వైసీపీనీ వీడుతున్నారంటూ వస్తున్న వార్తలకు చెక్ పెట్టారు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని దుస్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.పార్టీ మారుతన్నాననే తపపుడు ప్రచారానలు నమ్మవద్దని కార్యక్తలకు సూచించారు. నైతిక విలువలతో వార్తలు రాయాలి గాని తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే ఆ చానెళ్లకు విలువలు ఉండవని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని మేకపాటి స్పష్టం చేశారు.వైఎస్పార్‌సీపీ ఆవిర్భావం ముందు నుంచి వైఎస్ జగన్ వెంట నడిచానని.. ఆయనతో కలిసి పనిచేశానని గుర్తు చేశారు మేకపాటి. పార్టీ ఆదేశాల మేరకు ఎంపీ పదవికి రాజీనామా చేశాననన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీచేస్తానని.. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదన్నారు. బాబు నిజస్వరూపం ప్రజలందరికీ తెలుసు. వచ్చే ఎన్నికల్లో బాబుకు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
