Thursday, May 16, 2024
- Advertisement -

విశాఖ‌ లో సైకిల్‌కు పంక్చ‌ర్ త‌ప్ప‌దా…?

- Advertisement -

ఏపీలో సార్వత్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్న కొద్ది చంద్ర‌బాబుకు భ‌యం ప‌ట్టుకుంది. బాబు ప్రారంభించిన ఆప‌రేష‌న్ కాస్త విక‌ర్ష్‌గా మారుతోంది. ఎన్నిక‌ల్లో వైసీపీ అధికారంలోకి వ‌స్తుంద‌ని స‌ర్వేలు కోడై కూస్తున్న త‌రుణంలో అధికార పార్టీనుంచి జంపింగ్‌కు నాయ‌కులు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదే ఇప్పుడు బాబుకు నిద్ర‌లేకుండా చేస్తోంది.

మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని బాబు క‌యుక్తులు ప‌డుతుంటే… ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ ఈ సారి అధికారంలోకి రావ‌డానికి తాడో పేడో తేల్చుకోవ‌డానికి వ్యూహాల‌కు ప‌దును పెడుతోంది. టీడీపీనుంచి వైసీపీలోకి వ‌చ్చేందుకు ఎమ్మెల్యేలు, ఎంపీలు వ‌చ్చే సిద్ధంగా ఉండ‌టంతో వారిని ఆపేందుకు బాబు నానా తంటాలు ప‌డుతున్నారు.

తాజాగా టీడీపీకీ చెందిన‌ మ‌రో న‌లుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వ‌చ్చేందుకు సిద్ధంగా ఉన్నార‌నే వార్త రాజ‌కీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు స‌మ‌యం త‌క్కువ ఉండ‌డంతో టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో స‌ర్వేలు చేయిస్తున్నార‌ని స‌మాచారం. ఆ స‌ర్వేల్లో జ‌రుగుతున్న గూడు పుటాని కారంణంగా సిట్టింగ్ కొంద‌రు ఎమ్మెల్యేల ప‌నితీరు బాగ‌లేద‌ని… ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు రిపోర్టు ఇచ్చారంట‌. వారిలో విశాఖ‌ప‌ట్నం కు చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు ఉన్నార‌ట‌.

అ న‌లుగురు ఎమ్మ‌ల్యేలు పార్టీలో ఉండి అవ‌మానాలు ప‌డే చాన్స్ లేద‌ని, అవ‌స‌రం అయితే టీడీపీని వీడ‌డానికి సిద్ధ‌మ‌ని.. గ‌ట్టిగానే తేల్చేశార‌ని తెలుస్తోంది. వారిలో విశాఖ ద‌క్షిణానికి చెందిన ఎమ్మెల్యేతో పాటు, గాజువాక‌, చోడ‌వ‌రం ఎమ్మెల్యేలు అని స‌మాచారం. టీడీపీలో ఈ ర‌చ్చ జ‌రిగిన త‌ర్వాత ఒకే మాట‌పైకి వ‌చ్చి టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని టాక్‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -