Saturday, May 11, 2024
- Advertisement -

టీడీపీ ప‌థ‌నం ప్రారంభ‌మ‌య్యింది….

- Advertisement -

ఏపీలో టీడీపీకి కౌంట్ డౌన్ స్లార్ట్ అయ్యింది.జ‌గ‌న్ దెబ్బ‌తో రాజ‌కీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి రోజు రోజుకి పార్టీ బ‌ల‌హీన మ‌వుతోంది. వైసీపీలోకి వ‌లస‌లు మ‌రింత ఊపందుకోనున్నాయి.శిల్పా సోద‌రుల బాట‌లో మ‌రికింత మంది పార్టీ మారేందుకు సిద్దంగా ఉన్నారు.వారంద‌రూ ఒక్క‌క్క‌రిగా బ‌య‌ట ప‌డుతున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీకి ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేసిన ఘటన మరవక ముందే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శుక్రవారం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరిపై ఆయన గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నా రాంబాబు ఇవాళ గిద్దలూరులో అనుచరులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.

కార్యకర్తల సమావేశంలోనే ఆయన తన ఇన్ చార్జ్‌,పార్టీకి రాజీనామా చేసి త‌న నిర్ణయాన్ని ప్రకటించి, తన మెడలోనుంచి పార్టీ కండువాను పక్కన పడేశారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ టీడీపీలో నన్ను తీవ్రంగా అవమానించారని, ఆర్థికంగా దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా టీడీపీలో కొనసాగితే తనకు సిగ్గు లేనట్టేనని అన్నారు. ఆ కారణంగానే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

ఇక టీడీపీ ప‌త‌నం ప్రారంభ‌మ‌య్యింద‌నే సంకేతాలు బ‌ల‌వంతంగా వినిపిస్తున్నాయి.ఇన్నాల్లు లోలోప‌న బాధ‌ప‌డిన నేత‌లు ఇప్పుడ ఒక్కొక్క‌రు బ‌ర‌స్ట్ అవుతున్నారు.నంద్యాల ఉప ఎన్నిక త‌ర్వాత మ‌రింత మంది ఇత‌ర పార్టీల‌లోకి వెల్ల‌నున్నార‌నే వార్త‌లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -