Monday, May 13, 2024
- Advertisement -

ఆ ఎన్నికల్లో టిజెఎస్ జెండా ఎగిరేనా..ఆసక్తిగా కోదండరాం ?

- Advertisement -

తెలంగాణ ఉద్యమ పోరు లో కీలక పాత్ర వహించి తెలంగాణ రావడం లో ఎంతో కృషి చేసిన లీడర్ కోదండ రామ్.. జేఏసీ లీడర్ గా విద్యార్థులలో ఉద్యమ కాంక్ష ను రగిలించి యువతకి బలం చేకూరేలా చేశారు.. తెలంగాణ ఉన్నంత కాలం ఆయన సేవలు ఎవరు మరువలేరు.. అయితే అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన పరిణామాణాల దృష్ట్యా ఆయనకు ప్రభుత్వంలో సరైన ప్రాధాన్యం లేదని గ్రహించిన ఆయన తెలంగాణ జన సమితి అనే పార్టీ ని ఏర్పాటు చేసి అధికార పార్టీ పై పోరాటానికి సమరశంఖం పూరించారు.

అయితే గత ఎన్నికల్లో మహాకూటమి లో భాగమై ఎన్నికల్లో పోటీ చేసినా ఆయనకు చేదు అనుభవం తప్పలేదు.. ఒక్క సీటు కూడా గెల్చుకోలేదు. అయితే తాను జనగాం నుంచి పోటీ చేయాలనీ భావించినా కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్య పట్టుపట్టి మరీ ఆ నియోజక వర్గం నుంచి పోటీ చేయడంతో అయన ఎక్కడా బరిలోకి దిగలేదు.. కాగా ఇప్పుడు ఎమ్మెల్సీగా బరిలోకి దిగి తన సత్త ఏంటో చూపించాలని డిసైడ్ అయ్యారు..

మరో ఆరు నెలల్లో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజక వర్గం నుంచి కోదండరాం బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తుంది. మరో స్థానం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి కూడా మరో అభ్యర్థి ని రంగంలోకి దించనున్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలపై కోదండరాం ఎక్కడ ప్రకటించకపోయినా టీజేఎస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ మాత్రం… ఈ విషయంలో.. నిర్ణయానికి వచ్చేసింది. వాస్తవానికి పట్టభద్రులు… ప్రలోభాలకు లొంగరు. గతంలో అనేక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. దీన్ని రుజువు చేశాయి. దీంతో.. ఎమ్మెల్సీ స్థానంలోకి బరిలోకి దిగితే విజయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. కోదండరాం ఎమ్మెల్సీగా గెలిచి వస్తే.. తెలంగాణ రాజకీయంలో మార్పు ప్రారంభమైనట్లేనని అనుకోవచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -