Monday, April 29, 2024
- Advertisement -

బాబుబలి : చంద్రబాబు సాదించిన ఘనతలు..!

- Advertisement -
AP CM Chandrababu track records..!

రాష్ట్ర విభ‌జ‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌ను అనాధ‌లుగా మార్చింద‌న‌డంలో సందేహంలేదు. అభివృద్ది అంతా హైద‌రాబాద్‌కు ప‌రిమితం కావ‌డంతో క‌ట్టుబ‌ట్ట‌ల‌తో ఏపీ రాష్ట్రానికి వెల్లాల్సి వ‌చ్చింది.

విభ‌జ‌న జ‌రిగిపోయింది..ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్దే ముఖ్యం. అనాధ‌గా మారిని ఏపీని అభివృధ్ది ప‌థంలోకి తీసుకెల్లాలంటే రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత కావాలి. అందుకే 2104లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో సుదీర్ఘ‌రాజ‌కీయ అనుభ‌వం ఉన్న బాబుకు ప‌ట్టంక‌ట్టారు ప్ర‌జ‌లు.
ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌పంచ స్థాయి రాజ‌ధానిగా మారుస్తాన‌ని చెప్పిన బాబు మాత్రం అందుకు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.ప్ర‌జ‌లు పెట్టుకున్న,అభివృద్ధిని గాలికొదిలేసి …అయ‌న సాధించిన ఘ‌న‌విజ‌యాలు చూడండి…..

ఓటుకు నోటుకేసు
బాబు అధికారం చేప‌ట్టిన‌ప్ట‌టినుంచి త‌న స్వార్థం కోసం ప్ర‌జ‌ల ప్ర‌యేజ‌నాల‌ను ఫ‌నంగా పెట్టారు.వాటిలో ముఖ్య‌మైన‌ది ఓటుకు నోటుకేసు.ఈ కేసులో చంద్రబాబు చిక్కుకోవ‌డం రాజ‌కీయాల్లో క‌ల‌క‌లం సృష్టించింది.ఈకేసునుంచి త‌ప్పించుకోవ‌డంకోసం నాలుగు కోట్ల ప్ర‌జ‌లు ఆశ‌పెట్టుకున్న ప్ర‌త్యేక హోదాను కేంద్రం ద‌గ్గ‌ర తాక‌ట్టుపెట్టారు.
రాజ‌ధానిభూకుంభ‌కోనం
రాజ‌ధాని బూసేక‌ర‌న పేరుతో రైతుల‌నుంచి వేలాది ఎక‌రాలు లాక్కొని త‌న స్వ‌లాభం కోసం ప్ర‌యివేటు సంస్థ‌ల‌కు క‌ట్ట‌బెట్టర‌నేరి తెలిసిందే.ముందుగా త‌న అనుయాయుల‌కు రాజ‌ధాని ఎక్క‌డ‌నే విష‌యాన్ని లీక్ చేయ‌డంతో వంద‌ల ఎక‌రాల‌ను త‌క్కువ‌ధ‌ర‌కే కొని భూకుంభ‌కోనానికి పాల్ప‌డ్డార‌నే విమ‌ర్శ‌లు గుప్పుమ‌న్నాయి.
ఇసుఖ‌మాఫియా
రాష్ట్రంలో ఇసుక మాఫియాగురించి చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. మూడు పూవులు ..ఆరు కాయ‌లుగా ఇసుక‌మాఫియాను అధికార పార్టీ అండ‌తో న‌డిపిస్తున్నారు తెలుగు త‌మ్ముల్లు.ఇసుక అక్ర‌మ‌ర‌వాణాను అడ్డుకున్న ఎమ్మార్వో వ‌న‌జాక్షి విష‌యం అంద‌రికీ తెలిసిందే.ఇక చిత్తూరు జిల్లాలో .ఇసుక మాఫియాకు వ్య‌తిరేకంగా ధ‌ర్నా చేస్తున్న వారిపై జ‌రిగిన ఇసుక లారీ ప్ర‌మాదంలో చ‌నిపోయారు.ఇసుక‌మాఫియా వ‌ల్ల‌నే చ‌నిపోయార‌ని బంధువులు ఆరోపించారు.
ఎర్రచందనం మాఫియా
ఎర్ర‌చంద‌నం మాఫియా గురించి చెప్పాల్సిన అవ‌స‌రంలేదు.స్తానికంగా ఉన్న నాయకులతో స్మగ్లర్లు చేతులు కలిపి ఎర్రచందనం అక్రమ రవాణా సాగిస్తున్నారన్న విషయం అధికారులకు తెలిసినప్పటికీ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పవర్ ప్రాజెక్టుల లంచాలు
పవర్ ప్రాజెక్టులు ఇచ్చేటప్పుడు కోట్ల రూపాయల లంచాలు తీసుకున్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అసెంబ్లీలో ఆరోపించారు.దీనిపై అధికార పార్టీ స‌మాధానం చెప్ప‌లేక ఎదురుదాడికి చ‌ర్చ‌ను ప‌క్క‌దారిప‌ట్టించింది.

{loadmodule mod_custom,Side Ad 1}

కాల్ మని మాఫియా
రాష్ట్రంలో కాల్ మ‌నీ మాఫియా కేసు ఎంత సంచ‌ల‌నం సృస్టించిందో అంద‌రికీ తెలిసందే. కాల్‌మ‌నీ మాఫియాలో ఆరోప‌న‌లు ఎదుర్కొంటున్న బుద్దా వెంక‌న్న‌కు బాబు ఎమ్మెల్సీ ప‌ద‌విఇచ్చారు బాబుగారు.
లిక్కర్ మాఫియా
లిక్కర్ లాబీ తలుచుకుంటే ముఖ్యమంత్రి అయినా ఒత్తిడికి తలొగ్గాల్సిందే. అవును ఏపీలో అదే జరుగుతోంది. ఏపీలో ఎక్సైజ్ శాఖ అధ్వర్యంలో 13 జిల్లాల్లో నడుస్తున్న 427 మద్యం షాపులను ప్రైవేట్ పరం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
రాజధాని లో పంటలు తగలబెట్టడం
రాజధాని రైతుల నోట్లో మట్టికొడుతూ తాజాగా ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రతిపాదన పట్ల అన్నదాతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. … రైతుల పంటలు తగలబెట్టడం, అగ్రికల్చరల్ జోన్ లుగా ప్రకటిస్తే మీ పరిస్థితి ఏమిటంటూ రైతులను బెదిరించడం లాంటిసంఘ‌ట‌న‌లను చూశాం.
ప్రభుత్వ అధికారులమీద బౌతిక దాడులు
ప్ర‌భుత్వ అధికారుల‌పై దాడులు గురించి చెప్పుకుంటే త‌క్కువే.ఎమ్మార్వో వ‌ణ‌జాక్షిని ఎమ్మెల్యే చింత‌మ‌నేని ఎలా ప్ర‌వ‌ర్థించింది చూశాం.విజ‌య‌వాడ‌లో ర‌వాణా శాఖ అధికారి బాల‌సుబ్బ‌ర‌మ‌ణ్యంను ఎంపీ కేశినేని నాని,ఎమ్మెల్యే బోండా ఉమ ఆయ‌తో ఎలా ప్ర‌వ‌ర్తించారో చూశాం.
పుష్కర ప్రచార పిచ్చితో 30 మంది మరణాలు
గోదావ‌రి పుస్క‌రాల‌లో 30 మంది దాకా భ‌క్తులు చ‌నిపోయారు.ఇదంతా చంద్ర‌బాబు నిర్వాకం వ‌ల్లే జ‌రిగింద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి.బాబు పేరుకోసం ఇదంతా చేశార‌ని విప‌క్షాలు ఆరోపించాయి.
కాపుల తో రాజకీయ క్రీడ
ఎన్నిక‌ల స‌మ‌యంలో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తామ‌ని చెప్పిన బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మాట త‌ప్పారు.కులాల మ‌ధ్య చిచ్చుపెడుతూ రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకుంటున్నారు టీడీపీ నాయ‌కులు.
పట్టిసీమ లో పర్సంటేజ్ లు
విబ‌జ‌న త‌ర్వాత చంద్ర‌బాబు ప‌ట్టిసీమ ప్రాజెక్టును ఆగ‌మేగాల‌మీద నిర్మించి తాను ఎంత గొప్ప‌వాడినోని గొప్ప‌లు చెప్పుకున్నారు.పట్టిసీమ నుంచి ఇసుక మాఫియా దాకా సాక్షాత్తూ సీఎంకే పర్సంటేజ్ లు. మట్టి దగ్గర నుంచి బొగ్గు దాకా వాటాలేన‌ని తీవ్ర ఆరోప‌న‌లు వ‌చ్చాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

కనక దుర్గమ్మ భూముల కుంభకోణం
కనక దుర్గా ఆలయ భూములను సిద్దార్థ విద్యా సంస్థలకు లీజ్‌ ఇచ్చిన వ్యవహారంలో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ ఆరోపించింది. కనక దుర్గమ్మ ఆలయానికి సంబంధించిన 14 ఎకరాల భూములను ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం రూ.1.25 లక్షల లీజుకు ఇచ్చింది.సుమారు రూ.1000 కోట్ల విలువ చేసే భూములను సిద్ధార్థ విద్యాసంస్థలకు అప్పగించడం వెనక భారీ అవినీతి జ‌రిగింద‌ని ఆరోప‌న‌లు వెల్లువెత్తాయి.
సదావర్తి సత్రం భూముల స్కాం
చెన్నై సదావర్తి సత్రం భూముల్లో వేలకోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వైఎస్ఆర్ ఆరోపించింది.అమరలింగేశ్వరస్వామి భూముల కుంభకోణంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన కొడుకు లోకేష్‌కు సంబంధం ఉంద‌నే విమ‌ర్శ‌లు వెల్లు వెత్తాయి.

పార్టీ ఫిరాయింపులు
పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించ‌డంలో బాబును మించిన నాయ‌కుడు ఎవ‌రూ ఉండ‌ర‌నే చెప్పాలి.ఇత‌ర పార్టీల నాయ‌కుల‌ను వారి ప‌ద‌వుల‌కు రాజీనామ చేయ‌కుండా మంత్రి ప‌దువులు క‌ట్ట‌బెట్టిన ఘ‌నుడు చంద్ర‌బాబు.
లోకేష్ ని మంత్రిని చేసుకోవడం
ఏరాజ‌కీయ అనుభ‌వంలేని లోకేష్‌కు మంత్రిని చేయ‌డంకోసమే మంత్రి వ‌ర్గ‌పుర‌న్ వ్య‌వ‌స్తీక‌ర‌ణ చేప‌ట్టారు.అనుకున్న‌ట్లుగానే ఐటీ మంత్రిప‌ద‌విని కొడుక్కి క‌ట్ట‌బెట్టారు.జ‌యంతికి వ‌ర్థంతికి తేడా తెలియ‌ని లోకేషా మంత్రి అని ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారు.

ఇవండీ మ‌న చంద్ర‌బాబు చేసిన ఘ‌న‌కార్యాలు.వీటిమీద ఇప్ప‌టికే ప్ర‌జ‌లలో అసంతృప్తి అంత‌కంత‌కూ పెరిగిపోతోంది.వ‌చ్చె ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల చేతుల్లో బాబు బ‌లి అవ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

బాబుబలి-2

Also Read : బాబుబలి 2 : నేను, టెక్నాలజి ఇద్దరం దగ్గరి స్నేహితులం…!

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}O5u4UKDrt2U{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -