Tuesday, May 14, 2024
- Advertisement -

రైతుల‌కు డ్రోన్లు, రేయిన్ గ‌న్‌లు కాదు… పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించండి… ప్ర‌జ‌లు

- Advertisement -

దేశంలో కెల్లా అత్యంత సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడు….న‌ల‌భ‌యేళ్ల రాజ‌కీయ అనుభ‌వం అని సొంత డ‌బ్బా కొట్టుకుంటారు. కేంద్రంలోనూ చ‌క్రం తిప్పిన నాయ‌కుడు. రాష్ట్ర‌ప‌తుల‌ను నియ‌మించ‌డంలో కూడా త‌న పాత్ర ఉంద‌ని చెప్ప‌డం చూశాం. అయ‌న ఎవ‌రో కాదు గ్రేట్ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అంత రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత వెనుకా ముందు ఆలోచించ‌కుండా హామీలు ఇస్తుంటారు . అది విజ‌య‌వంతం అవుతుందా అనేది ఆలోచించ‌రు. దాంతో ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నా… మాకేం అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. ప‌చ్చ ప‌త్రిక‌లు మాత్రం పెద్ద పెద్ద హెడ్‌లైన్స్‌లు పెట్టి ప్ర‌చురిస్తుంటాయి.

ప్రతిపక్షంలేని అసెంబ్లీలో పాలకపక్షం ఎడాపెడా చెలరేగిపోతూ.. తమను తాము కీర్తించుకుంటూ… సాగుతున్న సంగతి అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈనేపథ్యంలో మంగళవారం నాడు వ్యవసాయ రంగం గురించి చంద్రబాబునాయుడు సుదీర్ఘంగా ఉపన్యసించారు. ఇందులో భాగంగానే.. పంటపొలాల్లో డ్రోన్ల ద్వారా పురుగుమందుల పిచికారీ చేయించే ప్రయోగం చేపట్టనున్నట్లు చంద్రబాబునాయుడు చెప్పారు. ఇది సక్సెస్ ఫుల్ గా జరిగితే గనుక.. తెగుళ్ల నివారణ బాధ్యతను పూర్తిగా ప్రభుత్వమే తీసుకుంటుందని కూడా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

అస‌లు విష‌యానికి వ‌స్తె గ‌తంలో రేయిన్ గ‌న్స్ ప‌థ‌కం ప్ర‌వేశ పెట్టారు. ఈ ప‌థ‌కం అద్భుతంగా ప‌నిచేసిందంటూ మ‌హాగొప్ప‌గా సెల‌విచ్చారు. దానికోసం కోట్లు ఖ‌ర్చు చేశారు. ఆడ‌బ్బంతా ఎవ‌రి జేబుల్లోకి వెల్లింది. అదంతా కాంట్రాక్ట‌ర్ల‌ను బ్ర‌తికించ‌డంకోసం. రేయిన్ గ‌న్స్ వ‌ల్ల రైతుల‌కు ఉప‌యోగం లేద‌ని తెలిసింది. అస‌లు ఇప్పుడు ఆప‌థ‌కం ఎక్క‌డుందో ఎవ్వ‌రికి తెలీయ‌దు. అస‌లు సీఎం బాబుకు గుర్తుందో లేదో తెలియ‌దు.

ఇప్పుడు మ‌రో కొత్త ప‌థ‌కానికి తెర‌లేపారు. అదికూడా డ్రోన్‌ల ద్వారా పొలాల్లో పుర‌గుల మందును పిచికారి చేయిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అది సాధ్య‌మా…? దానికి ఎంత ఖ‌ర్చు అవుతుంది. అస‌లు ఆఖ‌ర్చు ఎవ‌రు భ‌రిస్తారు అంటె దానిలో క్లారిటీ లేదు. దీనికి కూడా వంద‌ల కోట్లు ఖ‌ర్చు అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భుత్వ‌మే డ్రోన్ల ద్వారా ఆ ప‌ని చేస్తుందా లేకా వాటిని రైతుల‌కే అప్ప‌గిస్తుందా అనేది క్లారిటీలేదు. ఇదంతా చూస్తె త‌న అనుయాకుల‌కు, ప్ర‌యివేటు సంస్థ‌ల‌కు కోట్లాది రూపాయ‌ల‌ను దోచిపెట్టేదానికి ఇది మ‌రో ప‌థ‌కంలా మారుతుంది. రేయిన్స్ గ‌న్స్ ఎక్క‌డకు వెల్లిందో…ఇక డ్రోన్‌ల ప‌థ‌కం కూడా ఎక్క‌డికి వెల్తుందో.

రైతులు పోలాల‌కు మందులు పిచికారి చేసె ప‌రిస్థితుల్లో లేరా.. దాని వ‌ల్ల రైతుల‌ను పని ఉండ‌టంతోపాటు ఎంతో మంది పేద‌లు కూలీలుగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. అంటె వారంద‌రి క‌డుపు కొట్టేదానికి బాబు స‌మాయ‌త్త‌వుతున్నారు. అస‌లు రైతుల‌కు కావాల్సింది ఏంది…?

రైతులు ఎందుకు న‌ష్ట‌పోతున్నారు. పండించిన పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర‌లు లేక అప్పుల కూబిలో కూరుకు పోతున్నారు. రైతుల‌నుంచి త‌క్కువ ధ‌ర‌ల‌కు పంట‌ల‌ను ద‌ళారులు కొనుగోలు చేయ‌డం…దాన్ని అధిక ధ‌ర‌కు అమ్ముకోవ‌డం వ‌ల్ల వాల్లు బాగుప‌డుతున్నారు త‌ప్ప రైతులు కాద‌నేది తెలిసిందే. ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను అరిక‌ట్టి గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డి బాబో అని రైతులు మొత్తుకుంటుంటే…దాన్ని ప‌ట్టించుకోకుండా డ్రోన్లుల‌తో మందుల‌ను పిచికారి చేస్తామంటె ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -