ఆ పత్రిక, టీవీ ఛానల్ లక్ష్యం జగన్‌పై విషం కక్కడమే. మనిషి అవతరించిన తర్వాత నుంచీ ఉన్న చెడ్డ మనుషులందరికంటే జగనే చెడ్డవాడు అని చెప్పడం అసలు లక్ష్యం. ఇక ఉత్తమోత్తముడు చంద్రబాబు అని జనాలను నమ్మించడం కూడా ఇంకో టార్గెట్. జగన్‌కి తండ్రి కాబట్టి వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా చెడ్డవాడు. ఇక జగన్ చుట్టూ ఉన్నవాళ్ళు, జగన్ మద్ధతుదారులందరూ కూడా చెడ్డవారు. చంద్రబాబుకు పరోక్షంగానే, ప్రత్యక్షంగానో సపోర్ట్ చేస్తున్న ఒక సినీ నటుడు కమ్ పొలిటీషియన్‌తో సహా చంద్రబాబుకు మద్ధతుగా ఉన్న పన్ను ఎగవేతదారులు, బ్యాంక్ లోన్‌లు ఎగ్గొట్టినవాళ్ళు, అమ్మాయిల హెరాస్‌మెంట్ కేసులో ఇరుక్కున్నవాళ్ళు, ఓటుకు నోటు కేసుల్లో ససాక్ష్యంగా దొరికిన వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు. విజయవాడలో అప్పు తీర్చలేదని చెప్పి అప్పు తీసుకున్న ఇంటి మహిళలను తమ వద్దకు పంపించమని అడిగిన దగుల్బాజీలు కూడా మంచివాళ్ళే. అలాంటి వాళ్ళ గురించి కూడా ఎక్కడా చెడుగా రాయరు. కానీ జగన్‌కి మద్ధతు తెలిపితే మాత్రం అయిపోయారే. మానసికంగా, సామాజికంగా వాళ్ళను వేధించడమే పనిగా పెట్టుకుని వార్తలు వండేస్తారు. జగన్‌కి వ్యతిరేకంగా ఎలా రాయాలో జర్నలిస్ట్‌లకు ట్రైనింగ్ ఇస్తూ తానూ కూడా ప్రతివారం ఏదో ఒక కామెంట్ రాస్తూ ఉంటాడు. ఈ అనంత విశ్వంలో ఉన్న ఏ విషయం గురించి రాసుకొచ్చినా చివరికి జగన్‌ని తిట్టడమే లక్ష్యంగా ఆ కామెంట్ ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. దేవుడి గురించి, ట్రంప్ తప్పుల గురించి, ఖగోళ శాస్త్తం గురించి రాసేటప్పుడు కూడా జగన్‌ని కించపరుస్తూ ఎలా రాయాలి? ఏం రాయాలి? అని ప్లాన్ చేయడం ఆ కామెంట్ శైలి.
మిగతా విషయాలు అన్నీ పక్కన పెడితే ఇప్పుడు మాత్రం మరీ దిగజారిపోయింది ఆ మీడియా యాజమాన్యం. సంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ పంటచేను దగ్గర ఉన్న బోరు నీళ్ళు తాగుతూ ఉన్న ఫొటో ఒకటి వైఎస్ భారతీరెడ్డి పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎవరో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలో ఉన్న బోరు నుంచి నీళ్ళు పుష్కళంగా వస్తూ ఉండడం, వరిపైరు కూడా ఏపుగా పెరిగి ఉండడంతో వెంటనే ఆ మీడియా అధినేతకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చేసింది. ‘చూశారా…….మా నారా చంద్రబాబునాయుడి పాలనలో రాయలసీమ బోర్లలో నీళ్ళు ఏ స్థాయిలో వస్తున్నాయో? పంట ఏ రేంజ్‌లో పండిందో’ అని భజన చేస్తూ ఒక ఆర్టికల్ రాసిపడేశారు. అఫ్కోర్స్…..తన జర్నలిజం తెలివితేటలు ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో అనుకుంటున్నారు అని కూడా భలే కవర్ చేశాడు.
కట్ చేస్తే అసలు ఆ ఫొటో వైఎస్ జగన్‌దే కాదని ఆలస్యంగా వాళ్ళకు అర్థమైంది. ఎవరిదో ఫొటోని జగన్ ఫొటో అని భ్రమపడ్డారు. ఆ వెంటనే తప్పును వైఎస్ భారతిపైకి నెట్టేస్తూ ……‘చూశారా…..తన భర్త వైఎస్ జగన్‌ని కూడా భారతి గుర్తుపట్టలేకపోయింది’ అని నిస్సిగ్గుగా, నిర్లజ్జగా విలువలకు పాతర వేస్తూ రాసేశారు. ఆ వార్త చదివిన ఆలోచనాపరులు ఎవ్వరికైనా ఆ మీడియా సంస్థపైనే అసహ్యం పుట్టేలా ఆ వార్త రాశారు.
కట్ చేస్తే వైఎస్ భారతి స్వయంగా ఒక విషయం చెప్పారు. ‘నాకు అసలు సోషల్ మీడియాలో అకౌంట్సే లేవు….ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో నా పేరుతో ఉన్న అకౌంట్స్ అన్నీ ఫేక్ అకౌంట్సే’ అని చెప్పారు. ఆ దెబ్బకు ఆ మీడియా అధినేతకు దిమ్మతిరిగింది అని వేరే చెప్పాలా? ఇక కనీస సంస్కారాన్ని కూడా వదిలేసి మొత్తంగా తాను చేసిన తప్పులన్నీ ఒప్పుకుని లెంపలేసే సంస్కారం ఉన్నవాళ్ళు అయితే ఇంతలా దిగజారరు. మరీ ముఖ్యంగా జగన్ భార్య కూడా జగన్‌ని గుర్తుపట్టలేదు అని రాసినవాడు అయితే మనిషేనా అన్న అనుమానం వస్తుంది.
ఈ బాపతు జర్నలిస్టులు, మీడియా అధినేతలే సమాజానికి నీతులు బోధిస్తూ, జర్నలిజం విలువల గురించి చెప్తూ ఉంటే మాత్రం జర్నలిస్ట్‌గా ఉన్నందుకు సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ రాసేవాళ్ళు ఎలాగూ సిగ్గుపడరుకదా?
