- Advertisement -

అర్థరాత్రి టీడీపీలో చేరిన వంగ‌వీటి రాధా

- Advertisement -

విజ‌య‌వాడ మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధా సోమ‌వారం అర్థ‌రాత్రి ఏపీ సీఎం చంద్ర‌బాబు నివాసానికి వెళ్లి మ‌రి క‌ల‌వ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వంగ‌వీటి రాధా ఇటీవ‌లే వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి అంద‌రికి తెలిసిన విష‌య‌మే. వైసీపీకి రాజీనామా చేసిన అనంత‌రం రాధా వైఎస్ జ‌గ‌న్‌పై తీవ్ర విమర్శ‌ల‌ను చేశారు. అయితే వైసీపీకి రాజీనామా అనంతరం జ‌న‌సేన‌లో చేరతార‌నే ప్ర‌చారం జ‌రిగింది. కాని ఆయ‌న అంద‌రికి షాకిస్తు త‌న తండ్రిని చంపిన పార్టీ అయిన టీడీపీలో చేర‌డానికి రెడీ అయ్యారు. దీంతో వంగ‌వీటి రంగాలోని కొంద‌రు స‌భ్యులు రాధాకు దూరం జ‌రిగారు.

దీంతో ఆయ‌న టీడీపీలో చేర‌డాన్ని విర‌మించుకున్నార‌ని అనుకున్నారు అంద‌రు. కాని ఆయ‌న సోమ‌వారం అర్థ‌రాత్రి స‌మ‌యంలో సీఎం చంద్ర‌బాబుని క‌లిసి అధికారికంగా టీడీపీలో చేరిన‌ట్లు తెలుస్తోంది. విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌తో చంద్రబాబును క‌లిసి పార్టీలో చేరారు రాధా. అయితే విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటు మాత్రం రాధాకు ఇవ్వ‌డం లేద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి బొండ ఉమ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బొండ ఉమ‌ను కాద‌ని రాధాకు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ సీటు ఇచ్చే పరిస్థితి లేదు. వంగ‌వీటి రాధాను మ‌చిలీప‌ట్నం పార్ల‌మెంట్ నుండి పోటీ చేయాల‌ని చంద్ర‌బాబు సూచించార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం మ‌చిలీప‌ట్నం ఎంపీగా ఉన్న కొన‌క‌ళ్ళ నారాయ‌ణ‌ను ఎమ్మెల్యేగా పోటీ చేయించాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట చంద్ర‌బాబు. దీనికి రాధాకు అంగీక‌రించిన‌ట్లు స‌మాచారం. ఏ సీటు కోసం అయితే వైసీపీకి రాధా రాజీనామా చేశారో , ఆ సీటు టీడీపీలోకి వెళ్లి కూడా సాధించ‌లేక‌పోయారు. రాధా టీడీపీలో చేరి ఎంపీగా పోటీ చేయ‌డం దాదాపు ఖాయ‌మ‌ని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు. ఎమ్మెల్యేగానే రెండుసార్లు ఓడిపోయిన రాధా ఎంపీగా ఎలా విజ‌యం సాధిస్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -