- Advertisement -

ఓట‌మి త‌ప్ప‌ద‌ని బాబుకు ముందే తెలిసిందా…?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో మార్చిలో మొత్తం 8 ఎమ్మెల్సీ స్థానాల‌ను భ‌ర్తీ చేయాల్సి ఉంది. అందులో 5 ఎమ్మెల్యే కోటా, మిగిలిన మూడు స్ధానాల్లో రెండు పట్టభద్రులు, ఒకటి ఉపాధ్యాయ కోటాలో భర్తీ కావాలి. మార్చిలో భర్తీ కావాల్సిన మూడు శాసనమండలి స్ధానాల్లో ఎన్నికల్లో టిడిపి పోటీ చేయ‌కూడ‌ద‌ని బాబు నిర్ణ‌యం తీసుకోవ‌డంతో పార్టీనేత‌లను షాక్ కు గురిచేసింది. ఎమ్మెల్యే కోటాలో భ‌ర్తీ కావాల్సిన ఐదు ఎమ్మెల్సీ స్థానాల విష‌యంలో టీడీపీకీ ఎటువంటి ఇబ్బందుల లేవు. ఎమ్మెల్యే సంఖ్య ప్ర‌కారం నాలుగు టీడీపీకీ, ఒక‌టి వైసీపీకీ వ‌స్తుంది.

అయితే ఇప్పడు ఎటొచ్చి పట్టభద్రులు, టీచర్ కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌లే బాబుకు భ‌యం ప‌ట్టుకుంది. ఎందుకంటే ఈ మూడు స్థానాల‌ను ప్ర‌త్య‌క్ష ఎన్నిక ద్వారా భ‌ర్తీ చేయాల్సి ఉంటుంది. అందులో రెండు పట్టభద్రులు, ఒకటి ఉపాధ్యాయ ఎంఎల్సీ ఎన్నికలో లక్షలాది మంది ఓటర్లు పాల్టొంటారు.

ఉపాధ్యాయ కోటానేమో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భర్తీ కావాల్సుంది. మిగిలిన రెండు పట్టభద్రుల కోటా స్ధానాలేమో ఉభయగోదారి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎంపికవ్వాలి. ఇప్ప‌టికే టీడీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వ్య‌క్తం అవుతున్న నేప‌ధ్యంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పాల్గొన కూడ‌ద‌ని బాబు నిర్ణ‌యించుకున్నారంట‌. ప్రత్యక్ష ఓటింగ్ లో గనుక టిడిపి ఓడిపోతే దాని ప్రభావం రాబోయే సార్వత్రిక ఎన్నిక మీద పడుతుందని చంద్రబాబు ఆలోచించారు. మ‌రో వైపు ఈ ఎన్నిక‌ల‌కు వైసీపీ సిద్ద‌మ‌వుతోంది. ఇప్ప‌టికే బాబుకు సీన్ అర్థం అయ్యింద‌ని ఓట‌మి త‌ప్ప‌ద‌నే భావించి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో చేతులెత్తేశార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. నాలుగున్నరేళ్ళపాటు అధికారంలో ఉంది జనరంజక పాలన అందిస్తున్నామని తన భుజాన్ని తానే చరుచుకుంటున్న చంద్రబాబు ప్రత్యక్ష ఎన్నికకు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించ‌డంపై తీవ్ర చ‌ర్చ జ‌ర‌గుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -