Friday, May 3, 2024
- Advertisement -

టీడీపీ ఆయుప‌ట్టుపై జ‌గ‌న్ గురి…

- Advertisement -

2019 ఎన్నిక‌ల్లో అధికారం ఏపార్టీకీ అంత సుల‌భంగా ద‌క్కే అవ‌కాశాలు క‌నిపించ‌డంలేదు. అన్ని రాజ‌కీయ పార్టీల మ‌ధ్య పోరు నువ్వానేనా అన్న‌ట్లుగా ఉండ‌నుంది. ప్ర‌ధానంగా టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య ముక్కోణ‌పు పోటీ ఉండ‌నుంది. ఎన్నిక‌ల్లో కుల, మ‌తాలు కీ పాత్ర పోషిస్తాయి. ప్ర‌తీ పార్టీకీ ఏదోక కులం ఓటు బ్యంకు ఉంటుంది. అదే ఆ పార్టీ గెలుపులో ప్ర‌ముఖ పాత్ర వ‌హిస్తాయి.

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ గ‌త ఎన్నిక‌ల్లో ఓట్లుప‌డ‌ని కులాల ఓటు బ్యాంక్ కోసం అన్ని పార్టీలు గాలం వేస్తున్నాయి. కులాల ఓటు బ్యాంకు కోసం వైసీపీ, టీడీపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. టీడీపీ.. రెడ్డి ఓటుబ్యాంకు కోసం, వైసీపీ.. బీసీ ఓటు బ్యాంకుకోసం పావులు క‌దుపుతున్నారు. పార్టీల‌కున్న ఓటు బ్యాంకు ఆయువు ప‌ట్టుమీద కొడితే విజ‌యం న‌ల్లేరుమీద న‌డ‌కే అనే కోనంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ…వారి కోసం భారీ తాయిలాల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి.

అనాదిగా టీడీపీకీ బీసీ ఓటు బ్యాంకు ఆయుప‌ట్టువుగా ఉంది. దాన్ని దెబ్బ కొట్టేందుకు జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ వేస్తున్నారు. అది స‌క్సెస్ అయితే జ‌గ‌న్ విజ‌యానికి తిరుగుండ‌దు. ద‌శాబ్దాలుగా టీడీపీ పెన‌వేసుకున్న బీసీలు పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌వైపు చూస్తున్నారు.

గోదావరి జిల్లాలలో బీసీలను దగ్గర చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన జగన్ ఉత్తరాంధ్రలో వారి జపం చేస్తున్నారు.. ఇక్కడ మూడు జిల్లాలలో బీసీలు పెద్ద ఎత్తున సంఖ్యలో ఉండడంతో వైసీపీ అన్ని అస్త్రశస్త్రాలను బయటకు తీస్తోంది. దావరి జిల్లాలతొ మొదలుకుని విశాఖలోనూ బీసీలు పెద్ద సంఖ్యలో జగన్ ని అనుసరిస్తున్నారు. పాద‌యాత్ర‌లో వారికున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు ఏకరువు పెడుతున్నారు.

జగన్ వారికి వివరించడం ద్వారా తాను అధికారంలోకి వస్తే చేయబోయేది ఏంటన్నది సావధానంగా చెబుతున్నారు. టీడీపీ గడచిన నాలుగేళ్ళుగా చేసిన మోసాలను వివరిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.కాపులను బీసీలలో చేర్చే అంశంపై టీడీపీతో విభేదిస్తున్న బీసీలకు ప్రభుత్వ పధకాలు ఏవీ అమలు కాకపోవడంతో అసంత్రుప్తి బాగా పెరిగింది. వారిలో ఉన్న అసంతృప్తిని త‌మ‌కు అనుకూలంగా మ‌లుచుకొనేందుకు జ‌గ‌న్ వారికి భారీ వ‌రాలు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

పాద‌యాత్ర ముగిసిన త‌ర్వాత బీసీ ఘ‌ర్జ‌న స‌భ‌ను నిర్వ‌హించి పార్టీ తరఫున డిక్లరేషన్ విడుదల చేస్తారని పార్టీ వర్గాల స‌మాచారం. రేపటి రోజున బీసీలకు రాజకీయంగా, ఆర్ధికంగా చేయబోయే మేళ్ళ గురించి జగన్ గర్జనలో ప్రకటిస్తారని అంటున్నారు. ఇది ఎంత వ‌ర‌కు వైసీపీనీ విజ‌య తీరాలకు చేరుస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -