Saturday, May 4, 2024
- Advertisement -

వైసిపి లో ఇంతటి వర్గపోరు దేనికి దారితీస్తుందో..?

- Advertisement -

ఏ పార్టీ లో అయినా వర్గపోరు ఉంటే తప్పకుండా ఆ పార్టీ కి అది పెద్ద మైనస్..ఎందుకంటే వర్గ పోరు ఉంటే ఇరు నేతలు ఒకరి పై ఒకరు విమర్శించుకుంటూ ఉంటారు.. దాంతో పార్టీ ప్రతిష్ట కి, ఒకటో రెండో ఉన్న లోపాలు బయటపడి దారుణంగా దెబ్బ పడుతుంది.. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ కి వర్గ పోరు సవితో పోరు కన్నా పెద్దది.. ఇద్దరు నేతలకు ఒక రి తో ఒకరికి పడకపోవడంతో ఇద్దరు విమర్శించుకుని ప్రభుత్వాన్ని తిట్టే స్థాయికి వారి వైరం వెళుతుంది.. దాంతో ఆటోమేటిక్ గా పార్టీ అక్కడ వీక్ అయిపోతుంది. ఆవిధంగా నే ప్రకాశం జిల్లా లో వైసీపీ వర్గ పోరు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బయటపడింది..

జిల్లాలోని చీరాలలో  ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయులు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా అధిష్ఠానానికి  తమ బలాన్ని నిరూపించుకోవాలని ఇరు నేతలు పోటాపోటీగా ఫ్లెక్సీ లు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. అయితే వారి దూకుడు ను చూసి ముందే పసిగట్టిన పోలీసులు ఇరు నేతల కార్యకర్తలకు వేర్వేరు సమయాల్లో కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు. వైఎస్ఆర్‌కు నివాళి అర్పించడానికి ఎమ్మెల్యే కరణం బలరాం వర్గీయులకు ఉదయం సమయం ఇచ్చారు. ఆ తర్వాత ఆమంచి కృష్ణ మోహన్‌కు అనుమతి ఇచ్చారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి ఏఎంసీ ఛైర్మన్, కార్యకర్తలు నివాళులర్పించారు. ఆ తర్వాత దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే జోక్యం చేసుకొని సర్దిచెప్పారు. దాంతో అక్కడికే వివాదం సద్దుమణిగింది.

గత కొంత కాలంగా ఈ రెండు వర్గాలకు విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.  బి.కోడూరు మండలం పాయలకుంటలో గ్రామ సచివాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో  ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య శంకుస్థాపనకు రాగా.. మరో వర్గం కార్యకర్తలు ఆయన్ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గొడవ జరిగి పరస్పరం కొట్టుకున్నారు. రామకృష్ణారెడ్డి, యోగానంద్‌ రెడ్డి వర్గీయులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. తాజాగా వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా చీరాలో ఆమంచి, కరణం వర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరు హైకమాండ్‌కు తలనొప్పిగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -