ప్రజల ముందేమో బిజెపి నేతల పొడగూడా గిట్టడం లేదు అనే రేంజ్‌లో వ్యవహరిస్తూ ఉన్నాడు చంద్రబాబు. కానీ తెరవెనుక మాత్రం చంద్రబాబు వ్యవహారాలు పూర్తి రివర్స్‌లో ఉంటాయి. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి, ఆ రాష్ట్ర మాజీ బిజెపి అధ్యక్షుడి భార్యను టీటీడీ మెంబర్‌గా నియమించాడు చంద్రబాబు. ఆపరేషన్ గరుడ పురాణాలు వినిపిస్తున్న చంద్రబాబు, బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కబలించబోతోంది అనే స్థాయిలో ప్రజలను భయపెడుతోన్న చంద్రబాబు…… అదే బిజెపిలో ప్రముఖ నాయకుడిగా ఉన్న మంత్రి భార్యను టీటీడీ బోర్డ్ మెంబర్‌గా ఎలా నియమించాడు?
ఇదే ప్రశ్న చంద్రబాబు ముందు ఉంచితే బాబు చెప్పిన సమాధానం అందరినీ షాక్‌కి గురిచేసింది. అది నా పర్సనల్ అనే రేంజ్‌లో మాట్లాడేశాడు చంద్రబాబు. ఇప్పుడు ఈ పర్సనల్ బాగోతాలను బయటపెట్టేశాడు జగన్. చంద్రబాబు వ్యవహారాలన్నీ కూడా ప్రజల ముందు ఒకలా……..ఆయన పర్సనల్‌గా ఇంకోలా ఉంటాయని తేల్చి చెప్పేశాడు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో ఛీఫ్‌తో గంటలు గంటలు పర్సనల్‌గా మాట్లాడతాడు చంద్రబాబు. ఆయనతో మీటింగ్ కోసం తన షెడ్యూల్ కూడా మార్చుకుంటాడు. ఇక గవర్నర్‌తో కూడా పర్సనల్‌గా చాలా గంటలు మాట్లాడతాడు. చివరకు తిరుమల తిరుపతి దేవస్థానం మెంబర్స్‌గా బిజెపి నేతలను నియమించడం, ఢిల్లీలో సుజనా చౌదరి రెగ్యులర్‌గా బిజెపి నేతలతో టచ్‌లో ఉండడం, గవర్నర్‌తో సుజనా చౌదరి, పవన్ కళ్యాణ్‌ల సంయుక్త భేటీలు…….అన్నీ కూడా పర్సనల్ వ్యవహారాలుగా చూడమంటాడు చంద్రబాబు. ప్రజల ముందుకు వచ్చి మాత్రం గవర్నర్ నరసిహంన్‌ని తీవ్రస్థాయిలో విమర్శిస్తాడు, బిజెపిపై విరుచుకుపడతాడు……ఇప్పుడు ఇవే డ్రామాలను తన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ప్రజల ముందుకు వెళ్ళిన జగన్ ప్రజలకు వివరంగా చెప్పాడు. చంద్రబాబు ఎప్పుడూ చెప్పింది చెయ్యడనీ…..తెర ముందు ఆయన డ్రామాలకు, తెరవెనుక వ్యవహారాలకు సంబంధమే ఉండదని చెప్పుకొచ్చాడు జగన్.
ఇవే విషయాలపై సూటిగా చంద్రబాబును ప్రశ్నించాడు జగన్. అయితే బాబు అండ్ బ్యాచ్ మాత్రం యధావిధిగా జగన్ అవినీతిపరుడు, జగనే బిజెపితో కుమ్మక్కయ్యాడు అంటూ రాగాలు తీయడం గమనార్హం. తెరవెనుక వ్యవహారాలను కప్పిపుచ్చుకోవడం, కుమ్మక్కు డ్రామాలు ప్రజలకు తెలియకుండా మేనేజ్ చేయడంలో ఎంతైనా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనుభవం ఉన్న నాయకుడు కదా?
