Saturday, May 4, 2024
- Advertisement -

బాలయ్య వర్సెస్ నాగ్…. లెజెండ్‌పై అలా ప్రతీకారం తీర్చుకున్న నాగ్…

- Advertisement -

నంది అవార్డ్స్ విషయంలో రాజకీయ జోక్యం మరీ శృతిమించిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డ్స్‌పై ఈ సారి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. అవార్డ్ వచ్చినవాళ్ళతో సహా అందరూ విరుచుకుపడిపోయారు. అది కూడా లెజెండ్ లాంటి ఏ ప్రయోజనమూ లేని ఫక్తు నరుకుడు సినిమాకు ఏకంగా 9 అవార్డులు కట్టబెట్టడం సామాన్య ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. అదే టైంలో మనం లాంటి క్లాసిక్ హిట్….. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న సినిమాకు అవార్డుల్లో అన్యాయం జరగడం కూడా చాలా మందిని బాధించింది. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా అయిన మనంని నాగార్జున ఎంతగా ప్రేమించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా కావడంతో ఆ సినిమాను అందరూ గౌరవించాలని నాగార్జున కోరుకున్నాడు. అందులో తప్పు కూడా లేదు. నిజానికి మనం సినిమా చాలా బాగుంటుంది. హీరోయిన్స్ స్కిన్ షోలు, బూతు జోకులు, నరుకుడు బ్యాచ్‌లు లేకుండా ఒక అందమైన కుటుంబ ప్రేమకథను అంతే అందంగా తెరకెక్కించాడు విక్రమ్ కుమార్. మరీ ముఖ్యంగా మనవైన భావోద్వేగాలు చాలా మంది గుండెల్లో ఆ సినిమా నిలిచిపోయేలా చేశాయి. అలాంటి సినిమాకు అన్ని రకాలుగానూ గుర్తింపు రావాలని ఎవరైనా కోరకుంటారు? ఇక అక్కినేని నాగేశ్వరరావు లాంటి నటుడి చివరి సినిమా…..ఆ సినిమాలో అక్కినేని అద్భుతంగా నటించాడు. అలాంటప్పుడు కొన్ని నిబంధనలు పక్కనపెట్టి అయినా అక్కినేని నాగేశ్వరరావును గౌరవిస్తూ అవార్డును ప్రకటించి ఉంటే అందరూ సంతోషించేవారు.

కానీ పాలకులకు ఆ స్థాయి పెద్ద మనసు లేకుండా పోయింది. నరుకుడు పోరాటాలు, తలలు తెగిపడే సీన్లు, హీరోయిన్స్ స్కిన్ షో లాంటి వాటిపై ఆధారపడిన సినిమాకు తొమ్మిది అవార్డులు ఇచ్చి తన వాళ్ళను ఖుషీ చేసిన పాలకుల స్వార్థం……. మనం లాంటి క్లాసిక్ సినిమాకు, చివరి సినిమాలో అక్కినేని నాగేశ్వరరావులాంటి నటుడి అద్భుతమైన నటనకు పూర్తిగా అన్యాయం చేసింది. పునర్జన్మల కథ కాబట్టే ఇవ్వలేదు అన్న మాట కేవలం సాకు మాత్రమే. అలా అయితే హింసను ప్రేరేపించే సినిమాలకు కూడా అవార్డు ఇవ్వకూడదన్న రూల్ ఉంది. మరి లెజెండ్‌లో హింసను ప్రేరేపించే సినిమాలు, తలలు నరికే సీన్లు మామూలుగా ఉంటాయా? ఎందుకు ఇచ్చారు?

అయితే మనం సినిమాకు ఆ స్థాయిలో అన్యాయం జరిగినా…… మరీ ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు లాంటి అగ్రశ్రేణి నటుడు…. చివరగా నటించిన పాత్రకు, ఆ పాత్రలో ఆయన అద్భుత నటనకు కచ్చితంగా అవార్డ్ ఇచ్చి గౌరవించాలన్న పెద్ద మనసు పాలకులకు లేకపోయినా నాగార్జున మాత్రం స్పందించలేదు. అయితే ఇప్పుడు అకిల్ ట్రైలర్‌లో మాత్రం సూపర్బ్ కౌంటర్ ఇచ్చాడు నాగ్. ఆ రకంగా టైం చూసి కొట్టాడు. మనవ సినిమా డైరెక్టర్ విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ‘హలో’ సినిమా ట్రైలర్ లేటెస్ట్‌గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్‌లో ఉన్న ఒక లైన్ మనం సినిమాకు అవార్డ్స్ రాలేదు అని బాధపెడుతున్న అందరినీ చాలా సంతోష పెడతోంది. ‘ఫ్రం ది మేకర్స్ ఆఫ్ మనం……టు విచ్ యూ అవార్డెడ్ యువర్ హార్ట్స్…..’……ఇదే ఆ లైన్. లెజెండ్‌కి నాగ్ ఇచ్చిన కౌంటర్ ఇది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లెజెండ్ సినిమా అద్భుతం అని చెప్పే ప్రేక్షకులు ఉండే అవకాశం అయితే లేదు. చూసినంత సేపు కంటికి బాగుంది అని ఆ సినిమా నచ్చినవాళ్ళు చెప్పగలరు. కానీ లెజెండ్‌ సినిమాని హృదయంలో దాచుకునేవాళ్ళు ఎవరూ ఉండరు.

కానీ మనం సినిమాను మాత్రం అందరూ ఓన్ చేసుకుంటారు. ప్రేమిస్తారు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నాగ్ కౌంటర్ ఇచ్చాడు. ప్రేక్షకుల హృదయాలను గెల్చుకోవడానికి మించిన అవార్డ్ వేరే ఏం ఉంటుందన్న అర్థం కూడా ఈ లైన్‌లో ఉందన్న విషయం అర్థమవుతూనే ఉంది. గొడవలకు దూరంగా ఉండడం నాగార్జున నైజం…….ఇండస్ట్రీలో కూడా అందరి సినిమాలూ ఆడాలని కోరుకుంటాడు. అలాగే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితోనూ సరదాగా ఉంటాడు. కానీ ఇష్యూ వచ్చినప్పుడు సైలెంట్‌గా ఉన్నా టైం వచ్చినప్పుడు ఘాటు కౌంటర్ కూడా ఇవ్వగలనని ‘హలో’ ట్రైలర్‌తో నిరూపించాడు నాగ్. ఇక అప్పోనెంట్స్ నుంచి కౌంటర్ ఉండే అవకాశం ఉందా? రెస్పాండ్ అవ్వకపోతేనే వాళ్ళకు మంచిది. ఎందుకంటే మనం సినిమా కంటే లెజెండ్ గొప్పది అని సమర్థించుకునే కొద్దీ ఆ ఉన్న కాస్త పరువు కూడా గంగలో కలిసిపోతూ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఏమంటారు? మనం సినిమా గొప్పదా? లెజెండ్‌నా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -