Saturday, May 18, 2024
- Advertisement -

జ‌గ‌న్ ముందు చూపు…

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్శ్ జోరు పెంచింది. పార్టీలో ఎవ‌రూ చేర‌క‌పోయినా ప‌లానా నాయ‌కులు మా పార్టీలో చేరుతున్నార‌ని మైండ్‌గేమ్‌ను మొద‌లు పెట్టిన టీడీపీ దిమ్మ‌తిరిగే షాక్ త‌గిలింది. జ‌గ‌న్ ముందుచూపుతో బాబుకు మైండ్ బ్లాక్ అయ్యింది.

వచ్చే ఎన్నికల నాటికి వైసీపీని బ‌ల‌హీనం చేయాల‌ని బాబు కంక‌నం క‌ట్టుకున్నారు. జ‌గ‌న్‌కు మంచి ప‌ట్టున్న జిల్లాల్లో బ‌ల‌మైన నాయ‌కుల‌ను టీడీపీలో చేర్చుకొనేందుకు కొంతమంది నేతలకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే ఆయా జిల్లాల్లో వైసీపీ నేతలకు గాలం వేసే పనులు మొదలయ్యాయి.

నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత ఒకింత ఆత్మన్యూనతలో కూరుకుపోయిన వైసీపీ నేతలకు భవిష్యత్తుపై కొంత ఆందోళన ఉన్న మాట వాస్తవం. సరిగ్గా ఇదే పాయింట్ పై ఫోకస్ చేసిన టీడీపీ.. నయానో.. భయానో వారందరిని తన గూటికి చేర్చుకునే ప్రయత్నాలు షురూ చేసింది. కర్నూలు నుంచి ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ అనే ప్రచారాన్ని కూడా ఇందులో భాగంగానే చూడాల్సి వస్తోంది.

టీడీపీకి వెన్నుద‌న్నుగా నిలుస్తోన్న ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ‌కు చెందిన పేప‌ర్‌, ఛానెల్లో అయితే వైసీపీకి చెందిన అంద‌రు ఎమ్మెల్యేలు పార్టీ మారిపోతున్నార‌ని ఓ విడ‌త‌ వార్త‌లు, స్క్రోలింగ్‌లు వ‌చ్చేశాయి. వైసీపీ ఎమ్మెల్యేపై మైండ్‌గేమ్ ఆడుతోన్న స‌ద‌రు మీడియా సంస్థ‌లో రెండు రోజులుగా సీమ‌లో వైసీపీకి చెందిన ఐదుగురు టాప్ లీడ‌ర్లు పార్టీ మారుతున్నార‌న్న ప్ర‌చారం మొద‌లైంది.

పార్టీ మారె వారిలో ప్ర‌ముఖంగా ర్నూలు ఎంపీ బుట్టా రేణుక‌, మంత్రాల‌యం ఎమ్మెల్యే బాల‌నాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం, అనంత‌పురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథ‌రెడ్డిల పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. అయితే ఈవార్త‌ల‌పై నాయ‌కులు స్పందించ‌డంతో ఊహాగానాల‌కు తెర‌ప‌డింది. క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక‌తో పాటు బాల నాగిరెడ్డి, జ‌య‌రాం ఇద్ద‌రూ ఈ వార్త‌ల‌ను ఖండించారు. తాము వైసీపీని వీడు ప్ర‌శ‌క్తే లేద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టేశారు.

ఆలూరు ఎమ్మెల్యే జ‌యరాం కూడా త‌న రాజ‌కీయ ఎదుగుద‌ల‌కు బీజం వేసిన వైసీపీని వీడన‌ని చెప్పిన‌ట్టు మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీంతో త‌మ అనుకూల మీడియా ద్వారా ఈ ఇద్ద‌రు ఎమ్మెల్యేపై టీడీపీ ఆడిన మైండ్‌గేమ్‌కు వీరు సూప‌ర్‌ షాక్ ఇచ్చిన‌ట్టే క‌న‌ప‌డుతోంది.

ఇదంతా జ‌గ‌న్ ముందు చూపుతోనె బ్రేక్‌ప‌డింద‌నె చెప్ప‌వ‌చ్చు. జ‌గ‌నే నేరుగా రంగంలోకి దిగి నాయ‌కుల‌తో మాట్లాడ‌టంతో ఈవార్త‌ల‌కు పుల్‌స్టాప్ ప‌డింది. పార్టీ నేతలందరిని గీత దాటకుండా కట్టడి చేశాడనె వార్త‌లు వినిపిస్తున్నాయి. ఏదేమైనా బాబు ఆడుతున్న మైండ్‌గేమ్‌కు ప్ర‌స్తుతానికైతె చెక్ ప‌డింద‌నె చెప్ప‌వ‌చ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -