Wednesday, May 15, 2024
- Advertisement -

మాట‌ల తూటాల‌తో మ‌రింత వేడెక్కిన నంద్యాల ఎన్నిక‌ల‌  రాజ‌కీయం….

- Advertisement -

పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డ‌టంతో అధికార‌,ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల యుద్ధం ప‌తాక స్థాయికి చేరింది. వైసీపీ అధినేత జ‌గ‌న్ రెండు వారాలుగా నంద్యాల‌లోనె మ‌కాం వేసి శిల్పా త‌రుపున అలు పెరుగ‌ని ప్ర‌చారం చేస్తూ అధికార పార్టీ నాయ‌కుల‌పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు.

నంద్యాల‌ పట్టణంలోని సాయిబాబానగర్‌లో ప్రచారం నిర్వహించారు. 2019లో తమ ప్రభుత్వం రాగానే కేశవరెడ్డి, అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. తనపై ప్రజలకున్న నమ్మకమే తన ఆస్తిగా పేర్కొన్నారు. బాబు పాలనపై.. ప్రజలకు సేవ చేయడంలో తన తండ్రి వైయస్‌ ఫొటోలాగానే తన ఫొటో కూడా ఉంచుకునే విధంగా పాలన అందిస్తామని జగన్ తెలిపారు. నంద్యాల ఉప ఎన్నిక నీతి, నిజాయితీ మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. చంద్రబాబు మూడున్నర ఏళ్లలో చేసిన మోసాలు, అవినీతి, అక్రమాలు అన్నీఇన్నీ కావని చెప్పారు.

ఈ సంద‌ర్భంగానె మంత్రి నారాయ‌న‌, బాబు ఇద్ద‌రిపై జ‌గ‌న్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అధికారంలోకి రాగానె చంద్రబాబు చొక్కా.. మంత్రి నారాయణ నిక్కరు వి ప్పిస్తానని కేశవరెడ్డి, అగ్రిగోల్డ్‌ బాధితులనుద్దేశించి అన్నారు. ప్రజల ఆశీస్సులతో.. ప్రజల ఆశీస్సులతో తాను అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడికి మూడు సెంట్ల స్థలాన్ని ఉచితంగా రిజిష్ట్రేషన్ చేయించి ఇస్తామన్నారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేషన్‌ షాపుకు వెళ్తే 9 రకాల వస్తువులు ఇచ్చేవారని, ఇప్పుడు బియ్యం తప్ప ఏమీ ఇవ్వడం లేదని జగన్ తెలిపారు. ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఒక్క రోజు మాత్ర‌మే స‌మ‌యం మిగిలి ఉండ‌టంతో ఎన్నిక‌ల ప్ర‌చారం వేడెక్క‌డంలో సందేహంలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -