పై కూడా విమర్శలతో విరుచుకుపడింది. ఓపెన్ హార్ట్ సర్జన్ అయితే సీమాంద్రులందరినీ కూడా తీవ్రస్థాయిలో విమర్శించాడు. అవమానించాడు. ప్రాణాధారమైన హోదాకోసం పోరాటం చేస్తున్నవాళ్ళను తెలివిలేని వాళ్ళ కింద జమకట్టాడు.

ఇక హోదా పోరు క్రెడిట్ కూడా జగన్‌కి రాకుండా చేయడం కోసం పవన్ కళ్యాణ్ చేత రెండు మూడు రోజుల షో చేయించాడు చంద్రబాబు. ఇక ఇప్పుడు ఫైనల్‌గా సోమిరెడ్డి నోటి నుంచే మొత్తం నిజాలు వచ్చేశాయి. హోదా కోసం పోరాటం చేస్తున్నది జగన్ అని సోమిరెడ్డినే చెప్పాడు. పవన్ కళ్యాణ్ హోదా పోరాటం గురించి కనీస ప్రస్తావన కూడా చెయ్యలేదు. ఎందుకంటే జగన్‌కి క్రెడిట్ రాకుండా ఉండడం కోసం బాబు చెప్పినప్పుడు హోదా పోరు పేరుతో డ్రామా ఆడుతుంటాడని చంద్రబాబుకు సన్నిహితుడైనా సోమిరెడ్డికి తెలుసు కాబట్టి. ఇక హోదాను మోడీ ఇచ్చేవాడా? లేదా? అన్నది తర్వాత విషయం. కానీ ఓటుకు నోటు కేసు తర్వాత నుంచీ మోడీ ఆదేశాలను శిరసా వహించడం, మోడీకి వ్యతిరేకంగా ఆంద్రప్రదేశ్‌లో ఎవరూ మాట్లాడకుండా చేయడం లాంటివి చాలానే చేశాడు చంద్రబాబు. ఒక రాష్ట్రానికి హోదా ఇస్తే ఇతర రాష్ట్రాల్లో కచ్చితంగా మోడీ ఇబ్బందిపడతాడు. అందుకే మోడీకి ఆ ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలను నిండా ముంచుతూ హోదాకు మంగళం పాడేశాడు చంద్రబాబు. మోడీ కోసం అంతటి త్యాగం చేసిన టిడిపిని, ఆ పార్టీ అధినేత చంద్రబాబును బిజెపి నేతలు విమర్శించడం టిడిపి సీనియర్ నేత, చంద్రబాబు కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి అయిన సోమిరెడ్డికి నచ్చలేదు. అందుకే ఆవేశపడిపోయాడు. హోదాకు మగళం పాడేసిన మమ్మల్ని కాదు….. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న జగన్‌ని విమర్శించండి అని బిజెపి నేతలకు చెప్పాడు.

టిడిపి రాజకీయం ఇలా ఉంటుంది. అధికారమే ముఖ్యం. ఓట్లేసిన ఆంద్రప్రదేశ్ ప్రజల జీవితాలు ఏమైపోతేనేం……ఇలాంటి రాజకీయానికి మద్దతు పలకడానికే పాపం పవన్ కళ్యాణ్ కూడా అష్టకష్టాలు పడుతూ ఉంటాడు. వీళ్ళు ఆంద్రప్రదేశ్ ప్రజల తరపున పోరాటం చెయ్యరు. పోరాటం చేస్తున్న జగన్‌పై విరుచుకుపడుతూ ఉంటారు. ఇతర పార్టీల వాళ్ళు కూడా వచ్చి జగన్‌ని తిట్టాలని కోరుకుంటూ ఉంటారు. ఆంద్రప్రదేశ్ ప్రజల కోసమే నా జీవితం అంకితం అని మాయ మాటలు మాత్రం గొప్పగా చెప్తూ ఉంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -