Sunday, May 5, 2024
- Advertisement -

నమ్మి గెలిపించినందుకు తగిన శాస్తే చేశారు బాబయ్యా……. నంద్యాల ప్రజల ఆవేదన

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను నిర్ణయాత్మక మలుపు తిప్పే స్థాయి ఎన్నికలన్న ప్రచారం జరిగింది. టిడిపి, వైకాపాల భవిష్యత్తును తేల్చే ఎన్నికలన్నస్థాయిలో పోటీ పడ్డారు. కానీ చంద్రబాబు మాత్రం చాలా తెలివిగా టిడిపిని గెలిపిస్తే నంద్యాల రూపురేఖలు మార్చేస్తా……అధికారంలో ఉన్న పార్టీని గెలిపిస్తేనే అభివృద్ధి…..లేకపోతే రోడ్లు, పెన్షన్లు అన్నీ ఆపేస్తా అన్న స్థాయికి దిగజారి మరీ ప్రచారం చేశాడు. బాబు పెట్టిన భయం అయితేనేమి, కేబినెట్ మొత్తం ప్రచారం చేయడం అయితేనేమి, డబ్బులను మంచినీళ్ళలా ఖర్చుపెట్టిన ప్రభావం అయితేనేమి, భూమా కుటుంబం మొత్తం సెంటిమెంట్‌ సినిమా చూపించిన ఎఫెక్ట్ అయితేనేమి…….మొత్తానికి టిడిపి గెలిచింది. నంద్యాలను ప్రపంచ పటంలో నిలిపే స్థాయిలో అభివృద్ధి చేస్తానని చంద్రబాబు డంబాలు పలికాడు. ఇక భూమా ఫ్యామిలీతో సహా టిడిపి నాయకులు, మంత్రులు అభివృద్ధి గురించి ఓ స్థాయిలో మాట్లాడారు.

కట్ చేస్తే ఎన్నికల్లో గెలిచిన నెల రోజుల తర్వాత నుంచే నంద్యాల ప్రజలకు అసలైన సినిమా చూపించడం మొదలెట్టారు టిడిపి జనాలు. అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులకు అతీ గతీ లేదు. ఇక ఇప్పుడు ఎండల పుణ్యమాని మొత్తం నంద్యాల ప్రజలు అల్లాడిపోతున్నారు. నంద్యాల మునిసిపాలిటీ పరిధిలో సరైన నీటి సదుపాయం కల్పించడంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయింది. రైతుల నుంచీ అన్ని వర్గాల ప్రజలూ నానా కష్టాలూ పడుతున్నారు. కుటుంబాలకు కుటుంబాలు వలస వెళ్ళిపోతున్న చిత్రాలు టిడిపి మీడియాలోనే కనిపిస్తున్నాయి. నంద్యాల పట్టణంలో కూడా టిడిపి నేతల దందాలు, వసూళ్ళ దెబ్బకు వ్యాపారస్తులు బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఈ పంపకాలు, కాంట్రాక్టుల విషయంలోనే టిడిపి నేతల మధ్య గొడవలు పెరుగుతున్నాయని తెలుస్తోంది. గెలిపించిన ప్రజలందరూ అష్టకష్టాలూ పడుతుంటే అఖిల ప్రియతో సహా భూమా కుటుంబ సభ్యులందరూ రాజకీయాలు చేస్తూ……రాజకీయ గొడవల్లో తలమునకలై ఉన్నారు. ఇక చంద్రబాబు మాత్రం నంద్యాల అభివృద్ధి మాట మరిచిపోయి టిడిపిలో అసమ్మతి నాయకులను ఎగదోయడం…ఆ రత్వాత పంచాయితీలు చేయడం చేేేేస్తున్నాడు. టిడిపి జనాలు, రాజకీయాలపై ఆసక్తి ఉన్న జనాలకు ఈ పరిణామాలు రచ్చబండ దగ్గర మాట్లాడుకోవడానికి ఆసక్తికరంగానే ఉన్నాయోమో గానీ ఈ మొత్తం రాజకీయ వ్యవహారాలను పరిశీలిస్తున్న ప్రజలు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకేనా టిడిపిని గెలిపించింది అని నంద్యాల ప్రజలు ఆవేదనగా అడుగుతున్న పరిస్థితి. ఎన్నికల సమయంలో వరాల వర్షం కురిపిస్తూ తియ్యగా మాట్లాడిన చంద్రబాబు, భూమా కుటుంబ నాయకులు ఇప్పుడు ప్రజలు అష్టకష్టాల్లో ఉంటే రాజకీయ పంచాయితీలు చేసుకుంటూ కాలం గడిపేస్తుండడంపై నంద్యాల ప్రజలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయినా రాజకీయాల్లో తలమునకలై ఉన్న బాబు, భూమా కుటుంబాలకు ప్రజల గోడు వినే తీరిక ఎక్కడిది? ఎన్నికల సమయంలో చంద్రబాబుతో సహా రాష్ట్ర కేబినెట్ మొత్తం నంద్యాలలోనే తిష్టవేసింది. భూమా కుటుంబ సభ్యులందరూ కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఇప్పుడు మాత్రం కనీసం ఆ ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించే దిక్కు కూడాలేదు. నంద్యాల ప్రజల సమస్యలు వినే నాథుడు కూడా లేడు. ఇది ప్రజల విషయంలో చంద్రబాబు మార్క్ పొలిటికల్ డ్రామా అనుకోవాలేమో మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -