- Advertisement -

జయలలిత మరణం వెనక సీక్రెట్స్ ఇవే!

- Advertisement -
jayalalitha death mystery revealed doctors giving wrong medicine to jayalalitha

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణంపై చాలా వార్తలే వచ్చాయి. అయితే ఈ మరణం వెనక ఉన్న మిస్టరీపై వినిపిస్తున్న గుసగుసలు నిజమేనా అనడానికి ఓ సాక్ష్యం దొరికింది. మధుమేహంతో బాధపడుతున్న జయలలితకు తప్పుడు మందులు ఇవ్వటంతో ఆస్పత్రి పాలయ్యారు అనే న్యూస్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవీ కన్సల్టింగ్ ఎడిటర్ బర్ఖాదత తన సహచరులకు, యాజమాన్యానికి పంపిన ఈమెయిల్ ఈ ప్రశ్నలన్నిటికీ ఔననే సమాధానం ఇస్తోంది.

సెప్టెంబరు 22న జయలలితను తమ వద్దకు తీసుకొచ్చేటప్పటికే.. ఆమెకు డయాబెటి్ సకు(చక్కెరవ్యాధి) సంబంధించి ఇవ్వాల్సిన ఔషధాలు కాకుండా వేరే ఔషధాలు ఇస్తున్నట్టు అపోలో యాజమాన్యం తనతో చెప్పినట్టు బర్ఖాదత ఆ మెయిల్ లో(ఆఫ్ ద రికార్డుగా పేర్కొంటూ) వివరించారు. మామూలుగా అయితే ఈ వివరాలు బయటికి వచ్చేవి కావేమోగానీ.. రీసెంట్ గా బర్ఖాదత ఈమెయిల్ ట్విటర్ ఖాతాలను హ్యాక్ చేసిన హ్యాకర్ల గ్రూపు బర్ఖాదత ఇన్ బాక్స్ లోని ఈ మెయిల్ ను బయటపెట్టింది.

కాగా.. జయ చికిత్సపై శ్వేతపత్రం విడుదల చేయాల్సిందిగా విపక్షనేత, డీఎంకే అధినేత కరుణానిధి తనయుడు స్టాలిన్ పట్టాళి మక్కళ్ కట్చి(పీఎంకే) అధినేత ఎస్ రాందాస్ డిమాండ్ చేశారు. అలాగే.. జయలలిత మరణం వెనుక ఉన్న నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు అపోలో ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డికి, ఎండీ ప్రీతారెడ్డికి, జయ నెచ్చెలి శశికళకు నిజనిర్దారణ పరీక్షలు నిర్వహించాలని మద్రాసు హైకోర్టులో పిల్ దాఖలైంది. ప్రముఖ సామాజిక సేవకుడు ట్రాఫిక్ రామస్వామి కూడా.. ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టులో పిల్ వేశారు. మరోవైపు.. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడును కలుసుకుని.. జయ మరణంపై సీబీఐ వి చారణ కోరారు.

Related

  1. జయలలిత తరవాత నేనే .. ఈ అమ్మాయి ఎవరు ?
  2. జయలలిత రూట్ లోనే కరుణానిధి ? ఏ క్షణం ఏమైనా జరగచ్చు ? సీరియస్ గా ఉంది !
  3. జయలలిత మరణ వార్త విని.. ఎంత మంది చనిపోయారంటే?
  4. జయలలితకు అంతా తెలిసినా సరే ఏమీ చేయలేకపోయింది..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -