రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మొక్కారనే వార్తలు చర్చనీయంశంగా మారాయి. సీఎం చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఉభయసభలు వాయిదా పడిన అనంతరం మాట్లాడుతూ సహనం కోల్పోయారు. తనను గజ దొంగ అని చంద్రబాబు అంటున్నారని… అంతర్జాతీయ క్రిమినల్ చార్లెస్ శోభరాజ్ ను మించిన గజదొంగ చంద్రబాబు అని విమర్శించారు.
ఒక తల్లి, తండ్రికి పుట్టినవారెవరూ చంద్రబాబులా మాట్లాడరంటూ అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాతో తనను ఎలా పోలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఏ ఒక్క బ్యాంకు నుంచి తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అని అన్నారు. ఎంపీ సుజనా చౌదరి కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నారని… రెండేళ్లు శిక్ష పడిన ఎమ్మెల్యే ఇంకా టీడీపీలోనే కొనసాగుతున్నారని చెప్పారు. టీడీపీ మంత్రులు, ఎంపీలు పేకాట క్లబ్ లను నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
