- Advertisement -

ఎంపీ శివ‌ప్ర‌సాద్ మ‌రో వేషం చూడండి

- Advertisement -

ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌కుండా మోసం చేసిన కేంద్ర ప్ర‌భుత్వంపై తెలుగు దేశం పార్టీ పార్ల‌మెంట్ స‌భ్యుడు శివ‌ప్ర‌సాద్ వినూత్న రీతిలో నిర‌స‌న‌ను తెలుపుతున్నాడు. అత‌డు వివిధ వేషాల్లో కేంద్రం ఎలా త‌మ‌ను మోసం చేస్తోంద‌ని వెళ్ల‌గ‌క్కుతున్నాడు. గ‌తంలో పార్ల‌మెంట్ స‌మావేశాల సంద‌ర్భంగా విచిత్ర వేష‌ధార‌ణ‌ల్లో క‌నిపించి హాట్ టాపిక‌య్యాడు. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక హోదా డిమాండ్‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆందోళ‌నల‌ ప‌ర్వం కొన‌సాగుతోంది. ఇప్పుడు చిత్తూరులో విభిన్న వేష‌ధార‌ణ‌లో నిర‌స‌న తెలిపాడు.

2014 ఎన్నిక‌ల సంద‌ర్భంగా చిత్తూరు జిల్లా తిరుప‌తిలోని తారకరామ స్టేడియంలో నిర్వ‌హించిన‌ బ‌హిరంగ స‌భ‌లో న‌రేంద్ర మోదీ ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని ప్ర‌క‌టించాడు. ఆ బ‌హిరంగ స‌భలో ఇచ్చిన మాట‌ను మోదీ త‌ప్పార‌ని నిర‌సిస్తూ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించిన చోట‌నే ఆందోళ‌న చేప‌ట్టారు. బీజేపీ ప్ర‌భుత్వం కేంద్రంలో ప‌రిపాల్సిస్తోందో కాబ‌ట్టి అది తెలిసేట‌ట్టు చెవిలో రెండు క‌మ‌లం పూలు పెట్టుకొని విభిన్నంగా నిర‌స‌న తెలిపారు. ఇప్ప‌టికైనా త‌మ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. విద్యార్థులు ప్ర‌త్యేక హోదా కోసం చేప‌డుతున్న ఆందోళ‌న‌కు ఆయ‌న మ‌ద్ద‌తు తెలిపి ఈ విధంగా నిర‌స‌న తెలిపారు.ఈ విధంగా గ‌తంలోనూ తెలంగాణ రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలోనూ ఎంపీ శివ ప్ర‌సాద్ చేశాడు.

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -