Tuesday, May 14, 2024
- Advertisement -

Adya’s Special: డబ్బింగ్ వద్దు… డైరెక్ట్ చిత్రాలే ముద్దు..!

- Advertisement -

టాలీవుడ్ జనాలకు వైవిధ్యమైన తెలుగు చిత్రాలతో కడుపు నిండిపోతున్నట్లుంది. అందుకే మనవాళ్లు గతంలో మాదిరిగా డబ్బింగ్ చిత్రాలను ఆదరించడం లేదు.కాని మన చిత్రాలు డబ్ అయితే మాత్రం….మిగతా వారు గతంలో ఎన్నడూ లేనివిధంగా లైక్ చేసేస్తున్నారు.నో డబ్బింగ్ సినిమాస్ … ఓన్లీ స్ట్రైట్ ఫిలింస్ ప్లీజ్ అని మనవారు ఎందుకంటున్నారో ఇపుడు చూద్దాం.

టాలీవుడ్లో తమిళ డబ్ చిత్రాల హవా తగ్గిపోయింది.గతంలో తమిళ చిత్రం డబ్ అయి తెలుగులో వస్తుందంటే చాలు…. మనవాళ్ళు వాటికోసం ఎంతో ఆతృతగా ఎదురు చూసేవారు. ఆ ఎదురుచూపుతో మన హీరోలు తెగ వర్రీ అయిపోయేవారు. ఎక్కడ మన బొమ్మ ఆడకుండా పోతుందోననే భయం వారిని వెంటాడేది.కాని ఇపుడు సీన్ పూర్తిగా మారిపోయింది.

ఈఏడాది డబ్బింగ్ చిత్రాలను మనవారు చీల్చి చెండాడారు.తెలుగులోనే బోలెడన్నీ వండర్స్ వస్తుంటే…ఇక తమిళ పైత్యం మనకెందుకులే అనుకున్నారు.దీంతో శంకర్ తయారు చేసిన ఐ చిత్రం కూడా మనవాళ్లకు కనిపించకుండా పోయింది.

శంకర్ చిత్రమంటే ఆశించినస్థాయిలో లేదు కాబట్టి పోయిందనుకోవచ్చు. మరి ఏం  చూసి రఘువరన్ బిటెక్ ను మనవాళ్లు అంతగా ఆదరించలేదు.సినిమా మన జనాలకు తగ్గట్లుగానే ఎంతో బాగా వచ్చింది.

కామెడీ కూడా కావల్సినంత ఉంది.కాని కొన్ని సెంటర్స్ వరకే సినిమా పరిమితమైంది.ఇక ఇదే హీరో చేసిన పందెంకోళ్లు పరిస్థితి ఇంతే. ఈసినిమా కోలీవుడ్లో వచ్చి చాలా కాలమైనప్పటికీ …మనవాళ్లకు దీన్ని డబ్ చేసి అందించారు కాబట్టి దీన్ని మనం ప్రెష్ అనుకోవాలి.మనోళ్లు మేధావులు కదా.ఇలాంటి మాస్ పప్పులు మా దగ్గర ఉడకవని చెప్పి..సారీ చెప్పేశారు.ఒక్క మాటలో చెప్పాలంటే…. ఈ సినిమాలోని సోల్ మనోళ్లకు కనెక్ట్ అయితే ఒట్టు.దాంతో ఏం చూస్తాం లే అని చెప్పి…సైడ్ చేసేశారు.

వీరి సంగతి అంటే… ఏదో అనుకోవచ్చు. మగమహారాజ,డా.సలీమ్ లో చిత్రాల్లో ఏం తక్కువైందని మనవాళ్లు వాటిని యాక్సెప్ట్ చేయలేదు.ఈ సినిమాలు తమిళ్లో మంచి విజయాలనే నమోదు చేసుకున్నాయి.గతంలో ఇలాంటి వైవిధ్యమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులు భాగానే లైక్ చేశారు. కాని ఇక్కడొకొచ్చే సరికి అవి మనవాళ్లకు నచ్చకుండా పోయాయి.ఇక తెలుగులో ఎంత వాడు గాని అనే పేరుతో వచ్చిన ఎన్నై అరిందాల్ సినిమాకు ఇదే స్విచ్ వేషన్ .

యాసిటీజ్ గా ఈ సినిమాను తెలుగు సినీ ప్రేక్షకులు పక్కన పెట్టేశారు.  ఇక్కడొచ్చిన సమస్య… తమిళ సక్సెస్ ఫుల్  చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తే చూడకపోవడం కాదు.ఆ చిత్రాన్ని ఇక్కడ చూడాలంటే…మనవాళ్ల మైండ్ లకు అది కనెక్ట్ అయ్యేలా ఉండాలి.ఈఏడాది మన టాలీవుడ్ చేసిన 

ప్రయోగాలు మన సినీ జనాలకు భాగా నచ్చేయడంతో ప్రయోగాలంటే ఇదే కాబోలని తమిళ ఎక్స్ పరిమెంట్స్ ను పట్టించుకోవడం మానేశారు.ఇక్కడ విచిత్రమేమిటంటే ఎట్ ది సేమ్ టైమ్ మన వైవిధ్యాలను తమిళ తంబీలు ఆదరించడం..

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -