Tuesday, May 14, 2024
- Advertisement -

రోడ్డుకు ఈడ్చిన రైతులే ఎక్కువయ్యరా ?

- Advertisement -

చిత్రంగా అనిపించచ్చు గాక! అడగగానే భూములు ఇచ్చినవారి కన్నా కూడా గొడవ చేసి, రచ్చ కీడ్చి జాతీయవ్యాప్తంగా మీడియా దృష్టి పడేలా చేసి, పవన్ కళ్యాణ్ లాంటి వారిని పిలిపించుకుని సునిశితమైన వార్నింగ్ కూడా ప్రభుత్వానికి ఇప్పించిన రైతులకి చంద్రబాబు సర్కారు గొప్ప సన్మానం చెయ్యబోతోంది. అయ్యో ఇదేమీ వెటకారం చెయ్యడం కాదు.

నిజంగానే బాబు సర్కారు ముందుగా ల్యాండ్ ఇచ్చిన రైతుల కంటే కూడా వీరి మీద కొత్తగా ప్రేమ చూపించబోతోంది. రెండవ సారి, ఆఖరి సారి బలవంతంగా గొడవ చేసి భూములు ఇచ్చిన కాటగిరీ లో ఉన్న రైతులు అందరికీ బహుమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వబోతున్నారు. 

వారికంటే ముందుగా అంటే అమరావతి ప్రకటించి, ల్యాండ్ పూలింగ్ ఇంకా రాక ముందే బాబు సర్కారు మాటలు నమ్మి, వారి మీద నమ్మకంతో, ప్రభుత్వానికి పూర్తి సహకారం అందించాలి అనే ఉద్దేశ్యంతో భూములు ఇచ్చిన వారు ఇప్పుడు ఎంతో కొంత నష్టపోవడం గ్యారంటీ అన్నమాట. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇవ్వడం మేము చేసిన తప్పా? వారికంటే మమ్మల్ని తక్కువగా చూస్తారా అంటూ తూల్లూరు లో కొందరు రైతులు చాలా సీరియస్ గా ఉంటున్నారు ఈ మధ్య. 

ఇన్నాళ్ళూ సర్కారు వారి పరువుని రోడ్డున పడేసి కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించిన వారికేమో సూపర్ ప్యాకేజీలు ఇస్తూ తమని అధోగతి పాలు చెయ్యడం ఏంటి అని వారు వాదిస్తున్నారు. నిజమే ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అనడం ఆలస్యం భూములు ఇచ్చేసిన రైతులు చాలామంది ఉన్నారు, తిరిగి తమ భూములు తమకి దక్కుతాయి అన్న మినిమం గ్యారంటీ కూడా దక్కని రోజుల్లోనే వారు ఇదంతా చేసారు ఈ రైతులకి తక్కువ న్యాయం చేసి, తక్కువ ప్యాకేజీ ఇచ్చి.. తరవాత ప్రభుత్వం పరువు తీసిన వారికి ఎక్కువ ప్యాకేజీ ఇస్తే ముందు ఇచ్చిన రైతులు తాము వంచనకు గురి కాలేదనే ఆత్మసంతృప్తి చెందుతారు. అలా వారు కాకూడదు అనిపిస్తే ఎలాంటి న్యాయం చెయ్యాలి అనేది సర్కారు ఆలోచించుకోవాల్సిన విషయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -