- Advertisement -

కాంగ్రెస్‌తో పొత్తు……… ఈ సారీ జనాలను ముంచరని గ్యారెంటీ ఏంటి బాబూ?

- Advertisement -

మొత్తానికి బేలన్స్ ఉన్న ఒకే ఒక్క పార్టీ కాంగ్రెస్‌తో కూడా పొత్తుకు సై అనేశాడు చంద్రబాబు. ఇక పచ్చ బ్యాచ్ మొత్తం కాంగ్రెస్‌తో టిడిపి పొత్తు ఎంత చారిత్రక అవసరమో విశ్లేషించే పనిలో బిజీగా ఉంది. అయితే ప్రజల్లో నుంచి పుట్టుకొస్తున్న ఒకే ఒక్క ప్రశ్నకు చంద్రబాబు దగ్గర సమాధానం ఉందా? సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు ఈ ప్రశ్న ట్రెండ్ అవుతూ ఉంది. ఆంధ్రజ్యోతితో సహా టిడిపి భజన మీడియా అంతా కూడా 2014లో పప్పు అని, జగన్‌తో లోపాయికారి పొత్తుపెట్టుకున్నారని ఎగతాళి చేసిన కాంగ్రెస్ నాయకులు, రాహుల్‌గాంధీని ఇప్పుడు తెలుగు ప్రజలకు హీరోలుగా చూపించే పనిలో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నీ ఇచ్చే నాయకుడు, ఆంధ్రప్రదేశ్‌ని ఉద్ధరించే కొత్తాదేవుడు రాహుల్ గాంధీనే అని టిడిపి అనుకూల టివి మేధావులు, పచ్చ జనాలు అందరూ ఊదరగొట్టడం మొదలెట్టారు. అంతా కూడా ప్రజల కోసమే బాబు పదవి కక్కుర్తి ఏమీ లేదు అని కూడా చర్చిస్తున్నారు.

అయితే ఏ ప్రజల కోసం చంద్రబాబు తనకు ఇష్టం లేకపోయినా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటున్నానని కలరింగ్ ఇస్తున్నాడో అదే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు చంద్రబాబుకు ఒకే ఒక్క ప్రశ్న సంధిస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబుతో పాటు ఆయన భజన మీడియా అంతా కూడా అప్పటి కొత్తా దేవుడు నరేంద్రమోడీని ఇలానే మోశారు. ఆంధ్రప్రదేశ్‌కి మోడీ అన్నీ చేస్తాడని చెప్పి వీళ్ళే ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించి ఓట్లు కొల్లగొట్టారు. నాలుగేళ్ళు మోడీతో కలిసి అధికారాన్ని అనుభవించాక………..నాలుగేళ్ళపాటు ఎపికి బ్రహ్మాండంగా మోడీ సాయం చేస్తున్నాడు, ప్యాకేజ్ సూపర్ అంటూ ఎపి ప్రజలను మోసం చేసి ఎన్నికల ఏడాదిలో మాత్రం సడన్‌గా టోన్ మార్చి మోడీ మోసం చేశాడు, అన్యాయం చేశాడు అని కొత్తడ్రామా మొదలెట్టారు. నేను కూడా మోడీ చేతిలో మోసపోయాను అన్న చంద్రబాబు డైలాగ్ అయితే టాప్ హైలైట్. మోడీ క్రేజ్‌తో రాష్ట్రంలో జగన్‌ని ఓడించగలిగాడు, ఆ తర్వాత కేంద్రంలో కూడా నాలుగేళ్ళు అధికారాన్ని అనుభవించాడు………..అలాగే ఓటుకు నోటు కేసుతో సహా చంద్రబాబు అవినీతి, అక్రమాలకు కూడా మోడీ గట్టిగానే కాపు కాశాడు. ఇక చంద్రబాబు మోసపోయినది ఏంటట?

ఇక ఇప్పుడు 2019లో రాహుల్‌ని ఆంధ్రప్రదేశ్ ప్రజల పాలిట కొత్తాదేవుడు అని ప్రచారం చేయబోతున్న బాబు అండ్ కో……2014లోలాగే అధికారంలోకి వస్తే……..రాహుల్ కూడా కేంద్రంలో అధికారంలోకి వస్తే అప్పుడు కూడా నాలుగేళ్ళపాటు ఇలాగే డ్రామాలు నడిపి 2024 ఎన్నికల ఏడాదిలో రాహుల్ నన్ను మోసం చేశాడు. కాంగ్రెస్ మోసం చేసింది అని చెప్పి మరోసారి ఇదే డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చంద్రబాబు చేయడని గ్యారెంటీ ఏంటి? ఈ ఒక్క ప్రశ్నకు చంద్రబాబు రెండు కళ్ళసిద్ధాంతంలాంటి అడ్డదిడ్డమైన సమాధానం కాకుండా నిజాయితీగా సమాధానం చెప్పగలడా?

అలాంటి సమాధానాలు పచ్చ బ్యాచ్ నుంచి రావు కానీ 2014లో రాహుల్‌, సోనియాల కాంగ్రెస్ ద్రోహి అన్నారు…….విభజనలో బిజెపికి కూడా సమాన పాపం ఉన్నా కూడా మోడీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మోడీకి జై కొట్టమన్నారు. ఇప్పుడు మోడీ ద్రోహి, రాహుల్, సోనియాల కాంగ్రెస్ బెస్ట్ అంటున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఐదేళ్ళపాటు పచ్చ బ్యాచ్ చేసిన మోసం, ద్రోహానికి బలయ్యాక కూడా మరోసారి గొర్రెల్లా తలలూపి జై కొట్టాలన్నమాట…………..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -