Monday, May 6, 2024
- Advertisement -

టీడీపీకీ భారీ షాక్‌….పార్టీకి వీడ్కోలు ప‌లికిన మ‌రో నేత‌…

- Advertisement -

గుంటూరు జిల్లాలో టీడీపీకీ భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. భాజాపా అప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ఆ పార్టీ కుదేల‌వుతోంది. ఇప్ప‌టికే చాలా మంది కీల‌క నేత‌లు కాషాయ కండువా క‌ప్పుకున్నారు. క‌మ‌లం పార్టీలోకి వెల్లేందుకు నేత‌లు క్యూలో ఉన్నారు. ఓ సీనియర్ నేత ఆ పార్టీకి గుడ్ ‌బై చెప్పనున్నారు. బీజేపీ.. ఆపరేషన్ కమల్ దెబ్బకు ఆ పార్టీ ఖాళీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజ్యసభలో బీజేపీలో టీడీపీ విలీనం అయ్యింది.

తాజాగా గుంటూరు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న కీల‌క నేత రాయ‌పాటి సాంబిశివరావు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నారు. తాను త్వరలోనే బీజేపీలో చేరతానని స్వ‌యంగా ప్రకటించారు. గుంటూరులో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న రాయపాటి పార్టీని వీడుతుండటం పెద్ద దెబ్బే. తాను బీజపీ పెద్దలెవరితో సంప్రదింపులు జరపలేదని చెబుతూనే… ఆ పార్టీలో చేరడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు.

గ‌తంలో టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌విపై ఆశ పెట్టుకునకు అనూహ్యంగా బాబు హ్యాండ్ ఇచ్చారు. ఆ ప‌ద‌వి పుట్టా సుధార్ యాద‌వ్‌కు క‌ట్ట‌బెట్టారు. అప్ప‌టినుంచి రాయ‌పాటి గుర్రుగా ఉన్నారు. సరైన సమయం చూసి కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు.

రాయపాటిని బీజేపీలో చేర్చుకునేందుకు ఇటీవల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ మూడు రోజుల క్రితం రాయపాటి నివాసానికి వ‌చ్చి చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. గుంటూరు జిల్లా వ్యాప్తంగా బలమైన కేడర్‌ ఉన్న రాయపాటిని చేర్చుకోవడం ద్వారా పార్టీని పటిష్ఠం చేయాలని బీజేపీ భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -