Monday, May 13, 2024
- Advertisement -

చంద్రబాబుకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కెసీఆర్

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో ఎటుండి ఎటు వస్తుందో అన్న అపనమ్మకం….. జాతీయస్థాయి సర్వేలన్నీ కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదని చెప్తున్న నేపథ్యం……..ఎంత పచ్చ మీడియా బాకాలు ఊదినా 2014లోలా మరోసారి ప్రజల నమ్మే అవకాశం లేదన్న సన్నిహితుల సలహాల నేపథ్యంలో ఇప్పుడు పచ్చ బ్యాచ్ అందరూ కూడా తెలంగాణాపై కాన్సన్‌ట్రేట్ చేశారు. బిజెపితో పొత్తులో ఉన్నప్పటి నుంచే………..ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే వైఎస్సార్ మరణం టైం నుంచీ జగన్‌పై కేసులు, తెలంగాణా విభజన వరకూ కూడా అన్ని విషయాల్లోనూ సోనియా, రాహుల్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నాడు చంద్రబాబు. అందుకే ఇప్పుడు ఆ సాన్నిహిత్యంతో కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయినట్టుగా తెలంగాణాలో టిడిపి అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యేలా వ్యూహరచన చేస్తున్నాడు.

అయితే చంద్రబాబు వ్యూహరచనను పసిగట్టిన కెసీఆర్ తాజాగా బాబుకు స్ట్రాంగ్ వార్నింగ్ పంపించాడు. ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చేత తన హెచ్చరికను చంద్రబాబుకు రాయబారం పంపించాడు చంద్రబాబు. ఓటుకు నోటు కేసులో పీకలదాకా ఇరుక్కుపోయిన చంద్రబాబు……..ఆ వెంటనే కేసీఆర్‌తో కాళ్ళబేరానికి వచ్చాడు. తెలంగాణా వదిలి వెళ్ళిపోతానని కెసీఆర్‌కి మాట ఇచ్చాడు. పదేళ్ళపాటు హైదరాబాద్‌పై సీమాంధ్రులకు హక్కులు ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఆదరాబాదరాగా మూటా ముళ్ళె సర్దుకోవడంతో పాటు సీమాంధ్ర ఉద్యోగులను కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. తెలంగాణా రాజకీయాల్లో మళ్ళీ అడుగుపెట్టను అని కెసీఆర్‌కి మాట ఇచ్చాడు. అయితే ప్రజల విషయంలోనే కాదు, పొత్తు పెట్టుకున్న పార్టీల విషయంలోనూ, నాయకుల విషయంలో కూడా మాట నిలబెట్టుకునే నైజం లేని చంద్రబాబు తాజాగా కెసీఆర్ విషయంలో తలెగరేశాడు.

తెరవెనుక కాంగ్రెస్‌తో కలిసి తెలంగాణాలో అధికారం కోసం బాబు చేసిన వ్యూహరచనను అర్థం చేసుకున్న కెసీఆర్ తాజాగా ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్‌తో చంద్రబాబుకి వార్నింగ్ పంపించాడు. తాను ఇంకా చాలా నెలల కాలంపాటు అధికారంలో ఉంటానని……ఆ విషయం తెలుసుకుని జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పించాడు. ఓటుకు నోటు కేసు విషయంలో అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని ……తేడా వస్తే మొత్తం చరిత్ర బయటపెట్టి బుక్ చేయించాల్సి ఉంటుందని చంద్రబాబుకు హెచ్చరికలు పంపించాడు కెసీఆర్. ఇప్పుడు ఈ విషయమే తెలుగు మీడియాలో హాట్ టాపిక్ అయింది. సీనియర్ మోస్ట్ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు తన చేతలతో ఓ స్థాయిలో చుక్కలు చూపిస్తున్నాడు కెసీఆర్. కెసీఆర్ చర్యలకు చంద్రబాబు రియాక్షన్స్ ఎలా ఉంటాయో అన్న ఆసక్తి మాత్రం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎన్నికల ఏడాదిలో ఈ పరిణామాలు ఇంకా ఎలాంటి మలుపులు తీసుకుంటాయో చూడాలి మరి. అవినీతికి పాల్పడుతూ అడ్డంగా దొరికిన నేతలకు ఇప్పటికైనా శిక్షలు పడే అవకాశం ఉందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -