Sunday, May 5, 2024
- Advertisement -

హమ్మ బాబోయ్… నంది అవార్డ్స్ వెనుక అసలు కుట్ర… దిమ్మతిరిగిపోయే చంద్రబాబు స్కెచ్

- Advertisement -

ప్రపంచానికే పాఠాలు చెప్పా……. నాకంటే అనుభవజ్ఙుడు ఎవడూ లేడు అని చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటాడు కానీ ఆయన అనుభవం మొత్తం కూడా రాజకీయ విలువలను దిగజార్చడం విషయంలోనే ఉంది. సీట్ల బేరాలను పబ్లిక్‌గా నిర్వహించింది, అవినీతికి రేట్లు పెట్టింది…..ఇంకా ఎన్నో వ్యవహారాల్లో చంద్రబాబు హస్తం గురించి ఎన్నో ఎన్నో కథనాలు వచ్చాయి. ఇక న్యాయవ్యవస్థతో సహా అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ మేనేజ్‌మెంట్ కింగ్ అనిపించుకున్నాడు. అలాగే ఏ కులం రాజకీయ నాయకుడిపైకి అదే కులం నాయకుడిని ఎగదోయడం, కులాల కుంపట్లను తన రాజకీయాలకు అనుకూలంగా ఎంత గొప్పగా మార్చుకోవచ్చు అనే విషయాల్లో చంద్రబాబు ఎప్పుడో మాస్టర్ డిగ్రీ చేశాడు.

ఇక చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన వళ్ళ జరిగిన ఒక పెద్ద తప్పిదాన్ని జనాలు పూర్తిగా మర్చిపోయేలా…… మరో కొత్త ఇష్యూని వాళ్ళ ముందుకు తీసుకురావడంలో సిద్ధహస్తుడు. ఐదు కోట్లతో ఎమ్మెల్సీని బేరాలాడుతూ వీడియో సాక్ష్యాలతో, బ్రీఫింగ్ ఇస్తూ ఆడియో సాక్ష్యాలతో….. ఇంకా ఎన్నో ఆధారాలున్నా కేసుని మేనేజ్ చేయడంలో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యారు. అందుకోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టాడన్న విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఆ విషయం పక్కనపెడితే తాజాగా నంది అవార్డుల ప్రకటన వెనుక ఉన్న కుట్రకోణాన్ని కూడా సోషల్ మీడియా జనాలు బయటపెట్టారు. ఈ విషయాన్ని సాక్షి మీడియాతో సహా ఏ ఒక్కరూ జనాల దృష్టికి తీసుకురాలేకపోయారు. అఫ్కోర్స్…. .చంద్రబాబు భజన మీడియా ఎలాగూ ఇలాంటి విషయాలను దాచేస్తుందనుకోండి.

ఇలాంటి కుట్రలు బయటపడినా దాచేయడానికో, కవర్ చేయడానికి విపరీతంగా ప్రయత్నాలు చేసేస్తుంది బాబు భజన మీడియా. అయితే సోషల్ మీడియా మాత్రం ఇప్పుడు సూపర్ యాక్టివ్‌గా ఉంది. అందుకే ఆ మధ్య లోకేష్, చంద్రబాబులిద్దరూ కూడా సోషల్ మీడియాపై కక్ష కట్టినట్టుగా అరెస్టుల పర్వం సాగించారు. అయితే సోషల్ మీడియా జనాలు మాత్రం తగ్గింది లేదు. తాజాగా నంది అవార్డుల ప్రకటన వెనుక ఉన్న బాబు మేనేజ్‌మెంట్ తెలివితేటలను కూడా వాళ్ళే బయటపెట్టారు. నిజానికి నంది అవార్డుల ఎంపిక ఎప్పుడో ఆరు నెలల క్రితమే పూర్తయిపోయింది. అయితే ఆరు నెలలుగా ప్రకటించని చంద్రబాబు ఇప్పుడే ఎందుకు ప్రకటించింది? అవార్డులు ఎప్పుడో జనవరి నెల రెండో భాగంలో ఇస్తాం అని అవార్డుల ప్రకటన సందర్భంగా ప్రభుత్వమే చెప్పింది. మరి రెండు నెలల ముందుగా ఎందుకు ప్రకటించారు? సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న ఈ క్రింది న్యూస్ చదివి మీరే తెలుసుకోండి.

ఈ నెల 12వ తేది సాయంత్రం ఏపీలో కృష్ణా న‌ది బోటు ప్ర‌మాదం జ‌రిగి 22 మంది ప్రాణాలు కోల్పోయి రాష్ట్ర‌మంతా శోక సంద్రంలో ఉంటే.. ఆ ప్ర‌మాదం పై వార్తా కథనాలు లేవ్.. నిపుణుల అభిప్రాయాలు లేవ్.. ప్ర‌మాదం పై విశ్లేష‌న‌లు ల‌ేవ్‌.

ప్ర‌మాదం జ‌రిగిన రెండవ రోజు అంటే ఈ నెల 14వ తేది ఉదయం ఆ ప్ర‌మాద టాపిక్ డైవ‌ర్ట్ చేయ‌డానికి.. నంది అవార్డ్స్ ప్రకటించడం, దానికి కొనసాగింపుగా కొందరు సినీ ప్రముఖులు వివాదాలు, విమర్శలు చెయ్యడం. దానికి కొనసాగింపుగా కొన్ని మీడియా సంస్థలు పుంఖానుపుంఖాలుగా వార్తా కథనాలు, విశ్లేషణలు అందిచడం……

“దొంగ …..—-కొడుకులు అసలే మసలే ధూర్తలోకం” అని మహాకవి శ్రీశ్రీ గారు కడుపు మండిపోయి అన్నది ఇలాంటి వారినుద్దేశించే కదా….??

అదీ మేటర్. కడుపు మండిన జనాలు కాబట్టి శ్రీ శ్రీగారి ఘాటు మాటలను కూడా ప్రస్తావించారు. 22 మంది చనిపోతే ఇలాంటి మేనేజ్‌మెంట్ కుట్రలకు పాల్పడేవాళ్ళ గురించి రాసేటప్పుడు ఆవేశపడ్డారు. వాళ్ళ ఆవేశం తప్పే అయినా కూడా సమాచారం మాత్రం కచ్చితంగా వాస్తవం అని మాత్రం చెప్పొచ్చు. ఏమంటారు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -