Wednesday, May 15, 2024
- Advertisement -

బాబుబలి 2 : నేను, టెక్నాలజి ఇద్దరం దగ్గరి స్నేహితులం…!

- Advertisement -
Babubali 2 : i and technology are close friends says chandrababu naidu

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుగురించి చెప్ప‌కుంటూ పోవాలంటే చాంన్‌తాడంత హిస్ట‌రీ ఉంది.విభ‌జ‌న స‌మ‌యంలో ఏపీకీ తీవ్ర అన్యాయం జ‌రిగింద‌ని న‌న్ను సీఎం ఎన్నుకుంటె ఏపీని అభివృద్ధిలో అగ్ర‌గామిగా తీర్చి దిద్దుతాన‌ని చెప్పి అధికారంలోకి వ‌చ్చారు.

ప్ర‌జ‌లు కూడా అనుభ‌వం ఉన్న ముఖ్య‌మంత్రి కావ‌డంతో బాబును ఎన్నుకున్నారు.అయితే చెప్పిన దానికి …చేసేదానికి న‌క్కతోక నాగ‌లోకినికున్నంత తేడా ఉంది.ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి ఏంచేశారో తెలియ‌దుగాని ..గ‌తంలో నేను సీఎం గా ఉన్న‌ప్పుడు ఈయ‌న చేసిన ఘ‌న‌త‌ల‌గురించి సందుదొరికిన‌ప్పుడ‌ల్లా మైకుల ముందు ఊర‌ద‌గొడుతుంటారు. ఆయ‌న చేసిన ఘ‌న‌కార్యాలేంటో ఇక్క‌డ చ‌ద‌వండి….

హైద్రాబాకు ప్ర‌పంచంలో గుర్తింపు తెచ్చిందినేనే అన‌డం

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న సమ‌యంలో హైద‌రాబాద్‌ను ఐటీ రంగంగా ఏనే గుర్తింపు తెచ్చాన‌ని ఎక్క‌డ ఏస‌మావేశాలు జ‌రిగినా ….ఆయ‌న నోటినుంచి వ‌చ్చేమాట ఇది.కొంత‌వ‌ర‌కు ఐటీ తీసుకు వ‌చ్చింది నిజ‌మే.కానీ అంతా నేనే చేశాన‌ని చెప్ప‌డం బాబుకు అల‌వాటుగా మారింది.ప్ర‌పంచ ప్ర‌పంచంలో హైద‌రాబాద్‌కు ఒక గుర్తింపు వ‌చ్చిందంటె అది నావ‌ల్ల‌నేని చెప్పుకోవ‌డం బాబుకు సిగ్గుచేటు.
అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని నేనే చెశానని చెప్పడం
ఎన్‌డీఏ హ‌యాంలో అబ్దుల్ క‌లాం రాష్ట్రప‌తిగా ప‌నిచేశారు.దేశానికి అయ‌న చేసిన సేవ‌ల‌కు గుర్తుగా అప్ప‌టి ప్ర‌ధాన మంత్రివాజ్‌పేయ్ హ‌యాంలో ఆయ‌న‌ను భార‌త రాష్ట్ర‌ప‌తిగా అత్య‌ధిక మెజారిటీతో ఎన్నుకున్నారు.వామ ప‌క్షాలు త‌ప్ప మిగితా పార్టీల‌న్నీ ఆయ‌న‌కే స‌పోర్ట్ చేశాయి.అప్ప‌ట్లో చంద్ర‌బాబుకు ఎన్‌డీఏ ప్ర‌భుత్వంలో మంచి ప్రాధాన్య‌త ఉండేది.క‌లాం గొప్ప‌తాన‌నికి రాష్ట్ర‌ప‌తిగా చేశారుగాని బాబు చెప్తే చేయ‌లేదు.కాని బాబు మాత్రం ఆయ‌న్ను రాష్ట్ర‌ప‌తిగా ఎన్న‌కోవ‌డంలో నేను కీల‌క పాత్ర పోషించాన‌ని సందుదొరిక న‌ప్పుడ‌ల్లా వాయించేస్తుంటారు.

{loadmodule mod_custom,Side Ad 1}

కేంద్రం చక్రం తిప్పానూ
నేను గ‌తంలో కేంద్రం లో చక్రం తిప్పాను …ప్రధానులను, రాష్ట్రపతులను నియమించాను అని బాబు చాల సార్లు చెప్పారు .కాని గతం లో అయన CM గా ఉన్న 9 సం లు కేంద్రం లో బాబు మీద ఆధారపడ్డ ప్రభుత్వాలే ఉన్నాయి కాని చక్రం తిప్పి రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క ప్రాజెక్ట్ తీసుకు రాలేద‌న్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.కాని YS చక్రం తిప్పక పోయినా కేంద్రాన్ని ఒప్పించి 6 వేల కోట్ల ప్రాజెక్ట్ చిత్తూర్ జిల్లలో ఏర్పాటు చేశాడు. బాబు చక్రం తిప్పి ఏమి సాధించాడంటె తన మనుషులకు కాంట్రాక్టు లు తనవారికి జడ్జి పదవులు ఇప్పించుకున్నాడు.
దేవేగౌడని నేనే ప్రధానిని చేశా
హెచ్.డి దేవేగౌడ భారత మాజీ ప్రధాని, సమకాలీన రాజకీయాల్లో ఈయన కూడా ఒక కురువ‌‌ృద్ధుడు. గతంలో దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి.అలాంటి వ్య‌క్తిని నేనే ప్ర‌ధానిగా చేశాన‌ని ఎప్పుడూ చెప్పుకోవ‌డం అయ‌న‌కు అల‌వాటుగామారింది.
మైక్రో సాఫ్ట్ C.E.O సత్య నాదెళ్ల కి నేనే స్ఫూర్తి అనడం
సత్య నాదేళ్ల ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మైక్రోసాఫ్ట్ సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నారు. ఆయ‌న ప్ర‌తిబ‌ను చూసి ఆప‌ద‌వి ఆయ‌న‌ను వ‌రించింది. దీన్ని కూడా బాబు త‌న ఖాతాలోకి వేసుకున్నారు.స‌త్య‌నాదెళ్ల‌కు నేనే స్పూర్తిని చెప్పుకోవ‌డం బాబు దివాలా కోరుత‌నానికి నిద‌ర్శ‌నం.
పి.వి సింధూ కి స్పూర్తిని నేనే ఇచ్చాననడం
బ్యాడ్మింట‌న్ క్రీడాకారిని పి.వి.సింధూ ఒలంపిక్స్‌లో ర‌జ‌త ప‌థ‌కం సాధించి ..ఈఘ‌న‌త పొందిన భార‌తీయ క్రీడాకారినిగా గుర్తింపు తెచ్చుకుంది.పుల్లెల గోపీచంద్ అకాడ‌మీలో శిక్ష‌ణ తీసుకుంది.ఈవిజ‌యాన్ని కూడా బాబు త‌న కాతాలో వేసుకున్నాడు.ప‌థ‌కం సాధించ‌డానికి నేనే స్పూర్తిని నేనే ఇచ్చాన‌ని తెలిపారు.
అంబేద్కర్ గారికి భారత రత్న నేనే ఇప్పించాననడం బాబు
భారత రాజ్యాంగ నిర్మాత, రాజకీయ నాయకుడు, స్వంతంత్ర భారత తొలి న్యాయ శాఖా మంత్రి, స్వాతంత్ర్యోద్యమ దళిత నాయకుడు. భార‌త ర‌త్న అవార్డుగ్ర‌హీత‌.ఈయ‌న‌కు కూడా నేను సిఫార్సు చేసింటే భార‌త‌ర‌త్న అవార్డు ఇచ్చార‌ని బాబు చెప్పుకోవ‌డం అంత దైర్భాగ్యం ఇంకొక‌టి లేదు. అయినా నిస్తిగ్గుగా స‌భ‌లు ,స‌మావేశాల‌లో చెప్పుకోవ‌డం ఆయ‌న అల‌వాటు.

{loadmodule mod_custom,Side Ad 1}

2018 లో అమరావతి లో ఒలంపిక్స్ తెస్తాననడం
ఒలంపిక్స్ క్రీడ‌లు నిర్వ‌హించ‌డ‌మంటె ఆషామాషికాదు.దానికి భారీ ఖ‌ర్చుతో కూడ‌కున్న‌ది.అలాంటి ఒలంపిక్స్ గేమ్స్‌ను ఏపీకి తెస్తాన‌ని బాబుగారు ప్ర‌క‌టించారు.నెల‌నెలా ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇవ్వ‌లేని పిరిస్థితుల్లో ఈ క్రీడ‌లు నిర్వ‌హ‌స్తా అన‌డం చెప్ప‌డం ఆయ‌న‌కు సిగ్గుచేటు.
ప్రపంచం లో మొట్టమొదట I.T ని నేనే ప్రమోట్ చేశాన‌న‌డం
బాబుకు హైటెఖ్ ముఖ్య‌మంత్రిని పేరుంది. ఉన్నంత మాత్రాన ఐటీని నేనే భార‌త‌దేశానికి తీసుకొచ్చాన‌ని చెప్పుకోవ‌డం బాబుకే చెల్లుతుంది.అంత సీను ఉన్న బాబు ఇప్పుడు ఏపీకి ఎంత‌మేర‌కు ఐటీ సంస్థ‌ల‌ను తీసుకొచ్చారో ఆయ‌న‌కే తెలియాలి.
రైతులకి 27 గంటలు కరెంటు ఇచ్చాననడం
చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న సంయంలో విద్యుత్‌కోసం ధ‌ర్నా చేస్తున్న‌రైతుల‌ప‌పై కాల్పులు జ‌రిపించిన ఘ‌న‌త‌ చంద్ర‌బాబుకుంది.ఇప్పుడేమో రైతుల పాలిట మొస‌లి క‌న్నీరు కారుస్తున్నారు.రోజు అంటె 24 గంట‌లు… అలాంటిది బాబుమాత్రం 27 గంట‌లు రైతుల‌కు విద్యుత్ ఇస్తున్నాని చెప్ప‌డం చూస్తె ఆయ‌న ఎతంమేధావో అర్థ‌మ‌వుతుంది.కేంద్ర‌ప్ర‌భుత్వం పుణ్య‌మాని రైతుల‌కు క‌రెంటు సాధ్య‌మ‌వుతోంది.దీన్ని కూడా త‌న కాతాలోకి వేసుకున్నారు బాబు.
సెల్ ఫొన్లు నేనే తెచ్చాననడం
అత్యాధనికి టెక్నాల‌జీ వ‌చ్చిన త‌ర్వాత స్మార్ట్ పోన్లు అందుబాటులోకి వ‌చ్చాయి.అతి త‌క్కువ ధ‌ర‌కే ఇప్పుడు సెల్‌ఫోన్‌లు అంద‌రికి అందుబాటులో ఉన్నాయి.వీటిని కూడా నేనె తెచ్చాన‌ని బాబుగారు త‌న‌కాతాలో వేసుకొని గొప్ప‌గా చెప్పుకుంటుంటారు.?

చూశారుగా మ‌న హైటెక్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుగారి బ‌డాయి .ప్ర‌పంచంలో ఎక్క‌డికి ఎల్లినా త‌న సొంత డ‌బ్బా కొట్టుకోవ‌డంలో ఆయ‌న‌కు సాటి మ‌రెవ్వ‌రు రార‌న‌డంలో సందేహంలేదు.

Babubali 3 The Conclusion

{loadmodule mod_sp_social,Follow Us}

Video Link

Also Read : బాబుబలి : చంద్రబాబు సాదించిన ఘనతలు..!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -