2019 ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టేందుకు వైసీపీ అధినేత జగన్ గేమ్‌ప్లాన్ రెడీ చేస్తున్నారు. 2014 లో చేసిన తప్పులను మరోసారి పునరావ్రతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పాదయాత్రలో వస్తున్న ప్రజాస్పందనను చూసి మరింత దూకుడు పెంచారు. పాదయాత్రలోనే కొన్ని నియోజక వర్గాల్లో పార్టీ అభ్యర్తులను ప్రకటించి సంచలనం రేపారు.
ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజక వర్గాల్లో పార్టీ పరిస్థితులు, అభ్యర్తుల గెలుపుపై ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికలు జగన్ దగ్గర రెడీగా ఉన్నాయి. 175 నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్తుల ఎంపికకోసం సరికొత్త ప్లాన్‌తో ముందుకెల్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర, జిల్లాస్థాయి నేతలతో ప్లీనరీ నిర్వహించాలని జగన్ ప్లాన్ చేశారంట.
ఈ నెలాఖరులోగా నియోజక స్థాయిలో ప్లీనరీలు నిర్వహించనున్నారు. దీనిద్వారా నియోజకవర్గాల్లో ఉండే లోటుపాట్లను సరిచయనున్నారు. వచ్చే నెల 19,20,21 తేదీలలో జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. జులై నెలలో 8,9 తేదీలలో విజయవాడలో రాష్ట్ర స్థాయి ప్లీనరీ ఏర్పాటు చేసి పార్టీకి సంబందించిన పలు తీర్మానాలు చేయనున్నారు.
టీడీపీ చేసిన ఆపరేషన్ ఆకర్ష లో 21 మంది ఎమ్మెల్యేలు,ఇద్దరు ఎంపీలు వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. ఆయా నియోజక వర్గాల్లో బలమైన అభ్యర్ధులకోసం స్పెషల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే కర్నూల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ మాజీ మంత్రివర్యులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి జగన్ ఒక బంపర్ ఆఫర్ చేసిన్నట్టు సమాచారం. మరి జగన్ 2019 ఎన్నికల ప్లాన్ సక్సెస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.
