జగన్‌పై అక్రమాస్తుల కేసులో ఇరికించారనేది అందరికి తెలిసిందే. కేసులు నిలబడువని తెలిసి కూడా అధికార పార్టీ బలంతో జగన్‌తోపాటు ఐఎస్ అధికారులనుకూడా ఈ కేసులో ఇరికించారు.అయితే చివరికి కేసులపై పైల్‌చేసిన ఛార్జిషీట్‌లన్నీ ఒక్కొక్కటిగా కోర్టు కొట్టి వేస్తోంది.తాజాగా ఇదే కేసులో సీబీఐకి ఊహించని ఎదురు దెబ్బతగిలింది.
రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనంతపురం జిల్లా లేపాక్షి హబ్ భూ కేటాయింపుల్లో సీబీఐ ఫైల్ చేసిన ఛార్జిషీట్‌ను హైకోర్టు కొట్టి వేసింది.అప్పటి పరిశ్రమల కార్యదర్శిగా ఉన్న శ్యాంబాబుపై కూడా కేసు కొట్టి వేసింది. మంత్రివర్గం నిర్ణయం తప్రకారంబడే కేటాయింపులు జరిగాయని తనను కేసునుంచి తప్పించాలని సీబీఐ ఛార్జ్‌షీట్‌ను సవాల్ చేస్తూ హైకోర్టు పిటీషన్ వేసిన ఆయనకు విముక్తి లభించింది.
శ్యాంబాబును విచారించేందకు కేంద్రప్రభుత్వ అనుమతి తప్పని సరి .సీబీఐ విజ్ణప్తిని పరిశీలించిన కేంద్రం…ఈవ్యవహారంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని …అప్పటి కేబినేట్ నిర్నయం ప్రకారంబడే జరిగాయని కేంద్రానినికి నివేదిక ఇచ్చింది.
లేపాక్షి హబ్ వ్యవహారంలో శ్యాంబాబు ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదని కేంద్రం స్పష్టం చేసింది.అప్పటికే శ్యాంబాబు పదవి విరమణ చేశారు.కేంద్రం విచారణకు సహకరించిందని తనపై ఉన్న కేసును కొట్టి వేయాలని కోరడంతో జస్టిస్ సీతారామమూర్తి కొట్టి వేశారు.ఇప్పటికే ఐఎస్‌లమీద ఉన్న కేసులన్నీ హైకోర్టు కొట్టి వేసింది.
ఒక ఉద్యోగిపై విచారణకు ప్రభుత్వం నిరాకరించినప్పుడు, ఆ ఆదేశాలను దర్యాప్తు సంస్థ సవాల్ చేయని పక్షంలో ఇక ఆ ఉద్యోగిని విచారించేందుకు వీల్లేదంటూ గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో చార్జిషీట్‌ను కొట్టివేస్తున్నట్టు ఉమ్మడి హైకోర్టు తీర్పు చెప్పింది. ఇప్పటికే జగన్ ఆస్తుల కేసులో దాదాపు అందరూ ఐఏఎస్ లు బయటపడ్డారు. ఈ నేపథ్యంలో ఇక జగన్‌పై కేసు నిలవడం అసాధ్యమని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
