Saturday, May 4, 2024
- Advertisement -

సామాజిక వ‌ర్గాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు జ‌గ‌న్ మాస్ట‌ర్ ప్లాన్ ….

- Advertisement -

వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ప్ర‌కారంబ‌డి వెల్తున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో చేసిన త‌ప్పులు పున‌రావృతం కాకుండా ముందు జాగ్ర‌త్త ప‌డుతున్నారు. అధికారంలోకి రావాలంటే అయా సామాజిక వ‌ర్గాల మ‌ద్ద‌తు త‌ప్ప‌నిస‌రి. అందుకే పాద‌యాత్ర‌లో జ‌గ‌న్ బ‌ల‌మైన సామాజిక వ‌ర్గాల‌మీద దృష్టి సారించారు. రాష్ట్రంలో బీసీలు ఎక్క‌వ శాతం ఉండారు కాబ‌ట్టి వారి విష‌యంలో జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

మొత్తం జనాభాలో బిసిలు సుమారు 54 శాతం ఉంటారు. 140 కులాలు కలిపి బిసిలన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ప్రతీ కులానికీ కచ్చితంగా ఓ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. అంటే అందరికీ ఎంఎల్ఏనో లేకపోతే ఎంపి పదవో ఇస్తానని కాదు జగన్ ఉద్దేశ్యం. గ్రామస్ధాయి నుండి ఢిల్లీ స్ధాయి వరకూ ఎక్కవ అవకాశం ఉంటే అక్కడ వీలున్నంతలో బిసిలకు అగ్రస్ధానం ఇవ్వాలన్నదే జగన్ ప్లాన్‌.

చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ వడమాలపేటలో జరిగిన బిసి సదస్సులో పాల్గొన్నారు. వైసిపి అధికారంలోకి రాగానే ప్రతీ కులానికి ఓ పదవి వచ్చేట్లు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. మొత్తం ఓట్లలో ఒకవైపు కాపులు, మరోవైపు బిసిలే అధికారం నిర్ణ‌యించేది. అందుకే జ‌గ‌న్ ఈసారి బీసీల‌కు పెద్ద‌పీట వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -