Sunday, May 5, 2024
- Advertisement -

టిట్లీ బాధితులకు జగన్ పరామర్శ….. బాబు దుష్ప్రచారానికి జగన్ దిమ్మతిరిగే కౌంటర్

- Advertisement -

టిట్లీ బాధితులను జగన్ పరామర్శించడానికి రాలేదు. పక్క జిల్లాలో పాదయాత్ర చేస్తున్నప్పటికీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. బాధితులను ఆదుకుంటోంది బాబు ఒక్కడే అని ఓ స్థాయిలో ప్రచారం చేసుకుంటున్నారు బాబు అండ్ బ్యాచ్. ఇప్పుడు ఈ దుష్ప్రచారానికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు జగన్. అది కూడా మాటలతో చెప్పడం కాదు…….చేతలతోనే సమాధానం చెప్తానన్నాడు. తుఫాను బాధితులను ఆదుకోవాల్సిన తక్షణ బాధ్యత ప్రభుత్వానిదే. ప్రజలను అప్రమత్తం చేయడంలో ఫెయిల్ అయ్యామని స్వయంగా చంద్రబాబే ఓ ఇంటర్యూలో ఒప్పుకున్నారు. తుఫాన్ తర్వాత వైకాపా శ్రేణులు కూడా విస్తృతంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేలా జగన్ దిశానిర్ధేశం చేశాడు. తుఫాన్ బాధితుల కోసం స్వయంగా కోటి రూపాయలు డొనేట్ చేయడంతో పాటు పార్టీ నాయకులందరి చేతా సాయం చేయించాడు. ప్రత్యక్షంగా నేను అక్కడకు వెళ్ళి సహాయ కార్యక్రమాలకు ఇబ్బంది కలిగించడం కంటే ఇది మంచిదే కదా……..?అన్నది జగన్ భావన.

ఇక తుఫాన్ వచ్చి వెళ్ళిన ఇన్ని రోజుల తర్వాత త్వరలోనే తుఫాన్ బాధితుల దగ్గరకు నేను వెళ్తున్నాను. బాధితులందరికీ న్యాయం చేశాం అని చంద్రబాబు, ఆయన భజన మీడియా ప్రచార డప్పు కొట్టుకుంటున్నారు కదా…….అందులో వాస్తవం ఏంటో ప్రజలకు తెలిసేలా చేస్తాను. బాధితుల కష్టాలు నిజంగా లేకపోతే అందరికీ సంతోషమే. అలా కాకుండా కేవలం ప్రచార యావ తప్ప…..పని ఏమీ చేయకుండా ఉండే చంద్రబాబు అసలు నైజమే ఇక్కడా బయటపడితే తుఫాన్ వచ్చి వెళ్ళిన రెండు వారాల తర్వాత కూడా ఇంకా ప్రజలను కష్టాల్లో ఉంచిన చంద్రబాబు పాలన గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చేస్తాను. అలాగే ప్రజల కష్టాలు కేంద్రప్రభుత్వానికి, నరేంద్రమోడీకి తెలిసేలా చేసి వాళ్ళ దగ్గర నుంచి కూడా సాయం రాబట్టే ప్రయత్నం చేస్తాం. వైకాపా నాయకులు కూడా మోడీని కలిసి బాధితులను ఆదుకోవాలని మోడీపైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. ఇంతకుమించి ఒక ప్రతిపక్ష నాయకుడు ఏం చేయగలడో చంద్రబాబు చెప్పగలడా? ప్రజలకు కష్టాలు వస్తే అధికారంలో ఉన్న ఆయన…….ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని రంగంలోకి దింపి ………ఆ ప్రజలను ఆదుకోవాలి. ఆ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయిన చంద్రబాబు ఆ నిందను నాపైన వేసే ప్రయత్నం చేయడం మాత్రం బాధితులు కూడా అసహ్యించుకునేలా ఉందని జగన్ అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోయినా, రాయలసీమ కరువు అయినా, ప్రజలకు ఏ కష్టం వచ్చినా అన్నింటికీ ప్రతిపక్ష నాయకుడే బాధ్యుడు అని చెప్పి తప్పించుకోవాలని చూస్తే ప్రజలకు నిజాలు తెలిసిన రోజు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి శిక్ష వేశారో….చంద్రబాబుకు అంతకంటే పెద్ద శిక్ష వేస్తారని జగన్ అభిప్రాయపడ్డారు. జగన్ మాటల్లో వాస్తవం ఉందని, ప్రతిసారీ ప్రచార పటాటోపంతో ప్రజలను మోసం చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -