Sunday, May 5, 2024
- Advertisement -

జగన్ మాస్టర్ స్ట్రోక్…… బాబుకు కోలుకోలేని దెబ్బ ఖాయమా?

- Advertisement -

చాలా ఈజీగా మేనేజ్ చేశాం………. మొత్తం విషయం సైడ్ ట్రాక్ చేసేశాం……… అంతా సేఫ్ అనుకున్న పచ్చ బ్యాచ్‌కి దిమ్మతిరిగే స్ట్రోకులు ఇవ్వడానికి రెడీ అయ్యాడు జగన్. మీడియా మేనేజ్మెంట్‌తో ఏదైనా సాధించొచ్చు అని అనుకుంటున్న వాళ్ళ దిమ్మతిరిగే ప్లానింగ్‌తో ప్రజల ముందుకు వస్తున్నాడు జగన్. ఇప్పుడు ఈ విషయాలే ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

పోలీసు బాస్‌తో సహా అందరూ బాబు చెప్పినట్టుగా వినే పరిస్థితులు ఉండడంతో జగన్‌పై హత్యాయత్నం ఎపిసోడ్‌ని పూర్తిగా సైడ్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు అండ్ కో. ఆ విషయంలో సక్సెస్ అయ్యామని కూడా అనుకున్నారు. అయితే గతంలోలా ఇప్పుడు జగన్ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు. ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆ విషయం అర్థంకాని పచ్చ మీడియా, టిడిపి నాయకులందరూ కూడా ఈ గ్యాప్‌లో పూర్తిగా ఇష్యూ సైడ్ ట్రాక్ చేశామని అనుకున్నారు. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఇప్పుడు తాజాగా ప్రజల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు జగన్. ఏకంగా తన తల్లి విజయలక్ష్మితో ప్రజలకు నిజాలు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాడు. తల్లి విజయమ్మ, చెల్లి షర్మిళనే జగన్‌ని చంపించే ప్రయత్నం చేశారు అని చంద్రబాబు సారథ్యంలోని టిడిపి నేతలు ఉచ్చనీచాలు మరిచి వ్యాఖ్యలు చేయడాన్ని తెలుగు ప్రజలు ఎవరూ సహించలేదు. ఇప్పుడు టిడిపి నేతల దిగజారుడు వ్యాఖ్యలతోపాటు జగన్‌పై హత్యాయత్నం ఘటన గురించి కూడా విజయమ్మ ఏం మాట్లాడతారో అని పచ్చ బ్యాచ్ నాయకులతో పాటు పచ్చ మీడియా జనాలు కూడా టెన్షన్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఆల్రెడీ విజయమ్మ వ్యాఖ్యలను కౌంటర్ చేయడానికి పచ్చ బ్యాచ్ జనాలు న్యూస్ రీల్స్ రెడీ చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విజయమ్మ వ్యాఖ్యల తర్వాత జగన్‌పై హత్యాయత్నం ఘటన మరోసారి హాట్ టాపిక్ అవ్వడం ఖాయం. అలాగే ప్రజాసంకల్ప యాత్రను వాయిదా వేసే ప్రసక్తే లేదన్నట్టుగా, రిస్క్ అయినా పర్లేదన్నట్టుగా ప్రజల ముందుకు రావడానికి జగన్‌ని రెడీ అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ సారి మాత్రం ప్రజాక్షేత్రంలో జగన్‌‌ని ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్న విశ్లేషణలు వినిపస్తున్నాయి. ఇప్పటికీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా చంద్రబాబుకంటే దాదాపు పది శాతం ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు జగన్‌ని కోరుకుంటున్నారు. అలాగే వైకాపాకు టిడిపికంటే పది శాతం ఓట్లు ఎక్కువ పడేలా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు ఉన్నాయని జాతీయ స్థాయి ఎన్నికల సర్వేలన్నీ తేల్చి చెబుతున్న విషయంలో టిడిపి పరిస్థితి ఇంకా దిగజారకుండా ఉండేలా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని టిడిపి నేతలు కూడా ఆందోళనగా ఎదురుచూస్తూ ఉండడం పరిస్థితిని తెలియచేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -