Sunday, May 5, 2024
- Advertisement -

మోదీతో తెలంగాణ గవర్నర్ భేటీ

- Advertisement -

గవర్నర్ తమిళిసై ఢిల్లీ వెళ్లి ప్రధానితో భేటీ కావడం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను ప్రధానికి ఆమె వివరించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రోటోకాల్ వివాదంపై గవర్నర్ ప్రధాని దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం. మోదీతో భేటీ అనంతరం గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసంటూ గవర్నర్ తమిళి సై వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్నీ గౌరవించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని తేల్చి చెప్పారు.

గవర్నర్ ఆఫీస్‌కు ప్రభుత్వం గౌరవం ఇవ్వాల్సిందేనన్నారు. ప్రోటో కాల్ సక్రమంగా అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత సీఎస్‌కు ఉందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు తాను ప్రధానిని కలవలేదని స్పష్టం చేశారు. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు ఎయిర్‌పోర్టుకు కేసీఆర్ వెళ్లకపోవడం అప్పట్లో చర్ఛనీయాంశమైంది. ఇక ఉగాది నాడు రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకల్లోనూ కేసీఆర్ కానీ మంత్రులు కానీ పాల్గొనకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది.

కేంద్రంపై గుర్రుగా ఉన్న కేసీఆర్ కావాలనే రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తుల పట్ల కూడా ఎడముఖం పెడముఖంగా వ్యవహరిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనకు ఇగోలేదంటూ గవర్నర్ ఉగాది కార్యక్రమం సందర్భంగా కేసీఆర్‌ను ఉద్దేశించే చురకలు కూడా వేశారు. ఈ క్రమంలో తమిళిసై ఢిల్లీ పర్యటన చర్చనీయాంశమైంది.

ఏపీ సీఎం ఢిల్లీ టూర్ ఆంతర్యం ఏంటి ?

క్రేజీ కాంబినేషన్‌లో మరో మల్టీ స్టారర్ మూవీ

సినిమాల్లోకి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్న సోనాలి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -