Monday, May 6, 2024
- Advertisement -

జేసీ, కేశినేని నానీల మానవత్వం గురించి బాబు, రాధాకృష్ణలు ఏం చెప్తారు?

- Advertisement -

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తనను కలిసిన మహిళలు, వృధ్ధులు, చేనేత కార్మికులు వాళ్ళ సమస్యలు చెప్పుకున్నారు. అందరూ కూడా చంద్రబాబు బాధితులే. ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు……అధికారంలోకి వచ్చాక కనీసం అర్హులను పట్టించుకోవడం మానేశాడు. దాంతో ఆయా వర్గాల ప్రజలందరూ నరకం చూస్తున్నారు. అదే విషయాన్ని జగన్‌కి చెప్పుకున్నారు. వాళ్ళ ఆవేధనను తన మాటల్లో ఎక్స్‌ప్రెస్ చేస్తూ చంద్రబాబు పాలన గురించి చెప్పే సందర్భంలో వైఎస్ జగన్ నోరు జారాడు. కానీ ప్రజలు జగన్‌కి వాళ్ళ సమస్యలు చెప్పుకున్న సందర్భంలో…..ఆ ప్రజల కన్నీళ్ళు చూసి చలించి జగన్ మాట్లాడిన మాటలు అవి. అయినప్పటికీ ఆ మాటలు తప్పే. కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఈనాడుతో సహా పచ్చ మీడియా సంస్థలన్నీ కూడా జగన్‌ని మానవత్వం లేని వ్యక్తిగా చూపించడానికి శతధా ప్రయత్నం చేశాయి.

గత కొన్ని రోజులుగా వైకాపా ఎంపిలు ఢిల్లీలో నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే ఆరోగ్యం చెడిపోయి ఇద్దరు ఎంపీలు హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. ఇక మిగిలిన ఎంపిలు మాత్రం కష్టమైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఒక రోజు మూడు పూటలా ఆహారం తీసుకోకుండా ఉంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలిసినవాళ్ళయితే ఎంపిల నిరాహారదీక్షను చులకన చేసి మాట్లాడరు. మోడీ నివాసానికి కిలోమీటర్ దూరంలో ఐదు నిమిషాలు షో చేసి పోరాటం అద్భుతం అని ప్రచారం చేయించుకున్నవాళ్ళకు మానవత్వం ఏం ఉంటుంది? ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాల విషయంలో ప్రచార డ్రామాలతో నెట్టుకొస్తున్న బాబు అండ్ కోకు వైకాపా ఎంపిల రాజీనామాలు, నిరాహారదీక్షలు ఎటకారంగానే కనిపించడంలో ఆశ్ఛర్యం ఏముంది? నాలుగేళ్ళ పాటు అధికారంతో పాటు అన్ని సౌకర్యాలు అనుభవించి నాలుగైదు రోజులు ఢిల్లీలో షో చేసిన వెంటనే ఇక మేం పెళ్ళాం, పిల్లల దగ్గరకు పోవద్దా అన్న జేసీ కూడా నిరాహారదీక్షల గురించి ఎగతాళి చేసేవాడా? ఏం చచ్చేదాకా నిరాహార దీక్షలు చేయగలరా? అన్న జేసీ మాటలు అయితే అత్యంత జుగుప్సాకరం. అమానవీయం. ఆ మధ్య ఇదే జేసీల జగన్ తల్లి గురించి కూడా నీచంగా మాట్లాడి మనషులా? కాదా? అన్న స్థాయిలో నెటిజనుల చేత తిట్టించుకున్నారు. ఇక కొవ్వు తగ్గడానికే వైకాపా ఎంపిల నిరాహారదీక్షలు అన్న కేశినేని నాని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒక పార్టీకి అధినేత, గౌరవనీయమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబే…. ప్రతిపక్ష నేతను క్రిమినల్, నేరగాడు అని మాట్లాడుతూ ఉంటే ఇక ఆయన పార్టీ నాయకుల నుంచి ఇంతకుమించిన మానవత్వం, మనిషితత్వం ఏం ఆశిస్తాం? కాకపోతే ఇప్పటికే 2014 నుంచీ ఇప్పటివరకూ పాలకుడిగా, నాయకుడిగా చంద్రబాబు డ్రామాలు, అక్రమాల పుణ్యమాని ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నైరాశ్యం, వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉంది. దేశంలోనే వరస్ట్ సిఎం ఎవరు అన్న సర్వేలో చంద్రబాబుని అగ్రస్థానంలో నిలబెట్టేలా చేసింది. ఇక పచ్చ బ్యాచ్ తీరు ఇలాగే కొనసాగితే 2019 ఎన్నికల నాటికి చంద్రబాబు అండ్ కో అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విరక్తి వచ్చినా ఆశ్ఛర్యపోవాల్సింది ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు ఘంటాపథంగా చెప్తున్నారు. బాబు అండ్ కో వినిపించుకునే అవకాశం ఉందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -