- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి సంచ‌ల‌న పోస్ట్‌

- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన సంచలన ఫేస్‌బుక్ పోస్టులు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇటీవల మూడు రోజుల పాటు 35 గ్రామాలు, 480 కుటుంబాలతో ఆత్మీయ సంభాషణ జరిపినట్లు పేర్కొన్న కొలికపూడి, గ్రామీణ పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లులేని పల్లెలు, ఉద్యోగాలు రాని యువత, సమస్యలతో కుంగిపోతున్న గ్రామాలు కనిపించాయని పేర్కొంటూ పల్లె కన్నీరు పెడుతోంది అనే భావోద్వేగ సందేశాన్ని పోస్టు చేశారు. ఈ వ్యాఖ్యలను సొంత పార్టీ పాలనపై పరోక్ష విమర్శలుగా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

కొలికపూడి పోస్టులతో టీడీపీ శ్రేణుల్లో విస్తృత చర్చ సాగుతోంది. ముఖ్యంగా తిరువూరు ప్రజలు, ఈ వ్యాఖ్యలు నేరుగా కాకపోయినా సొంత పార్టీని ఉద్దేశించి చేసినట్లుగా భావిస్తున్నారు. అభివృద్ధి, ఉపాధి అంశాలపై ఎమ్మెల్యే స్వయంగా అసంతృప్తి వ్యక్తం చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదే సమయంలో కొలికపూడి మరో బిగ్ బ్రేకింగ్ ఆరోపణతో సంచలనం సృష్టించారు. 2024 ఎన్నికల్లో తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.5 కోట్లు డిమాండ్ చేశారంటూ టీడీపీ ఎంపీ కేశినేని చిన్నిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన అకౌంట్ నుంచి మూడు సార్లు రూ.60 లక్షలు చొప్పున ట్రాన్స్‌ఫర్ చేసినట్లు ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. అంతేకాదు, ఎంపీ చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి రూ.50 లక్షలు తీసుకెళ్లారని, తన మిత్రులు ఇచ్చిన రూ.3.50 కోట్ల విషయాన్ని కూడా త్వరలో వెల్లడిస్తానని పోస్టు చేశారు.

నిజమే గెలవాలి అంటూ వరుస పోస్టులు పెడుతున్న కొలికపూడి వ్యాఖ్యలు టీడీపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -