Tuesday, May 14, 2024
- Advertisement -

బాబుబలి 3 : చంద్రబాబు ఫెయిల్యూర్స్…

- Advertisement -
Babubali 3 The Conclusion : Failures of AP CM Chandrababu Naidu

2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి రావ‌డానికి చంద్ర‌బాబు అముల‌కు నోచుకోని దాదాపు 700 హామీలు ఇచ్చారు. దీంతో ప్ర‌జ‌లు ఎన్నో ఆశ‌ల‌తో ఆయ‌న‌కే ప‌ట్టం క‌ట్టారు. కాని అధికార పీఠంమీద కూర్చొగానే వాట‌న్నింటిని గాలికొదిలేశారు.

ఇచ్చిన హామీల‌కు …చేస్తున్న ప‌నుల‌కు పొంత‌న లేకుండా పోతోంది. అధికారం చేప‌ట్టి మూడు సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్నాహామీల‌ను అమ‌లు చేయ‌డంలో బాబు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. దీంతో ప్ర‌జ‌ల‌ల్లో ఆయ‌న‌మీద అసంతృప్తి తారాస్థాయికి చేరింది. ఆయ‌న ఇచ్చిన హామీల‌ను ఎంత‌వ‌ర‌కు అమ‌లు చేశారో కింద చ‌ద‌వండి..
ప్రత్యేక హోదా తీసుకుని రావడం లో ఫెయిల్
విభ‌జ‌న స‌మ‌యంలో రాజ్య‌స‌భ‌లో ఏపీకి ప్రత్యేక‌హోదా ప‌ది సంవ‌త్స‌రాలు కావాల‌ని భాజాపా సీనియ‌ర్‌నేత డిమాండ్ చేశారు. అనుకున్న‌ట్లుగానే ఎన్‌డీఏ కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చిది. గ‌తంలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని భాజాపా,టీడీపీ ఇద్ద‌రూ ప్ర‌క‌టించారు. అనుకున్న‌ట్లుగానే ఏపీలో టీడీపీ….కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వ‌చ్చిది. ప్ర‌త్యేక హోదాను ప‌క్క‌న పెట్టేశారు. ప్ర‌ధాన కార‌నం ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబు ప్ర‌ధాన ముద్దాయిగా ఉండ‌టంతో దీన‌నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి ప్ర‌త్యేక హోదాను మోది ద‌గ్గ‌ర తాక‌ట్టు పెట్టార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం.
సంపూర్ణ రుణమాఫి చేయడం లో ఫెయిల్
అన్నదాతను ఆదుకుంటాం.. రైతే రాజు, రైతు రుణమాఫీకి కట్టుబడి ఉన్నామన్న.. టీడీపీ ప్రభుత్వం తీరు.. ఏరు దాటాక తెప్పతగలేసినట్లుంది. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ అంటూ ఎన్నికల ముందు డంకా బజాయించిన టీడీపీ నేతలు.. అధికారం లోకి వచ్చాక మాట మార్చుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా.. ఇంకా రుణమాఫీ చేయలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. చంద్రబాబు హామీలు ఏమయ్యాయని పలువురు ప్రశ్నిస్తున్నారు. తర్వాత విడతల్లో లక్షా 50 వేల రూపాయలు పైబడిన రైతులకు రుణమాఫీ అమలును మాత్రం అటకెక్కించారు.

{loadmodule mod_custom,Side Ad 1}

డ్వాక్రా రుణమాఫి చేయడం లో ఫెయిల్
ఇక డ్వాక్రా రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాల మాఫీ విషయంలో ఇదే పరిస్థితి నెలకొంది. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా.. ఇప్పటివరకు ఆ రుణాలపై క్లారిటీ ఇవ్వలేకపోయింది ప్రభుత్వం. రైతుల అప్పులతో పాటు సంఖ్యను కుదించి పొంతనలేని కారణాలతో ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. డ్వాక్రారుణాల‌పై క్లారిటీ రాక‌పోవ‌డంతో ఇప్పుడు వారి పరిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది.
బెల్టుషాపుల రద్దు చేయడం లో ఫెయిల్
తాజాగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు బెల్టు షాపుల రద్దు ఫైలుపై సంతకం చేసి వాటిని పెట్టింది మేమే… రద్దు చేసేదీ మేమే అని చెప్పకనే చెప్పారు. ప్రజలను మోసం చేయడం కోసం బెల్టు దుకాణాల రద్దు ఫైలు పై సంతకం చేసి, ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. అసలు రాష్ట్రంలో బెల్టు షాపులు లేవని ఎక్సయిజ్ అధికారులు రికార్డుల్లో చూపుతున్నారు.
ఆంధ్రా కి ఆయువు అయిన పోలవరం నిర్మాణం లో ఫెయిల్
పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, తామే పూర్తిచేస్తామని విభజన సమయంలో కేంద్రం ప్రకటించిది, కానీ చంద్ర‌బాబు మాత్రం నిధులు ఇవ్వండి మేమే ప్రాజెక్టును పూర్తిచేస్తామ‌ని చెప్ప‌డంతో అది రాష్ట్రానికి అప్ప‌గించింది. విభజన చట్టం ప్రకారం పూర్తి నిధులతో కేంద్రమే నిర్మించి ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్టును కమీషన్ల కోసం కక్కుర్తి పడి రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని విమర్శలువస్తునాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2014 తర్వాత పెరిగిన అంచనాల వ్యయం అదనపు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్ర జల వనరుల శాఖ ప్ర‌క‌టించ‌డ‌తో బాబు ఖంగుతిన్నారు. నిధులు తీసుకు రావ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఇంటికో ఉద్యోగం ఇవ్వటం లో ఫెయిల్
జాబు రావాలంటే బాబు రావాలి.. ఇంటికో ఉద్యోగం చంద్రబాబుతోనే సాధ్యం.. ఇలా సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగు తమ్ముళ్లు ఉపన్యాసాలు, గోడ రాతలతో ఊదరగొట్టారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే సీన్ రివర్స్ అవుతోంది. వివిధ శాఖల్లో తాత్కాలిక, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపే పనిలో పడ్డారు. వివిధ శాఖ‌ల‌లో ఉన్న ఉద్యోగుల‌ను తొల‌గించ‌డం మొద‌లు పెట్టారు.
నెలకు 2000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామన‌డంలోఫెయిల్
ఎన్నిక‌ల స‌మ‌యంలో నిరుద్యోగుల‌ను అకట్టు కొనేందుకు ఉద్యో్గం వ‌చ్చే వ‌ర‌కు నెల‌కు రూ2000 నిరుద్యోగ భృతిని ఇస్తామ‌ని బాబు ప్ర‌క‌టించారు. ఇంటికో ఉద్యోగమిస్తామని, నెలనెలా రూ. 2వేల చొప్పున నిరుద్యోగ భృతి కల్పిస్తామని వాగ్దానం చేసిన చంద్రబాబు నేటికీ వాటిని నెరవేర్చలేదని. చంద్రబాబు నిరుద్యోగులకు రూ. 1.22 లక్షల కోట్లు బకాయి ఉన్నారు.
పెట్టుబడులు తీసుకుని రావటం లో ఫెయిల్
కొత్త రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకురావ‌డంలో బాబు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. పెట్టుబ‌డుల‌కోసం విదేశీ ప‌ర్య‌ట‌న‌లు త‌ప్ప పెట్టుబ‌డులు వ‌చ్చింది శూన్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు మూడేళ్లుగా చేసిన విదేశీ పర్యటనల వల్ల కనీసం ఆయన దారి ఖర్చుల మేరకు పెట్టుబడులు రాని దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రం ఉంద‌న‌డంలో సందేహంలేదు. కంపెనీల‌తో ఎమ్ఓయులు త‌ప్ప పెట్టుబ‌డులు శూన్యం.
రాజధాని నిర్మాణం లో ఫెయిల్
రాజ‌ధాని నిర్మానంలో బాబు పూర్తిగా విఫ‌ల‌మ‌య్యారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల‌నుంచి వేల ఎక‌రాలు సేక‌రించి..వాట‌ని ప్రైవేటు వ్య‌క్తుల‌కు క‌ట్ట‌బెట్టేందుకు బాబు సిద్ద‌మ‌య్యార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. తాత్కాలికంగా స‌చివాల‌యాం, అసెంబ్లీలు త‌ప్ప ఇప్ప‌టి వ‌ర‌కు ఏఒక్క నిర్మానం జ‌ర‌గ‌లేదు. అంత అవినీతి మ‌యంతో కూడుకున్న‌ద‌ని జ‌పాన్ చెందిన ఆర్కిటెక్చ‌ర్ బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. కేంద్రం నుంచి నిధులు రాబ‌ట్ట‌డంలో కూడా బాబు విఫ‌ల‌మ‌య్యారు.

{loadmodule mod_custom,Side Ad 1}

పేదలకు 1 లక్ష 50 వేలతో ఇల్లు ఇవ్వటం లో ఫెయిల్
పేద‌లంద‌రికి 1ల‌క్షా 50 వేల రూపాయ‌ల‌తో గృహ‌నిర్మానం కింద ఇల్లు నిర్మిస్తాన‌ని చెప్పిన బాబు అ విష‌యాన్ని అట‌కెక్కించారు. గృహ‌నిర్మానంలో అవ‌వ‌త‌వ‌క‌లు జ‌రిగాయంటూ ఉన్నగృహాల‌ను తొల‌గించారు. 2022 నాటికి దేశంలో పేద‌లంద‌రికి గృహాలు నిర్మించాల‌న్న కేంద్ర నిర్ణ‌యాన్ని బాబు అమ‌లు చేయ‌డంలేదు.
ఎన్.టి.ఆర్ హెల్త్ కార్డ్ తో ఆరొగ్య శ్రీ కన్న మెరుగైన సేవలు అందించ‌డంలో ఫెయిల్‌
ఎన్.టి.ఆర్ హెల్త్ కార్డ్ తో ప్ర‌తి ఒక్క‌రికి మెరుగైన సేవ‌లు అందిస్తామ‌ని ఆర్భాటంగా ప్ర‌క‌టించారు చంద్ర‌బాబు. ఆరోగ్య‌శ్రీ కంటె మెరుగైన సేవ‌లు అందిస్తామ‌న్న బాబు అ ప‌థ‌కం ఇప్పుడు ఎక్క‌డ ఉందో అర్థం కాని ప‌రిస్తిలు.
ఎన్.టి.ఆర్ క్యాంటిన్ ఫెయిల్
పేద‌లందికి ఆహారం అందాల‌న్న ఉద్యేశ్యంతో ఎన్.టి.ఆర్ క్యాంటిన్ సేవ‌లును ప్రారంభిస్తామ‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి ప‌ర్య‌టాల సునీత ఆర్భాటంగా ప్ర‌క‌టించారు. త‌మిళ నాడుత‌ర‌హాలో అమ్మ‌క్యాంటీన్‌లాగా ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించి దాని ఊసెలేద‌రు.
ఎన్.టి.ఆర్ సుజల స్రవంతి పథకం తో 2 రూ 20 లీటర్ల మినరల్ వాటర్ అందించటం లో ఫెయిల్
ప్ర‌తీ ఒక్క‌రికి మంచినీటిని అందిచాల‌నే ఉద్యేశ్యంతో ఎన్.టి.ఆర్ సుజల స్రవంతి పథకం తో 2 రూ 20 లీటర్ల మినరల్ వాటర్‌ను అందిస్తామ‌ని ఘ‌నంగా ప్ర‌క‌టించారు. కాని దాన్ని అమ‌లు చేయ‌డంలో చేతులెత్తేశారు.
కాపులకి ఇచ్చిన హామీ ని నెరవేర్చటం లో ఫెయిల్
ఎన్నిక‌ల మేనిఫెస్టోలో ప్ర‌ధానంగా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్‌లు అములు చేస్తామ‌ని ప్ర‌క‌టించడం కూడా అధికారంలోకి రావ‌డానికి దోహాద ప‌డింది. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దాన్ని ప‌క్క‌పెట్టి కుల రాజ‌కీయాల‌కు తెర‌లేపారు. ఇప్ప‌టికే కాపు సామాజిక నాయ‌కుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం బాబుకు వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు.

ఏడాది కాలంలో చంద్రబాబు 681 హామీలు ఇచ్చినట్లు లెక్క తేలింది. పనులు చేసి అమలు చేసినవి 112 గా లెక్క తేల్చారు. వాస్తవానికి ఈ 112 పనులు కూడా అర కొర పనుల బాగోతమే అని ప్రజలు అనుకొంటున్నారు. అయినప్పటికీ ఆ పనులు పూర్తయ్యాయి అనుకొన్నప్పటికీ 16.45 శాతం మాత్రమే హామీలు అమలు అయినట్లు. మిగిలిన 83శాతం హామీలు నీటి మూటలే అని తేలింది. ఇదీ చంద్రబాబు పాలనని జ‌నాలు న‌వ్వుకుంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -