Monday, May 6, 2024
- Advertisement -

బాబు అవినీతి క్లైమాక్స్‌కు చేరింది…. వైసీపీ అధినేత జ‌గ‌న్

- Advertisement -

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడిపై పాద‌యాత్ర‌లో సంల‌చ‌ల‌న కామెంట్స్ చేశారు. నాలుగేళ్లుగా 5 కోట్ల ఏపీ ప్రజానీకాన్ని మోసం చేస్తున్న చంద్రబాబు వ్యవహారం క్లైమాక్స్‌కు చేరింద‌న్నారు. గత నెల 15 వరకు అవిశ్వాస తీర్మానంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ ఒక్కరితోనూ మాట్లాడలేదని, ఆ తరువాత ఒక్కసారిగా తీరు మార్చుకున్నారన్నారు .

గుంటూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తోన్న జగన్ ఈ రోజు మాయాబజార్‌లో స‌భ‌ను నిర్వ‌హించారు. తమ ఎంపీలతో చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయించట్లేదో తెలుసా? విచ్చలవిడిగా తాను చేసిన అవినీతి మీద కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందని భయపడుతున్నార‌ని ఎద్దేవ చేశారు.

ఒకవేళ తనపై విచారణకు ఆదేశిస్తే తన తరఫున పోరాడేందుకు ఎంపీలు ఉండాలని చంద్రబాబు వారితో రాజీనామా చేయించట్లేదు. మళ్లీ ఒకసారి ప్రత్యేక హోదాపై మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు ఇతర పార్టీల నాయకులతో ప్రత్యేక హోదా కోసం మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు మీద విచారణకు ఆదేశిస్తే ఇతర పార్టీల నాయకుల మద్దతు కూడా కూడగట్టడానికి వెళ్లారు.

తన తరఫున మాట్లాడాలని ఇతర పార్టీల నాయకులతో మాట్లాడడానికి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. ఇలాంటి మోసాలు చేసే వ్యక్తిని పొరపాటున కూడా క్షమించకూడదు” అని వ్యాఖ్యానించారు. పార్లమెంటు సమావేశాల చివరిరోజు తమ ఎంపీలు రాజీనామాలు చేస్తారని, టీడీపీ ఎంపీలు రాజీనామా చేస్తారా? అని జగన్ ప్రశ్నించారు. మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే కేంద్ర సర్కారు దిగొస్తుందని చెప్పుకొచ్చారు.

చంద్రబాబును మరోసారి నమ్మి మోసపోకండి. ఈసారి మిమల్ని ప్రలోభ పెట్టడానికి పెద్ద పెద్ద మోసాలకు తెరలేపుతాడు. ఇచ్చేదంతా తీసుకోండి. అదంతా ప్రజలను దోచేసి ఆయన సంపాదించిన సొమ్మే. కానీ, ఓటు మాత్రం మనస్సాక్షి ప్రకారం వేయండి’ అని జగన్‌ ప్రజలను కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -