Tuesday, May 14, 2024
- Advertisement -

ఫేస్ బుక్ లో ఫోన్ నెంబ‌ర్ ఎందుకు పెట్టకూడ‌దంటే….

- Advertisement -

ఫేస్ బుక్ లో మ‌న‌ ఫోన్ నెంబర్ ను ఫీడ్ చేస్తున్నాం. అందుల్లో మ‌నం మ‌గాళ్లం క‌దా వ‌ద్దన్నా ఫీడ్ చేస్తాం. ఏమో ఎప్పుడు ఏ చిన్నది మ‌న ప్రొఫెల్ చూసి కాల్ చేస్తుందో తెలియ‌దు క‌దా.

అఫ్ కోర్ప్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ అవుతార‌ని కూడా నెంబ‌ర్ పెడ‌తాం కాద‌న‌లేం. ఇక‌నుంచి మ‌నం మ‌న జాగ్రత్తలో ఉండ‌డం బెట‌ర్ . ఫేస్ బుక్ లో మనమిచ్చే ఫోన్ నెంబర్ ద్వారా …..ఆ యూజర్ పేరును, మ‌న పిక్చర్స్, లొకేషన్ , ఇతరత్రా సమాచారాన్ని ఇట్టే దొంగలించవచ్చని, మ‌న  ఫేస్ బుక్ ఖాతాలోకి వెళ్లి కామెంట్స్ కూడా చేయవచ్చని…ఇటీవ‌లే  బ్రిటన్కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిరూపించారు.

ఫేస్ బుక్ ఓపెనింగ్ టైపింగ్ బార్ పై మన ఫోన్ నెంబర్ టైప్ చేస్తే ఎఫ్బీలోని మనకు సంభంధించిన అన్ని వివరాల్ని తెలుసుకోవచ్చని సాల్ట్ డాట్ ఏజెన్సీ టెక్నికల్ డెరైక్టర్ రెజా మొయావుద్దీన్ తెలిపారు. అత‌ను కొన్ని లక్షల మంది  ఫోన్ నెంబర్లను ఫేస్ బుక్ యాప్ బిల్డింగ్ ప్రోగ్రామ్ (ఏపీఐ)కు పంపించానని, ఆ ఫోన్ నెంబర్లు ట్యాలీ అయిన ప్రతి యూజర్ ప్రొఫైల్, ఇతరత్రా వివరాలు తనకు అందాయని అత‌నే స్వయంగా  తెలిపాడు.

ఇదే విష‌యాన్ని తాను  ఫేస్ బుక్ యాజమాన్యం దృష్టికి తీసుకెల్లానని కాని వారినుండి సంతృప్తికరమైన సమాధానం లభించలేదని మొయావుద్దీన్ వెల్లడించాడు.ఒక వేళ‌ ప్రొఫైల్స్ వెల్లడైనా, వారి పర్సనల్ సెట్టింగ్స్ లోకి అంత సులభంగా వెళ్లలేమని ఫేస్ బుక్ అధికార ప్రతినిధి అత‌నితో తెలిపారట. దాంతో పాటు ఎవరి పట్ల అసభ్యకరంగా వ్యాఖ్యలు చేయకుండా, యూజర్ ఖాతాను దుర్వినియోగం చేయకుండా తమ ఏపీఐ టీమ్ ఎల్లప్పుడూ ఓ కంట నిఘా వేసి ఉంటుందని మొయా వుద్దీన్ కు చెప్పారట. పూర్తి వ్యక్తిగత వ్యాఖ్యలు షేర్ చేసుకోవాలనుకునే వారు ఫోన్ నెంబర్ ఇవ్వక పోవడమే మంచిదని కూడా ఆయన గారు సలహా ఇచ్చారట. కాబట్టి ఫేస్ బుక్ యూజర్లు తమఫోన్ నెంబర్లు ఇవ్వకపోవడమే మంచిదని, లేదంటే సైబర్ నేరస్తులు ఉపయోగించుకునే అవకాశం ఉందని ఆ ఇంజనీర్ గారు మ‌న‌కు చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -