Wednesday, April 24, 2024
- Advertisement -

ప్రజల నమ్మకంలోనే కాదు టీడీపీ ఈ విషయంలోనూ ఫెయిల్ అయ్యిందా.?

- Advertisement -

రాజకీయంలో ఎంతో నేర్పు ఉండాలి.. ఓర్పు ఒక్కటే ఉంటే రాజకీయాల్లో ఎవరు సరిగ్గా రాణించలేరు.. అందుకే రాజకీయాల్లో రాణించాలంటే అందరివల్ల కాదు.. రాజకీయాల్లో తలపండిన వాళ్ళను రాజకీయ చాణిక్యులు అంటారు.. తలపండడం అంటే వయసైపోయిన వారని కాదు రాజకీయం బాగా వంట పట్టించుకున్నవారు అని అర్థం.. అయితే ఇలాంటి వాళ్లలో ఇప్పటివరకు మనం చంద్రబాబు నే ఎక్కువ చూసాం.. కానీ ఇప్పుడు జగన్ కూడా చాణక్య శిష్యరికం చేస్తున్నారని అర్థమవుతుంది.. గతంలో ఎప్పుడు లేనంతగా అయన ఎత్తులకు పై ఎత్తులు వేసి ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేస్తున్నారు.. సూటిగా పోతే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయని, దానివల్ల పెద్దగా ఒరిగేదేమి లేదని గేర్ మార్చి కొంత దూకుడు పెంచారు..  

ఇక ఇటీవలే టీడీపీ పోరాటం చేసిన ఓ విషయాన్నీ ఆ విజయాన్ని తన ఖాతాలోకి వేసుకోవడం జగన్ కే చెల్లింది.. అదే విజయవాడ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన విజయవాడ ఫ్లై ఓవర్.. ఈ విజయవాడ ఫ్లై ఓవర్ ఎట్టకేలకు ప్రారంభం అయింది  ఇన్ని సంవత్సరాలుగా బెజవాడ ప్రజలని ట్రాఫిక్ కష్టాలకి గురి చేసిన దుర్గ గుడి ప్రాంతం, ఇప్పుడు కొత్తగా నిర్మించిన దుర్గ గుడి ఫ్లై ఓవర్ ప్రారంభించటంతో ఈ ఏడాది దసరాకి విజయవాడ ప్రజలకి ట్రాఫిక్ కష్టాలు తీర్చనుంది. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన విజయవాడ ఫ్లై ఓవర్  ని కేంద్ర రోడ్లు భవనాల శాఖా మంత్రి నితిన్ గడ్కారి ఆన్ లైన్ లో ప్రారంభించారు. సిఎం జగన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

విజయవాడ ఎంపీ కేశినేని నానీ కూడా ఢిల్లీ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెజవాడలో అడుగు పెట్టాలి అంటే ఇప్పటి వరకు ట్రాఫిక్ భయం అనేది చాలా వరకు ఉండేది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే నిజానికి ఇక్కడ ఫ్లై ఓవర్ రావాలని కేంద్రం పై ఒత్తిడి తెచ్చింది టీడీపీ నే.. అయితే ఇది చెప్పుకోవోఆడంలో  తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఇది తమ విజయం అని చెప్పుకోవడంలో ఘోరంగా విఫలం అయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పదవులు అనుభవించిన నేతలు ఎందరో ఉన్నారు. గత ప్రభుత్వంలో శంకుస్థాపనకు వచ్చిన పెద్ద మనుషులు కూడా ఉన్నారు. కనీసం ఇది మా ఘనత అని చెప్పుకోలేదు. ఒక్క కేశినేని నానీ మాత్రమే ఇది మా విజయం అని చెప్పారు. ఆ తర్వాత దేవినేని ఉమా, ఎమ్మెల్సీ అశోక్ బాబు, నెట్టెం రఘురాం, నాగుల్ మీరా వంటి వారు మాట్లాడుతూ ఈ ఫ్లై ఓవర్ ఘనత టిడిపి ప్రభుత్వానిది పేర్కొన్నారు.  ఏదేమైనా ఇప్పడు జగన్ ఖాతాలోకే ఈ ఘనత వెళ్ళింది..

ఈరోజు మంగళవారం అంట.. దసరా తర్వాత టీడీపీ..?

చంద్రబాబు చెప్పేది మరీ చోద్యంగా ఉంది..?

చంద్రబాబు తీరు టీడీపీ ఎమ్మెల్యేల కు నచ్చలేదా..?

టీడీపీ ఇంత దిగాజరడానికి చంద్రబాబే కారణమట..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -