- Advertisement -

జ‌గ‌న్ ఆ వ్యాఖ్య‌ల‌తో ఫ‌లితం రివ‌ర్స్ అయ్యింది….

- Advertisement -

నంద్యాల ఉప ఎన్నిక ఓట‌మిపై వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సొంత పార్టీ సీనియ‌ర్‌నేత‌ల‌నుంచి విమ‌ర్శ‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. బ‌హిరంగంగా విమ‌ర్శించ‌క పోయినా త‌మ స‌న్నిహితుల వ‌ద్ద చెప్పుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఆ పార్టీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి జ‌గ‌న్‌పై చేసిన వ్యాఖ్య‌లు ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి. పార్టీలో ఇప్పుడు ఇదే హాట్ టాఫిక్ గా మారింది.

నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు తమ వైపే ఉన్నట్లుగా కనిపించాయని…కాని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల అనంత‌రం సీన్ రివ‌ర్స్ అయ్యింద‌ని మేక‌పాటి అభిప్రాయ‌ప‌డ్డారు. నంద్యాల ఓటమిపై అందరి వేళ్లు జగన్ వైపే చూపిస్తున్నాయ‌న్నారు. పలువురు రాజకీయ విశ్లేషకులతో పాటు టిడిపి నేతలు కూడా జగన్ వ్యాఖ్యలు తమకు లాభించాయంటున్నారు. వైసిపి నేతలు కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

వైసిపి సీనియర్ నేతలు కూడా జగన్ వల్ల కూడా ఓటమి చెందామ‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. చంద్రబాబును కాల్చివేయాలన్న జగన్ వ్యాఖ్యలు తమను దెబ్బతీశాయని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకు మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం అంటున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో జగన్ అద్భుత ప్రసంగం, శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామాతో టిడిపి, చంద్రబాబు డిఫెన్స్‌లో పడ్డారని భావించామని మేకపాటి అన్నారు. చక్రపాణి రాజీనామా చాలా మంచి నిర్ణయం అన్నారు. కానీ ఆ తర్వాత చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలకు టీవీల్లో విమర్శలు కనిపించాయని చెప్పారని తెలుస్తోంది. అప్పటి వరకు తమదే గెలుపు అనుకున్న తమకు ఫ‌లితాలు మాత్రం వ్య‌తిరేకంగా వ‌చ్చింద‌న్నారు. అయితే ఇప్పుడు మేక‌పాటి వ్యాఖ్య‌లు ఎలాంటి ప‌రిణామాల‌కు దారితీస్తాయో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -