Wednesday, May 8, 2024
- Advertisement -

టీడీపీ ఆస్థాన మీడియా కొత్త స‌ర్వేలో మ‌రో సారి సంచ‌ల‌న నిజాలు….

- Advertisement -

ఇప్పుడు దేశంమంతా నంద్యాల ఉప ఎన్నిక వైపే చూస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా జ‌ర‌గ‌ని అత్యంత ఖ‌రీదైన ఎన్నిక‌గా ఇప్ప‌టికే తేలిపోయింది. ఈ ఎన్నిక ప్ర‌భుత్వానికి రెఫ‌రెండ‌మ్ లాంటిదే. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన అన్ని స‌ర్వేల‌ల్లో అన్నీ బాబుకు వ్య‌తిరేకంగా వ‌చ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా త‌న ఆస్థాన మీడియా ద్వారా బాబు సొంతంగా స‌ర్వే చేయించారంట‌. ఈస‌ర్వే రిపోర్ట్‌ను బాబుకు అందించారంట‌. రిజ‌ల్ట్స్‌ను చూస్తె బాబుకు మైండ్ బ్లాయ్ అయ్యిందంట‌.

స‌ర్వేలో ఓట్ల వారిగా చూసుకుంటె నంద్యాల‌లో 2.3 ల‌క్ష‌ల ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎక్కువ‌గా మైనారిటీ ఓట్లు 65వేల‌కు పైగానె ఉన్నాయి. ఇత‌ర సామాజిక వ‌ర్గం ఓట్లు 34 వేలు ఉన్నాయి ఈసీ లెక్క‌ల ప్ర‌కారం. బ‌లిజ 25 వేల ఓట్లు, ఆర్య‌వైశ్యులు 20 వేలు ఉన్నారు. ఇక మిగిలిన ఓటర్ల సంఖ్య‌ను క‌లిపితే 30 వేలు ఉంటారు.

శిల్పా ప‌థ‌కాలు,సంక్షేమ ప‌థ‌కాల‌వ‌ల్ల ల‌బ్ది పొందిన వారు 20 శాతం ఉన్నారు. మంత్రిగా ఉన్న స‌మ‌యంలో చేసిన అభివృద్ది 15 శాతం మంది అక‌ర్శితుల‌వుతున్నారు. శిల్పామోహ‌న్‌రెడ్డి, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు అభిమానంతో ఉన్న మైనారిటీలు చెప్పాల్సిన ప‌నిలేదు. బ‌లిజ ఓట్లుకూడా దాదాపు శిల్పా వైపె ఉన్నారు. ఆర్య‌వైశ్యుల‌కు ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటు చేస్తామ‌ని చెప్ప‌డం వైసీపీకి మ‌రింత క‌ల‌సి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయి. 80 శాతం మంది శిల్ప వైపె ఉన్నారు.

ఇలా అన్ని స‌ర్వేలు, ప‌రిస్థితులు అన్నీ వైసీపీకి అను కూలంగా ఉన్నాయ‌ని…భూమా సెంటీమెంట్ మాత్ర‌మే టీడీపీకి ఉంద‌ని అది కూడా ఇప్పుడు ప‌నిచేసె స్థితిలో లేద‌న్న‌ది స‌ర్వేలో తేలింది. అన్నీ అనుకూల‌త‌లు చూసుకుంటె శిల్పాకు దాదాపు 25 వేల నుంచి 30 వేల మెజార్టి వ‌చ్చే అవ‌కాశాం ఉందంట‌. ఈస‌ర్వే ఫిలితాలు చూస్తానె బాబుకు మైండ్ బ్లాక్ అయ్యిందంట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -