Saturday, May 4, 2024
- Advertisement -

శాసనసభలో అదరగొట్టిన బాలరాజు.. ఏమన్నారు అంటే..!

- Advertisement -

ప్రజల్లో చర్చ జరుగుతున్న అంశాలనే గవర్నర్ ప్రస్తావించారని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. దేశంలో మిగిలిన రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని బాలరాజు ప్రతిపాదించారు. డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ల‌ను, కేసీఆర్ త‌మ‌కు ఇస్తున్న అవ‌కాశాల‌ను గ‌మ‌నిస్తున్నామ‌ని తెలిపారు. అంబేడ్క‌ర్‌, కేసీఆర్‌ను ఆద‌ర్శంగా తీసుకుని, త‌మ హ‌క్కుల‌ను కాపాడుకునేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ద‌ప‌డుతాం. త‌మ వ‌ర్గాల‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని స‌హించం అని స్ప‌ష్టం చేశారు. 

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీరు సరఫరా అందించినట్లు గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. మిషన్ భగీరథను కేంద్ర ప్రభుత్వం కూడా ప్రశంసించిందని గుర్తు చేశారు. మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. ఆత్మగౌరవానికి ప్రతీకగా తెలంగాణను సీఎం కేసీఆర్ తీర్చిదిద్దారని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై కొంతమంది ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

ఇక ఉద్యోగ నియామ‌కాల విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అల‌స‌త్వం వ‌హిస్తుంద‌న‌డంలో అర్థం లేద‌న్నారు. ఉద్యోగ నియామ‌కాల‌పై కేటీఆర్ శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేసిన త‌ర్వాత‌.. ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేయ‌డం మానేశాయ‌న్నారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ పాల‌న దేశానికి ఆద‌ర్శ‌వంతంగా ఉంద‌న్నారు.

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కింగ్ నాగార్జున!

అనుమానాస్పద స్థితిలో ఎంపీ మృతి.. పోస్ట్​మార్టం రిపోర్ట్ తరువాత నిజాలు..!

మళ్ళీ ఇక్కడ మహమ్మారి విజృంభణ.. టార్గెట్ హైదరబాద్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -