Tuesday, May 14, 2024
- Advertisement -

ఏపీలో ఆ ఆలోచన చేయాలంటేనె భాజాపా వెన్నులో పుడుతున్న వణుకు

- Advertisement -

రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత భాజాపా భయంకరమైన రాజకీయ క్రీడ ఆడుతోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో భాజాపా పాలన కొనసాగాలని ఆ దిశగా ప్రయత్నాలను విజయవంతంగా కొనసాగిస్తోంది. ఏ రాష్ట్రాల్లో విబేధాలు ఉంటాయో అక్కడ రాజకీయ చిచ్చు పెట్టి లబ్ధి పొందడం అలవాటుగా మారింది. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలని భాజాపా తన మాస్టర్ ప్లాన్ ను అమలు చేస్తోంది. ఫిరాయింపులను ప్రోత్సహించడం అక్కడ ప్రభుత్వాలను కూలగొట్టి గద్దెనెక్కడం మోదీ,షా ద్వయం ఆలోచన.

కర్నాటకలో కాంగ్రెస్ -జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసేంత వరకు నిద్ర పట్టలేదు భాజాపాకి. అనుకున్న విధంగానె సంకీర్ణ కాపురంలో గొడవలు పెట్టి అసమ్మతిని ఎగదోసి చివరకు తను అనుకున్న విధంగానె బీజేపీ గద్దెనెక్కింది. సీఎంగా యడ్యూరప్ప బాధ్యతలు స్వీకరించారు. పార్టీ అధికారంలోలేని రాష్ట్రాల్లో ఇదే పద్దతిని అనుసరించాలని ముందుకు వెల్తోంది. ఇక తమిళనాడులో జయలలిత మరణం తర్వాత బీజేపీ ఎలాంటి కుటిల నీతికి పాల్పడిందో అందరూ చూశారు. రేపు సీఎంగా ప్రమాణ స్వీకారం అనగా ఈరోజు శశికళ జైలుకెళ్లడం వెనక ఎవరున్నారో అందరికీ తెలుసు

ఇదలా ఉంటే ఏపీలో మాత్రం భాజాపా పప్పులు ఉడకవు. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి 151 సీట్ల భారీ మెజార్టీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా జగన్ కొనసాగుతున్నారు. కర్నాటకలో మాదిరి ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వం లేదు. దీంతో బీజేపీ పాచికలు పారలేదు సరికదా.., కనీసం దుర్మార్గపు ఆలోచన చేయడానికే వారి వెన్నులో వణుకు పుట్టింది. రాజ్యాంగంలోని లొసుగుల్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఏపీలో బీజేపీకి దక్కలేదు. ఇతర పార్టీల్లో ఔట్ డెడ్ అయిన నేతలను పార్టీలో చేర్చుకొని మురిసిపడుతోంది.

2024లో కూడా భాజాపాకు కనీసం డిపాజిట్లు కూడా దక్కవు. అప్పుడు కూడా ప్రధానంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదాపైనే రాజకీయాలు నడుస్తాయి. అన్ని పార్టీలు మరో సారి ప్రత్యేక హోదానినాదాన్ని తీసుకుంటాయి. ప్రజలు కూడా ఆవిధంగానె ఆలోచిస్తారు. ప్రత్యేక హోదా ఇస్తేనె పార్టీకి మనుగడ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -